Latest Updates
-
కిడ్నీలు పాడవడానికి ముందు కనిపించే ముఖ్యమైన లక్షణాలు ఇవే -
ఇడ్లీ,దోశ,చపాతీల్లోకి కేక పుట్టించే చికెన్ నిర్వాణ..బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు -
పెద్ద ఎర్రిపప్ప అయ్యావ్ మావా: ప్రియురాలి కోసం మొత్తం అమ్మేసి 1900 కి.మీ ప్రయాణించి వెళ్తే..అసలు అమ్మాయే కాదట! -
దసరా స్పెషల్ నైవేద్యం చక్కెర పొంగలి..సంప్రదాయ పద్ధతిలో ఇలా చేస్తే ఇళ్లంతా డివోషనల్ వైబ్ -
దసరా స్పెషల్ కట్టె పొంగలి..ఇలా చేస్తే చల్లారినా కూడా గట్టిగా మద్ద అవ్వదు! -
దసరా నాడు అపరాజితా దేవి పూజ ఎలా చేయాలి? శుభ ముహూర్తం, మంత్రాలు, శమీ పూజ డీటెయిల్స్.. -
దసరా స్పెషల్ రెడ్ చికెన్.. చికెన్ కర్రీ వండేటప్పుడు ఈ సీక్రెట్ మసాలా వేస్తే టేస్ట్ నెక్ట్స్ లెవల్ అంతే! -
హ్యాపీ విజయదశమి 2026..మీ బంధుమిత్రులకు దసరా విషెస్ చెప్పండిలా.. -
దసరా స్పెషల్..పాకం పట్టే పనిలేకుండా ఈజీగా బెల్లం గవ్వలు చేసుకోండిలా..గుల్ల గుల్లగా భలే రుచిగా.. -
గోధుమ రవ్వ vs బొంబాయి రవ్వ..షుగర్ పేషెంట్ల ఆరోగ్యానికి ఏ ఉప్మా మంచిది?
హోటల్ స్టైల్ ఇడ్లీ కారం పొడి..బ్రేక్ ఫాస్ట్ లోకి చట్నీ కూడా వద్దంటారు..ఇంట్లోనే ఇలా చేసుకోండి..
మన తెలుగు వాళ్ల భోజనంలో పచ్చళ్లు లేదా చట్నీలకు ఎంత ప్రాముఖ్యత ఉందో పొడులకు కూడా అంతే ప్రాముఖ్యత ఉంటుంది. చాలామందికి టిఫిన్స్ లో వెరైటీల చట్నీలు వంద పక్కన పెట్టినా పొడుల కోసం వెతికే అలవాటు ఉంటుంది. హోటల్స్ కి వెళ్లినప్పుడు అక్కడ వడ్డించే ఇడ్లీ కారం పొడికి చాలామంది ఫ్యాన్స్ అయిపోతుంది. అయితే హోటల్ స్టైల్ ఇడ్లీ కారం పొడిని మన ఇంట్లోనే చాలా ఈజీగా తయారుచేసుకోవచ్చు. ఇది ఏ టిఫిన్స్ లోకి అయినా అద్దిరిపోతుంది.
నెయ్యి ఇడ్లీ, నెయ్యి దోశ, మసాలా దోశ వేసేటప్పుడు పైన వేసే కారం పొడిలా అయినా లేదా మినపవడల్లోకి, స్నాక్స్ లోకి అయినా ఏ కాంబినేషన్ లోకి అయినా పర్ఫెక్ట్ గా సెట్ అయ్యే కారం పొడి ఇది. ఇది ఫ్రిడ్జ్ లో పెడితే దాదాపు 2 నెలల వరకు నిల్వ ఉంటది, బయట ఉంచితే 3 వారాల వరకు ఫ్రెష్ గా ఉంటది. ఇంట్లో చేసుకుని టేస్ట్ చేసిన తర్వాత టిఫిన్స్ లోకి కారం పొడి ఇక ఇదే అని ఫిక్స్ అయిపోతారు. అంత రుచిగా ఉంటుంది. దీనిని ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

తయారీకి కావాల్సిన పదార్థాలు
-మినపప్పు
-పచ్చిశెనగపప్పు
-పుట్నాల పప్పు
-నువ్వులు
-కందిపప్పు
-నూనె
-బ్యాడిగి ఎండుమిరపకాయలు
-గుంటూరు ఎండుమిరపకాయలు
-ఉప్పు
-కరివేపాకు
-వెల్లుల్లి
-చింతపండు
-జీలకర్ర
-మెంతులు
-ఇంగువ
దసరా స్పెషల్ కట్టె పొంగలి..ఇలా చేస్తే చల్లారినా కూడా గట్టిగా మద్ద అవ్వదు!
తయారీ విధానం
-స్టవ్ మీద పాన్ పెట్టుకోండి. పాన్ వేడెక్కాక అందులో పావ కప్పు మినపప్పు, పావు కప్పు పచ్చి శెనగపప్పు వేసి దోరగా చిన్న మంట మీద వేయించుకోండి. దోరగా వేగిన తర్వాత వీటిని ఓ ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి.
-తర్వాత అదే పాన్ లో 2 టేబుల్ స్పూన్ల కందిపప్పు వేసి వేయించాలి. కందిపప్పు కొంచెం వేగిన తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్ల పుట్నాల పప్పు(శనగపప్పు), 2 టేబుల్ స్పూన్ల నువ్వులు వేసి జస్ట్ 1 నిమిషం పాటు ఆ వేడికి కొద్దిగా ఫ్రై చెయ్యాలి. తర్వాత వీటన్నింటని ప్లేట్ లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు అదే పాన్ లో అర టేబుల్ స్పూన్ నూనె వేసి వేడయ్యాక అందులో 1 టీస్పూన్ జీలకర్ర, అర టీస్పూన్ మెంతులు వేసి వేయించాక అందులో 12-15 బ్యాడిగి ఎండుమిర్చి, 6 గుంటూరు ఎండు మిర్చి వేసి నూనెలో వీటిని కూడా కాస్త వేయంచాలి. తర్వాత అందులో 2 రెమ్మల కరివేపాకు, కొద్దిగా చింతపండు వేసి ఒకసారి వేయించి కరివేపాకు కొంచెం కరకరలాడేలా మారిన తర్వాత స్టవ్ ఆపేయండి.
-వేయించినవన్నీ పూర్తిగా చల్లారనివ్వాలి.
-తర్వాత మిక్సీ జార్ లో వేయించినవన్నీ వేసి, ఇందులో 10 వెల్లుల్లి రెబ్బలు, పావు టీస్పూన్ ఇంగువ, రుచికి తగినంత ఉప్పు వేసి మొత్తాన్ని మొత్తగా గ్రైండ్ చేసుకోండి.
-గ్రైండ్ చేసుకున్న పొడిని ఒక ప్లేట్ లోకి తీసుకుని పూర్తిగా చల్లారిపోనివ్వండి. చల్లారిన తర్వాత డబ్బాలోకి తీసుకుని నిల్వ చేసుకోవచ్చు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
