Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
హోటల్ స్టైల్ పరోఠా షేర్వా..రుచి చూస్తే వదిలిపెట్టరు
వేడి వేడి పొరల పరోఠాను, స్పైసీగా ఉండే పలచటి షేర్వాలో ముంచుకుని తింటే ఆ రుచే వేరు. సాధారణంగా ఇంట్లో చేసే కుర్మా చిక్కగా ఉంటుంది, కానీ హోటల్స్ లో ఇచ్చే షేర్వా పలచగా, ఘాటుగా, విభిన్నమైన రుచిని కలిగి ఉంటుంది.
చాలామందికి హోటల్ స్టైయిల్ షేర్వా రుచి ఇంట్లో ఎందుకు రాదు అనే సందేహం ఉంటుంది. దానికి ప్రధాన కారణం అందులో వాడే మసాలా దినుసులు, తయారీ విధానం. హోటల్ స్టైల్ వెజ్ షేర్వా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
పచ్చి కొబ్బరి ముక్కలు - అర కప్పు
వేయించిన శనగపప్పు(పుట్నాలు)- 1 టేబుల్ స్పూన్
గసగసాలు - 1 టీస్పూన్
జీడిపప్పు - 5
సోంపు - 1 టీస్పూన్
మిరియాలు - అర టీస్పూన్
అల్లం - 1 చిన్న ముక్క
వెల్లుల్లి రెబ్బలు - 5
నూనె - 4 టేబుల్ స్పూన్లు
దాల్చిన చెక్క-చిన్న ముక్క
లవంగాలు-3
యాలకులు-2
బిర్యానీ ఆకు-1
స్టార్ పువ్వు-1
రాతి పువ్వు -కొంచెం
ఉల్లిపాయలు - 2
టమోటాలు - 2
పచ్చిమిర్చి - 3
పుదీనా - గుప్పెడు
కొత్తిమీర - గుప్పెడు
కారం - ఒకటిన్నర టీస్పూన్
ధనియాల పొడి - 1 టీస్పూన్
గరం మసాలా - అర టీస్పూన్
పసుపు - చిటికెడు
ఉప్పు - రుచికి సరిపడా
నీళ్లు - 4 కప్పులు
కరివేపాకు - రెండు రెమ్మలు
తయారీ విధానం
-ముందుగా మిక్సీ జార్ లో పచ్చి కొబ్బరి, వేయించిన శనగపప్పు (పుట్నాలు), గసగసాలు, జీడిపప్పు, సోంపు, మిరియాలు, అల్లం, వెల్లుల్లి వేసి కొద్దిగా నీళ్లు పోసి మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.
-ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక మందపాటి గిన్నె లేదా కుక్కర్ పెట్టుకోండి. అందులో నూనె వేసి వేడయ్యాక చెక్క, లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకు, స్టార్ పువ్వు వేసి వేయించండి. ఇవి వేగాక సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి ఉల్లిపాయలు బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి.
-ఉల్లిపాయలు వేగిన తర్వాత గుప్పెడు పుదీనా ఆకులను వేయండి. పుదీనా నూనెలో వేగాక తరిగిన టమోటా ముక్కలు వేసి మెత్తగా అయ్యే వరకు మగ్గనివ్వాలి. టమోటాలు గుజ్జుగా మారిన తర్వాత, అందులో పసుపు, కారం, ధనియాల పొడి వేసి పచ్చి వాసన పోయే వరకు 1 నిమిషం పాటు వేయించండి.
-ఇప్పుడు ముందుగా సిద్ధం చేసుకున్న కొబ్బరి మసాలా పేస్ట్ ను అందులో వేసి 2-3 నిమిషాల పాటు నూనె పైకి తేలే వరకు వేయించాలి.
-ఇప్పుడు అందులో సుమారు 3 నుండి 4 గ్లాసుల నీళ్లు పోయండి. రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపండి. మూత పెట్టి మీడియం మంటపై కనీసం 15 నుండి 20 నిమిషాల పాటు మరిగించాలి.
-చివరగా గరం మసాలా పొడి, సన్నగా తరిగిన కొత్తిమీర చల్లి మరో రెండు నిమిషాలు ఉంచి స్టవ్ ఆఫ్ చేయండి. ఆఖరులో గ్రేవీ పైన నూనె తెట్టులా తేలాలి. అంతే పరోఠా షేర్వా రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications