Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
చికెన్, మటన్ కూడా పనికిరావు.. ఈ కాలీఫ్లవర్ గ్రేవీ రుచి ముందు!
చాలామంది ఇళ్లలో రాత్రిపూట డిన్నర్లో చపాతీలు లేదా పుల్కాలు తినడం అలవాటు. చపాతీలోకి నంజుకోడానికి రోజు చేసే బంగాళాదుంప కుర్మా లేదా పప్పు బోర్ కొడుతుందా? అయితే ఈసారి కొత్తగా కాలీఫ్లవర్ గ్రేవీని ట్రై చేయండి.
రెస్టారెంట్ స్టైల్ లో కాస్త రిచ్ గా, గ్రేవీలా చేస్తే.. నాన్ వెజ్ కూరల రుచి కూడా దీని ముందు పనికిరాదు. ఈ గ్రేవీ బగారా రైస్, పులావ్ లేదా వేడి వేడి అన్నంలోకి కూడా సూపర్ కాంబినేషన్. నోరూరించే కాలీఫ్లవర్ గ్రేవీని ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.
కావాల్సిన పదార్థాలు
కాలీఫ్లవర్ పువ్వు: 1
నూనె: 1 టేబుల్ స్పూన్
ఉల్లిపాయలు: 2
టమోటాలు: 2
వెల్లుల్లి రెబ్బలు: 4
అల్లం: అర అంగుళం ముక్క
జీడిపప్పు: 10 పలుకులు
గ్రేవీకి నూనె: 3 టేబుల్ స్పూన్లు
దాల్చిన చెక్క: అర అంగుళం
లవంగాలు: 3
యాలకులు: 2
బిర్యానీ ఆకు: 1
ఉల్లిపాయ: సగం
పసుపు: పావు టీస్పూన్
కారం: ఒకటిన్నర టీస్పూన్
ధనియాల పొడి: 2 టీస్పూన్లు
గరం మసాలా: 1 టీస్పూన్
ఉప్పు: తగినంత
కొత్తిమీర: కొద్దిగా
చక్కెర: అర టీస్పూన్
తయారీ విధానం
-ముందుగా కాలీఫ్లవర్ ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
-స్టవ్ మీద గిన్నెలో నీళ్లు పోసి అవి మరుగుతున్నప్పుడు కొద్దిగా ఉప్పు, పసుపు వేయాలి. అందులో కట్ చేసిన కాలీఫ్లవర్ ముక్కలను వేసి కేవలం 2 నిమిషాలు ఉడికించి నీటిని వంపేసి ముక్కలను పక్కన పెట్టుకోవాలి.
-ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి ఒక స్పూన్ నూనె వేయాలి. నూనె వేడయ్యాక తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి అవి పారదర్శకంగా మారే వరకు వేయించాలి. ఆ తర్వాత టమోటా ముక్కలు, వెల్లుల్లి, అల్లం, జీడిపప్పు వేసి అన్నీ మెత్తబడే వరకు వేయించుకోవాలి. ఈ మిశ్రమం చల్లారాక మిక్సీ జార్ లో వేసి కొద్దిగా నీళ్లు పోసి మెత్తని పేస్ట్ లా రుబ్బుకుని పక్కన పెట్టుకోవాలి.
-అదే కడాయిలో 3 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేయాలి. నూనె కాగాక దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకు వేసి వేయించాక సన్నగా తరిగిన సగం ఉల్లిపాయ ముక్కలను వేసి దోరగా వేయించాలి.
-ఉల్లిపాయలు వేగాక ముందుగా సిద్ధం చేసుకున్న మసాలా పేస్ట్ ను ఇందులో వేయాలి. సన్నని మంటపై కలుపుతూ మిశ్రమం నుండి నూనె వేరుపడే వరకు బాగా వేయించాలి.
-ఇప్పుడు అందులో ఉడికించి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలను వేసి మసాలా అంతా ముక్కలకు పట్టేలా కలపాలి. తర్వాత పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసి మరోసారి కలపాలి.
-ఇప్పుడు గ్రేవీకి సరిపడా (సుమారు 2 కప్పులు) నీళ్లు పోసి, రుచికి సరిపడా ఉప్పు వేసి కలపాలి. మూత పెట్టి మీడియం మంటపై 10 నిమిషాల పాటు ఉడికించాలి.
-10 నిమిషాల తర్వాత మూత తీస్తే గ్రేవీ చిక్కబడి, నూనె పైకి తేలుతూ కనిపిస్తుంది. చివరగా సన్నగా తరిగిన కొత్తిమీర, అర టీస్పూన్ చక్కెర వేసి కలపాలి.
-అంతే ఘుమఘుమలాడే వేడి వేడి కాలీఫ్లవర్ గ్రేవీ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications










