Latest Updates
-
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి!
Seize the pulav: పవన్ కళ్యాణ్ కి చాలా ఇష్టమైన 'చికెన్ పులావ్'..తింటే మైమరిచిపోవాల్సిందే
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చికెన్ పులావు(chicken pulav)అంటే చాలా ఇష్టంగా తింటారు అని ఆయన తల్లి అంజనాదేవి ఓ సందర్భంలో చెప్పారు. పవన్ అన్న నాగబాబు కూడా ఓ సందర్భంలో తన తమ్ముడు పవన్ కి చాలా చాలా ఇష్టమైన ఫుడ్ అంటే చికెన్ పులావే అని చెప్పారు. అయితే పవన్ కళ్యాణ్ కి ఎంతో ఇష్టమైన చికెన్ పులావ్ ని చాాలా సింపుల్ గా టేస్టీగా ఎలా చేసుకోవచ్చో ఇక్కడ చూడండి.
చికెన్ పులావ్ తయారీకి కావాల్సిన పదార్ధాలు
-12 యాలకులు
-25 లవంగాలు
-8 ఇంచుల దాల్చిన చెక్క
-2 టీస్పూన్ల షాజీరా
-4 జాపత్రి ఆకులు
-3 అనాస పువ్వులు
-ఆయిల్
-2 ఉల్లిపాయలు
-1 కట్ట కొత్తిమీర
-కొంచెం పుదీనా ఆకులు
-ఒకటిన్నర కేజీ చికెన్
-ముప్పావు కిలో రైస్
-3 బిర్యానీ ఆకులు
- 2 ఇంచులు అల్లం
- 4 పచ్చిమిర్చి
-కొంచెం కసూరి మెతి
-రాతి పువ్వు
-రుచికి సరిపడా కారం
-చిటికెడు పసుపు
-తగినంత ఉప్పు

చికెన్ పులావ్ తయారీ విధానం
-ముందుగా ఓ ప్లేట్ లోకి 12 యాలకులు,25 లవంగాలు,8 ఇంచుల దాల్చిన చెక్క,2 టీస్పూన్ల షాజీరా,4 జాపత్రి ఆకులు,3 అనాస పువ్వులు.
-ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసి వేడి చేయండి.
-ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో ముందుగా ప్లేట్ లోకి తీసుకున్న మసాలాలన్నీ పూర్తిగా కాకుండా ఒక్కొక్కటి 80శాతం వరకు వేసేయండి. అందులోనే 2 తరిగిన ఉల్లిపాయలు,అర టీ స్పూన్ ఉప్పు కూడా వేసి తక్కువ మంట మీద వేయించుకోండి.
-కొంచెం ఫ్రై అయ్యాక అందులో కట్ చేసిన మీడియం సైజు టమాటోలు రెండు,2 ఇంచుల అల్లం ముక్కలు,10 వెల్లుల్లి రెబ్బలు వేసి ఫ్రై చేయండి.
-ఒక నిమిషం తర్వాత కట్ చేసిన 4 పచ్చి మిరపకాయలు,కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా,చిటికెడు పసుపు వేసి 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి.
-ఇప్పుడు ఈ మొత్తాన్ని మిక్సీలో వేసి పేస్ట్ లా చేసుకోండి.
-ఇప్పుడు స్టవ్ మీద ఒకటిన్నర కేజీ చికెన్, ముప్పావు కిలో రైస్ పట్టేటంత ప్రెజర్ కుక్కర్ పెట్టి అందులో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్, 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి వేడి చేయండి.
-ఇప్పుడు ఇందులోనే ముందుగా ప్లేట్ లో తీసుకొని కొంచెం మిగిలి ఉన్న 2 యాలకులు, 3 లవంగాలు,కొద్దిగా జాపత్రి,కొంచెం దాల్చిన చెక్క,3 బిర్యానీ ఆకులు,షాజీర కొంచెం,రాతిపువ్వు కొంచెం,1 టీ స్పూన్ కసూరి మెతి వేసుకొని కలపడండి.
-ఇఫ్పుడ ఇందులో ముందుగా కడిగి ఉంచిన ఒకటిన్నర కేజీ చికెన్ ముక్కలను వేసి 5-10నిమిషాలు కలబెడుతూ మగ్గనివ్వండి.
-ఇప్పుడు మిక్సీలో వేసి చేసి ఉంచిన మిశ్రమాన్ని ,కొంచెం కారం చికెన్ లో వేసి బాగా కలపండి. ఇందులోనే కొంచెం కొత్తిమీర,పుదీనా వేయండి.
-5 నిమిషాలు మగ్గిన తర్వాత అందులో ఉప్పు ఒకటిన్నర టీ స్పూన్ వేసి కలపాలి.
-ఇప్పుడు నాలున్నర గ్లాసుల నీళ్లు అందులో పోయండి. నీరు మరిగిన తర్వాత అందులో శుభ్రంగా కడిగిన 3 గ్లాసుల రోజూ మనం తినే బియ్యమే అందులో వేయండి.
-ఇఫ్పుడు దాన్ని పై పైన కలిపి కావాలి అనుకుంటే కొంచెం ఉప్పు వేసుకొని మూత పెట్టేయండి.
-2 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ మూత తీసి చూస్తే వేడి వేడి పులావ్ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications