For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పన్నీర్ నగ్గెట్'స్ రిసిపి తయారీ విధానం

పేరు వినగానే నోరూరట్లేదూ? పన్నీర్ భారతీయులకి చాలా ఇష్టమైన ఆహార పదార్థం అందుకే దాదాపు ప్రతి భారతీయ వంటిట్లో కన్పిస్తుంది. ఇందులో ప్రొటీన్ ఎక్కువగా ఉండి క్యాలరీలు తక్కువగా ఉంటాయి!

Written By: DEEPTHI T A S
|
పన్నీర్ నగ్గెట్'స్ రిసిపి | ఎలా తయారుచేయాలి పన్నీర్ నగ్గెట్'స్ రిసిపి | Boldsky

పేరు వినగానే నోరూరట్లేదూ? పన్నీర్ భారతీయులకి చాలా ఇష్టమైన ఆహార పదార్థం అందుకే దాదాపు ప్రతి భారతీయ వంటిట్లో కన్పిస్తుంది. ఇందులో ప్రొటీన్ ఎక్కువగా ఉండి క్యాలరీలు తక్కువగా ఉంటాయి!

అందుకని, మీరు దాని రుచి మరియు పోషక విలువలు రెండిటితో లాభపడతారు. పన్నీర్ కి సంబంధించి మంచి విషయం ఏంటంటే అది మనం ఏ వంటక పద్ధతికి జతచేసినా దానిలో ఇమిడిపోతుంది.

ఈ రెసిపిలో, పన్నీర్ నగ్గెట్’స్ చేయటం ఎంత సులభమో తెలుసుకుందాం. శాకాహారులు నగ్గెట్’స్ ఎంజాయ్ చేయరాదని ఎవరన్నారు? ఇప్పుడు మనకి ప్రత్యామ్నాయం కూడా దొరికింది – పన్నీర్ నగ్గెట్’స్ తో. దీన్ని ఎటువంటి బాధా లేకుండా హాయిగా ఆరగించవచ్చు.

పన్నీర్ నగ్గెట్’స్ ఎలా తయారుచేయాలో తెలుసుకోటానికి వీడియో మరియు స్టెప్ బై స్టెప్ తయారీ విధానం, చిత్రాలతో చూసి తెలుసుకోండి.

పన్నీర్ నగ్గెట్’స్ రెసిపి । పన్నీర్ నగ్గెట్’స్ ఎలా తయారుచేయాలి । ఇంట్లో తయారుచేసే పన్నీర్ నగ్గెట్’స్
పన్నీర్ నగ్గెట్’స్ రెసిపి । పన్నీర్ నగ్గెట్’స్ ఎలా తయారుచేయాలి । ఇంట్లో తయారుచేసే పన్నీర్ నగ్గెట్’స్
Prep Time
30 Mins
Cook Time
10M
Total Time
40 Mins

Recipe By: కావ్య

Recipe Type: స్టార్టర్

Serves: 2-3కి

Ingredients
  • పనీర్ -200 గ్రాములు

    బ్రెడ్ ముక్కలు - 4

    అల్లం - ½ చెంచా

    వెల్లుల్లి - ½ చెంచా

    మిరియాల పొడి - 1 ½ చెంచా

    కారం - 1 చెంచా

    నిమ్మకాయ - అర చెక్క

    మొక్కజొన్న పిండి - ½ కప్పు

    మైదాపిండి - 2 చెంచా

    కొత్తిమీర - ఒక బౌల్ లో (తరిగినది)

    నూనె - 2 కప్పులు

How to Prepare
  • 1.ఒక పెద్ద గిన్నె తీసుకుని, అల్లం, వెల్లుల్లి పేస్టును దానిలో వేయండి.

    2.ఒక చెంచా ఎర్రకారం వేయండి.

    3.అరచెంచా మిరియాల పొడి, రుచికి ఉప్పును వేయండి.

    4.ఇప్పుడు 1 కప్పు తరిగిన కొత్తిమీరను వేసి, నిమ్మరసం పిండండి.

    5.బాగా కలిపి తరిగిన పన్నీర్ ముక్కలు వేయండి.

    6.మిశ్రమం మొత్తం బాగా కలిసేట్టు 30 నిమిషాలు అలా నాననివ్వండి.

    7.నాలుగు బ్రెడ్ ముక్కలను తీసి మిక్సీలో క్రంబ్స్ లాగా ముక్కలు చేయండి.

    8.ఈ బ్రెడ్ క్రంబ్స్ ను వేడిచేసిన నూనె ఉన్న పెనంలో వేయండి.

