Latest Updates
-
రక్తహీనత సమస్యకి దివ్య ఔషధం.. పాలకూరతో ఇలా చేశారంటే మెతుకు కూడా వదిలిపెట్టరు.! -
మహిళల్లో పడిపోతున్న అండాల సంఖ్య.. ఈ కారణాలు తెలుసుకోకపోతే భారీ మూల్యం తప్పదు.! -
టేస్ట్, హెల్త్ ఒకేసారి..ఫైబర్, ప్రోటీన్ పుష్కలంగా ఉండే ఓట్స్ వెజిటబుల్ ఆమ్లెట్ ఎలా చేసుకోవాలంటే.. -
జూన్ 23: ఈ రాశుల వారికి అదృష్టం.. కాసుల వర్షం కురిసే ఛాన్స్! -
ఉల్లి, వెల్లుల్లి తినని వారికి బెస్ట్ ఛాయిస్.. సోయా వెజ్ ఖీమాతో బార్లీ దోశ -
వేంకటేశ్వరుడు మర్త్యలోకంలోకి ఎందుకు వచ్చాడు? అద్భుతమైన పురాణ కారణం -
మహిళలను వేధిస్తున్న పీసీఓఎస్ సమస్య.. వాళ్లు ఏం చేయాలి ఏం చేయకూడదో తెలుసా.? -
శరవణ భవన్ స్టైల్ వెన్ పొంగల్..కొబ్బరి చట్నీతో తింటే మర్చిపోలేరు! -
తప్పతాగి రోడ్డుకి అడ్డంగా పడుకున్న యువతి.. ఒక చేతిలో సిగరెట్, పక్కనే మందు బాటిల్తో రచ్చ.! -
మెరిసే ముఖం కోసం ఇంట్లోనే ఫేస్ ఆయిల్.. రోజూ ఉదయం ఇలా చేస్తే చాలు.!
కుక్కర్ లో చికెన్ బిర్యానీ..రెస్టారెంట్ కి మించిన టేస్ట్ తో..పొడిపొడిలాడుతూ సూపర్ గా ఎలా చేసుకోవాలంటే..
భారతీయ వంటకాల్లో బిర్యానీకి ప్రత్యేక స్థానం ఉంది. దాని ఘుమఘుమలు, సున్నితమైన రుచి, ప్రతి ముద్దలో ఉండే సుగంధాల కలయిక బిర్యానీని దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగానూ అత్యంత ఇష్టపడే వంటకంగా మార్చింది. సాధారణంగా బిర్యానీని పెద్ద పాత్రలలో దమ్ పద్ధతిలో తయారు చేయడం సంప్రదాయం. అయితే ఆధునిక జీవనశైలి, సమయాభావం వంటి కారణాల వల్ల చాలామంది ఈ సుదీర్ఘ ప్రక్రియను ఇష్టపడటం లేదు. ఈ సమస్యకు అద్భుతమైన పరిష్కారం ప్రెజర్ కుక్కర్ లో చికెన్ బిర్యానీ తయారు చేయడం.
కుక్కర్ లో చికెన్ బిర్యానీ కేవలం సమయాన్ని ఆదా చేయడమే కాకుండా, బిర్యానీకి అవసరమైన అన్ని రుచులను, సుగంధాలను అద్భుతంగా అందిస్తుంది. కుక్కర్లో బిర్యానీ చేయడం వల్ల చికెన్ ముక్కలు మెత్తగా ఉడికి, బియ్యానికి సుగంధాలు బాగా పట్టి, చాలా తక్కువ సమయంలోనే బిర్యానీ సిద్ధమవుతుంది. మీ ఇంట్లోనే కుక్కర్ లో చికెన్ బిర్యానీ పొడిపొడిలాడుతూ రుచిగా రావాలంటే ఎలా చేయాలో ఇక్కడ చూడండి.

తయారీకి కావాల్సిన పదార్థాలు
-చికెన్
-బాస్మతి రైస్
-కొత్తిమీర
-పుదీనా
-అల్లంవెల్లుల్లి పేస్ట్
-కారం
-పసుపు
-బిర్యానీ మసాలా
-బిర్యానీ ఆకు
-బిర్యానీ పువ్వు
-జాపత్రి
-స్టార్ అనాస
-యాలకలు
-లవంగాలు
-ధనియాల పొడి
-గరం మసాలా పౌడన్
-ఉప్పు
-పెరుగు
-ఆయిల్
-పచ్చిమిరపకాయలు
-ఉల్లిపాయలు
-టమాటో
-దాల్చిన చెక్క
-నెయ్యి

తయారీ విధానం
-ముందుగా 750 గ్రాముల బోన్ ఉన్న చికెన్ ను రెండుసార్లు శుభ్రంగా కడిగి ఓ బౌల్ లో వేయండి.
-చికెన్ లో రుచికి సరిపడా ఉప్పు, 1 టేబల్ స్పూన్ ధనియాల పొడి, 1 టీస్పూన్ గరం మసాలా పౌడర్, 1 టేబుల్ స్పూన్ అల్లంవెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టీస్పూన్ బిర్యానీ మసాలా, అర టీస్పూన్ పసుపు, 3 టేబుల్ స్పూన్ల పెరుగు వేసి మొత్తం బాగా కలిసేలా చేతితో కలిపి మూతపెట్టి అరగంట సేపు బౌల్ ను పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు మరో బౌల్ తీసుకొని అందులో 2 గ్లాసుల బాస్మతి రైస్ వేసి నీళ్లు పోసి రెండు మూడు సార్లు శుభ్రంగా కడగాక తగినన్ని నీళ్లు పోసి 10 నిమిషాలు నాననివ్వండి.
-తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టి అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేశాక అందులో అర టీస్పూన్ షాజీరా, బిర్యానీ పువ్వు కొంచెం, 2 ఇంచుల దాల్చిన చెక్క, 4 లవంగాలు, కొద్దిగా జాపత్రి, 1 బిర్యానీ ఆకు, 3 యాలకలు, 1 స్టార్ అనాస పువ్వు వేసి వీటన్నింటిని లైట్ గా వేగనివ్వండి.
-మసాలా దినుసులన్నీ లైట్ గా వేగాక అందులో పొడవుగా చీరుకున్న పచ్చిమిరపకాయలు, సన్నగా పొడవుగా కట్ చేసిన 3 మీడియం సైజ్ ఉల్లిపాయల ముక్కలు వేసి ఇవి బంగారు గోధుమ రంగులోకి మారేదాకా వేయించుకోండి.
-తర్వాత అందులో 1 టమాటొ పెద్ద ముక్కలు వేసి అవి మెత్తబడేదాకా వేయించుకోండి.
-ఇప్పుడు అందులో ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ ముక్కలను వేసి మీడియం మంట మీద చికెన్ ముక్కలలోని నీరు అంతా ఇంకిపోయి ఆయిల్ సపరేట్ అయ్యేదాకా వేయించుకోండి. ఈ సమయంలోనే ఉప్పు, కారం చెక్ చేసుకొని కావాలనుకుంటే వేసి కలుపుకోండి.
-చికెన్ ముక్కలలో నుంచి ఆయిల్ సపరేట్ అవుతున్న సమయంలో అందులో నానబెట్టిన బాస్మతి రైస్ వేసుకోండి. ఇందులోనే గుప్పెడు పుదీనా, గుప్పెడు కొత్తిమీర ఆకులు, 2 టీస్పూన్ల నెయ్యి, 3 గ్లాసుల నీళ్లు పోసి మెల్లగా కలిపి మూతపెట్టి 2 విజిల్స్ రానివ్వాలి.
-తర్వాత మూత తీసి చూస్తే పర్ఫెక్ట్ చికెన్ బిర్యానీ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications