Latest Updates
-
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.!
మిగిలిపోయిన అన్నంతో 5 నిమిషాల్లోనే టేస్టీ కారం అన్నం..ఎలా చేసుకోవాలంటే
ఇంట్లో ఏం కూరగాయలు లేనప్పుడు లేదా రాత్రి మిగిలిపోయిన అన్నం ఉన్నం ఉంటే ఓ సారి కారం రైస్ రెసిపి ట్రై చేసి చూడండి. ఒక్కసారి తిన్నారంటే మళ్లీ మళ్లీ కావాలని ఇంట్లో గోల చేయడం గ్యారెంటీ. అంత రుచికరంగా ఉంటుంది. దీనిని చేయడం కూడా చాలా చాలా ఈజీ.ఇది ఒక అద్భుతమైన బ్రేక్ ఫాస్ట్ లేదా సాయంత్రం పూట స్నాక్ గా పనిచేస్తుంది. బ్యాచిలర్లు కూడా చాలా ఈజీగా చేసుకునే వంటకం ఇది. అప్పుడే వండిన అన్నంతో కూడా చేసుకోవచ్చు. లంచ్ బాక్సుల్లోకి ఫర్ఫెక్ట్ గా ఉంటుంది. ఈ రెసిపీని మీ రుచి, అందుబాటులో ఉన్న పదార్థాలకు అనుగుణంగా మార్చుకోవచ్చు. మీరు వివిధ రకాల కూరగాయలు, మసాలాలు లేదా పప్పులను జోడించవచ్చు.. ఇది వంటకానికి మరింత పోషకాన్ని, రుచిని ఇస్తుంది. ఇంట్లో కేవలం 5 నిమిషాల్లో కారం రైస్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.
కారం రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలు
-కారం
-అన్నం
-ఆయిల్
-కరివేపాకు
-కొత్తిమర
-ఆవాలు
-జీలకర్ర
-పచ్చి శెనగపప్పు
-పల్లీలు
-మిరపకాయ
-అల్లంవెల్లుల్లి పేస్ట్
-ఉప్పు

కారం రైస్ తయారీ విధానం
-ముందుగా రాత్రి మిగిలిపోయిన అన్నం ఒక పెద్ద కప్పుని బౌల్ లోకి తీసుకోండి.
-అన్నంలో 1 టీస్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు వేసి కలుపుకోండి.
-తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడి చేసి 1 టీస్పూన్ తాళింపు గింజలు(ఆవాలు,జీలకర్ర,పచ్చి శెనగపప్పు),1 టేబుల్ స్పూన్ పల్లీలు వేసి ఫ్రై చేసుకోండి.
-తాళింపు గింజలు, పల్లీలు వేగిన తర్వాత అందులో పావు టీస్పూన్ అల్లంవెల్లుల్లి పేస్ట్, 1 రెమ్మ కరివేపాకు, 2 సన్నగా కట్ చేసిన పచ్చిమిరపకాయలు వేసి అల్లంవెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి.
-ఇప్పుడు అందులో ముందుగా కలిపి ఉంచిన కారం రైస్ వేసి కారానికి ఉన్న పచ్చివాసన పోయే దాకా మీడియం మంట మీద 1 నిమిషం పాటు కలుపుతూ వేయించాలి.
-చివర్లో 1 టీస్పూన్ గరం మసాలా, కొత్తిమీర తరుగు వేసి 1 నిమిషం కలిపి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే టేస్టీ కారం రెస్ రెడీ. ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకొని తింటుంటే ఆ మజానే వేరే లెవల్లో ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications