Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
పుల్కా, చపాతీలోకి బెస్ట్ కాంబినేషన్..నోరూరించే మీల్ మేకర్ గ్రేవీ..ఎలా చేసుకోవాలంటే..
వాతావరణం చల్లగా ఉన్నప్పుడు వేడివేడిగా చపాతీలు లేదా పుల్కాలతో పాటు ఘాటుగా, స్పైసీగా నాన్ వెజ్ తినాలనిపిస్తుంది. కానీ ఇంట్లో మాంసం లేకపోవచ్చు లేదా ఆ రోజు తినకూడదు అనుకోవచ్చు. అలాంటి సమయంలో మీల్ మేకర్ తో అచ్చం చికెన్, మటన్ కూరను తలపించేలా రుచికరమైన గ్రేవీని తయారు చేసుకోవచ్చు.
కావలసిన పదార్థాలు
మీల్ మేకర్ - 2 కప్పులు
చిక్కటి పెరుగు - 2 టేబుల్ స్పూన్లు
పసుపు - 2 చిటికెలు
కారం - 1/2 టీస్పూన్
ఉప్పు - తగినంత
నూనె - 1 టీస్పూన్
బిర్యానీ ఆకులు - 2
సోంపు - 1 టీస్పూన్
ఉల్లిపాయలు - 2
కరివేపాకు - 1 రెమ్మ
పచ్చిమిర్చి - 2
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టీస్పూన్
కాశ్మీరీ కారం - 1 టీస్పూన్
సాధారణ కారం - 1 టీస్పూన్
టమోటాలు - 2
ధనియాల పొడి -రెండున్నర టీస్పూన్లు
చికెన్ మసాలా లేదా గరం మసాలా - ఒకటిన్నర టేబుల్ స్పూన్
వేడినీళ్లు - 3 కప్పులు
కొత్తిమీర - గార్నిష్ కోసం
పచ్చి కొబ్బరి తురుము - అర కప్పు
గసగసాలు - 1 టీస్పూన్
జీడిపప్పు - 5

తయారీ విధానం
-ముందుగా ఒక గిన్నెలో మీల్ మేకర్ వేసి, అందులో బాగా మరిగించిన వేడినీళ్లు పోసి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టండి. అవి మెత్తగా అయ్యాక, రెండు సార్లు చల్లటి నీటిలో కడిగి, నీరంతా గట్టిగా పిండేసి ఒక బౌల్ లోకి తీసుకోండి.
-ఇప్పుడు మీల్ మేకర్ ముక్కలకు పెరుగు, కొద్దిగా పసుపు, కారం, ఉప్పు వేసి బాగా కలిపి ఒక 10 నిమిషాలు నాననివ్వండి. తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి ఒక స్పూన్ నూనె వేసి, ఈ నానబెట్టిన మీల్ మేకర్ ను దోరగా వేయించి పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు ఒక మిక్సీ జార్ లో కొబ్బరి తురుము, గసగసాలు, జీడిపప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి. ఇదే గ్రేవీకి చిక్కదనాన్ని, కమ్మని రుచిని ఇస్తుంది.
-ఇప్పుడు పాన్ లో నూనె వేడి చేసి బిర్యానీ ఆకులు, సోంపు వేయండి. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కరివేపాకు వేసి ఉల్లిపాయలు రంగు మారేంత వరకు వేయించండి. ఇప్పుడు పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేదాకా వేయించాక పసుపు, కాశ్మీరీ కారం వేసి కలపాలి.

-వెంటనే తరిగిన టమోటాలు, రుచికి సరిపడా ఉప్పు వేసి టమోటాలు మెత్తగా గుజ్జులా అయ్యేంత వరకు మగ్గనివ్వాలి. నూనె పైకి తేలుతున్నప్పుడు కారం, ధనియాల పొడి, చికెన్ మసాలా లేదా గరం మసాలా వేసి ఒక నిమిషం పాటు వేయించండి.
-ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న మీల్ మేకర్ వేసి మసాలా అంతా ముక్కలకు పట్టేలా కలపండి. గ్రేవీకి సరిపడా వేడినీళ్లు పోసి, మూత పెట్టి మీడియం మంటపై 10 నిమిషాలు ఉడికించాలి.
-ఇప్పుడు ముందుగా సిద్ధం చేసుకున్న కొబ్బరి జీడిపప్పు పేస్ట్ వేసి కలపండి. అవసరమైతే ఇంకొన్ని నీళ్లు పోసి, ఉప్పు సరిచూసుకోండి. మళ్లీ మూత పెట్టి మరో 5 నిమిషాలు నూనె పైకి తేలేదాకా ఉడికించండి. చివరగా కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేయండి.
-అంతే గుమగుమలాడే మీల్ మేకర్ గ్రేవీ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications