Latest Updates
-
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
సంపూర్ణ ఆరోగ్యం కోసం ఒకే వంటకం..అరికెల పొంగలి ఎలా చేసుకోవాలంటే
అరికెల పొంగలి..ఒక ఆరోగ్యకరమైన, రుచికరమైన దక్షిణ భారతీయ వంటకం. ఇది అరికెలు,పెసర పప్పుతో తయారు చేస్తారు.ఇది పోషకమైన, తేలికగా జీర్ణమయ్యే ఆహారం. దీనిని సాధారణంగా బ్రేక్ ఫాస్ట్ లేదా నైట్ డిన్నర్ గా తీసుకుంటారు. గ్లూటెన్ లేని ఆహారం కోసం చూస్తున్న వారికి ఇది ఒక అద్భుతమైన ఎంపిక. మీ రోజువారీ ఆహారంలో దీనిని చేర్చుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. అరికెలు ఫైబర్, ప్రోటీన్, విటమిన్లు ముఖ్యంగా B విటమిన్,ఐరన్, మెగ్నీషియం, భాస్వరం సమృద్ధిగా ఉంటాయి. పెసర పప్పు కూడా ప్రోటీన్, ఫైబర్ కు మంచి మూలం.
అరికెలు శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపడంలో సహాయపడతాయి. అరికెలలో ఉండే పోషకాలు శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి. ఆరోగ్యానికి అద్భుతమైన ప్రయోజనాలు అందించే అరికెల పొంగలి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇక్కడ చూడండి.

అరికెల పొంగలి తయారీకి కావాల్సిన పదార్థాలు
-అరికెలు - 1 కప్పు
-పెసర పప్పు - 1/2 కప్పు
-నీరు - 4 కప్పులు
-నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు
-ఆవాలు - 1/2 టీ స్పూన్
-జీలకర్ర - 1 టీ స్పూన్
-అల్లం తురుము - 1 టీ స్పూన్
-పచ్చి మిర్చి- 2-3
-కరివేపాకు - కొన్ని రెబ్బలు
-ఇంగువ - చిటికెడు
-మిరియాల పొడి - 1/2 టీ స్పూన్
-ఉప్పు - రుచికి సరిపడా
-కొత్తిమీర- కొద్దిగా
Ragi Burfi: రాగి పిండి,బెల్లంతో..నోట్లో వెన్నలా కరిగిపోయే రాగి బర్ఫీ..ఎలా చేసుకోవాలంటే
అరికెల పొంగలి తయారీ విధానం
-ముందుగా అరికెలు, పెసర పప్పును విడివిడిగా కడిగి కనీసం అరగంట సేపు నానబెట్టండి.
తర్వాత ఒక ప్రెషర్ కుక్కర్ లో నానబెట్టిన అరికెలు, పెసర పప్పు, 4 కప్పుల నీటిని తీసుకోండి. రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపండి. కుక్కర్ మూత పెట్టి మీడియం మంటపై 3-4 విజిల్స్ వచ్చే వరకు లేదా అరికెలు, పెసర పప్పు మెత్తగా ఉడికే వరకు ఉడికించి మంట ఆపి ఆవిరి పూర్తిగా పోయిన తర్వాత మూత తెరవండి.
-ఇప్పుడు ఒక చిన్న పాన్ లో నెయ్యి వేడి చేయండి. నెయ్యి కరిగాక అందులో ఆవాలు వేసి అవి చిటపటలాడటం ప్రారంభించగానే జీలకర్ర వేసి దోరగా వేయించండి. ఆ తర్వాత తురిమిన అల్లం, తరిగిన పచ్చి మిర్చి, కరివేపాకు, ఇంగువ వేసి అల్లం పచ్చి వాసన పోయే వరకు వేయించండి.
-ఇప్పుడు ఉడికించిన అరికెల మిశ్రమంలో ఈ పోపును వేసి మిరియాల పొడి కూడా కలిపి బాగా కలపండి. అవసరమైతే మరికొంత వేడి నీరు కలిపి మీకు నచ్చిన విధంగా పొంగలి చిక్కదనాన్ని సర్దుబాటు చేసుకోవచ్చు.
-చివరగా తరిగిన కొత్తిమీరతో అలంకరించి వేడివేడిగా సర్వ్ చేయండి. కావాలనుకుంటే నెయ్యిలో దోరగా వేయించిన జీడిపప్పును దీంట్లో వేసి కలుపుకోండి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