    9.3నుంచి 4 నిమిషాలు తక్కువ మంటపై ఉంచి, బంగారు గోధుమ రంగులోకి వచ్చేదాకా కలపండి.

    10. ప్లేట్లోకి తీసుకుని, మాములు గది ఉష్ణోగ్రతలోనే చల్లబడనివ్వండి.

    11.ఇప్పుడు, మీడియం సైజు గిన్నె తీసుకుని అరకప్పు మొక్కజొన్న పిండిని వేయండి.

    12. 2 చెంచాల మైదాను వేసి, అరచెంచా మిరియాల పొడిని వేయండి.

    13.చిటికెడు ఉప్పు, కొన్ని నీళ్ళు పోసి, గడ్డలు లేకుండా బాగా కలపండి.

    14. ఇప్పుడు మెరినేటడ్ పన్నీర్ ముక్కలు తీసుకుని, ఈ మిశ్రమంలో ముంచండి.

    15. తర్వాత ఈ ముక్కలను బ్రెడ్ క్రంబ్స్ పొడిపై దొర్లించి, నూనెలో వేయండి.

    16.బంగారు బ్రౌన్ రంగు వచ్చేదాకా వేగనివ్వండి.

    17. బంగారు రంగులోకి మారాక, నూనె నుంచి తీసేసి టమాటా కెచప్ తో వేడివేడిగా వడ్డించండి.

Instructions
  • పన్నీర్ వేసేముందు నూనె బాగా కాగేలా చూసుకోండి. దానివల్ల పన్నీర్ ఎక్కువ నూనె పీల్చుకోదు.
Nutritional Information
  • వడ్డించే పరిమాణం - 2 -3 ముక్కలు
  • క్యాలరీలు - 325 క్యాలరీలు
  • కొవ్వు - 6 గ్రా
  • ప్రొటీన్ - 11గ్రా
  • కార్బొహైడ్రేట్లు - 61 గ్రా
  • చక్కెర - 19గ్రా
  • ఫైబర్ - 8 గ్రా

1.ఒక పెద్ద గిన్నె తీసుకుని, అల్లం, వెల్లుల్లి పేస్టును దానిలో వేయండి.

2.ఒక చెంచా ఎర్రకారం వేయండి.

3.అరచెంచా మిరియాల పొడి, రుచికి ఉప్పును వేయండి.

4.ఇప్పుడు 1 కప్పు తరిగిన కొత్తిమీరను వేసి, నిమ్మరసం పిండండి.

5.బాగా కలిపి తరిగిన పన్నీర్ ముక్కలు వేయండి.

6.మిశ్రమం మొత్తం బాగా కలిసేట్టు 30 నిమిషాలు అలా నాననివ్వండి.

7.నాలుగు బ్రెడ్ ముక్కలను తీసి మిక్సీలో క్రంబ్స్ లాగా ముక్కలు చేయండి.

8.ఈ బ్రెడ్ క్రంబ్స్ ను వేడిచేసిన నూనె ఉన్న పెనంలో వేయండి.

9.3నుంచి 4 నిమిషాలు తక్కువ మంటపై ఉంచి, బంగారు గోధుమ రంగులోకి వచ్చేదాకా కలపండి.

10. ప్లేట్లోకి తీసుకుని, మాములు గది ఉష్ణోగ్రతలోనే చల్లబడనివ్వండి.

11.ఇప్పుడు, మీడియం సైజు గిన్నె తీసుకుని అరకప్పు మొక్కజొన్న పిండిని వేయండి.

12. 2 చెంచాల మైదాను వేసి, అరచెంచా మిరియాల పొడిని వేయండి.

13.చిటికెడు ఉప్పు, కొన్ని నీళ్ళు పోసి, గడ్డలు లేకుండా బాగా కలపండి.

14. ఇప్పుడు మెరినేటడ్ పన్నీర్ ముక్కలు తీసుకుని, ఈ మిశ్రమంలో ముంచండి.

15. తర్వాత ఈ ముక్కలను బ్రెడ్ క్రంబ్స్ పొడిపై దొర్లించి, నూనెలో వేయండి.

16.బంగారు బ్రౌన్ రంగు వచ్చేదాకా వేగనివ్వండి.

17. బంగారు రంగులోకి మారాక, నూనె నుంచి తీసేసి టమాటా కెచప్ తో వేడివేడిగా వడ్డించండి.

[ 4.5 of 5 - 35 Users]
English summary

paneer nuggets recipe | how to prepare paneer nuggets | homemade paneer nuggets | how to make paneer nuggets recipe

Doesn't this make your mouth water just by the name of it? Paneer is the most-loved Indian food that finds its way to every Indian kitchen. It is packed with protein and is also very low in calories!
Desktop Bottom Promotion