Latest Updates
-
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.!
టిఫిన్ ఏదైనా సరే..లొట్టలేయించే టమాటో కొబ్బరి పచ్చడి!
ఉదయం లేవగానే వేడివేడి ఇడ్లీలు, క్రిస్పీ దోసెలు బ్రేక్ ఫాస్ట్ గా ఉంటే ఆ రోజు కిక్కే వేరు. అయితే టిఫిన్ ఎంత బాగున్నా, అందులోకి నంజుకునే చట్నీ రుచిగా లేకపోతే ఆ మజానే రాదు. సాధారణంగా మనం చేసుకునే పల్లీ చట్నీ లేదా కొబ్బరి చట్నీ తిని తిని బోర్ కొట్టిందా? అయితే టమాటో కొబ్బరి చట్నీ ట్రై చేసి తీరాల్సిందే.
టమాటోలోని పులుపు, కొబ్బరిలోని కమ్మదనం, ఎండుమిరపకాయల ఘాటు వెరసి ఈ చట్నీ రుచి అద్భుతంగా ఉంటుంది. ఈ రెసిపీని తయారు చేయడం చాలా సులభం. కేవలం ఇడ్లీ, దోసెలే కాదు.. వేడి వేడి గారెలు, పొంగల్, చివరికి అన్నంలోకి కూడా ఇది సూపర్ గా సెట్ అవుతుంది.

టమాటో కొబ్బరి చట్నీ తయారీకి కావలసిన
పదార్థాలు
పండిన టమోటాలు - 3
తాజా కొబ్బరి తురుము - అర కప్పు
ఎండు మిరపకాయలు - 5
అల్లం - చిన్న ముక్క
వెల్లుల్లి రెబ్బలు - 4
మినపప్పు - 1 టేబుల్ స్పూన్
శనగపప్పు - 1 టేబుల్ స్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - 2 టేబుల్ స్పూన్లు
ఆవాలు - అర టీస్పూన్
కరివేపాకు - రెండు రెమ్మలు
ఎండుమిర్చి - 1
ఇంగువ - చిటికెడు
తయారీ విధానం
-ముందుగా టమోటాలను శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కోసి పక్కన పెట్టుకోండి.
-స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టి అందులో ఒక టేబుల్ స్పూన్ నూనె వేడి చేయాలి. నూనె కాగాక మినపప్పు, శనగపప్పు, ఎండు మిరపకాయలు వేసి దోరగా వేయించాక వెల్లుల్లి రెబ్బలు వేసి ఒక్క నిమిషం పాటు వేయించి పక్కన ప్లేట్ లోకి తీసుకోండి.
-ఇప్పుడు అదే పాన్ లో కోసి పెట్టుకున్న టమోటా ముక్కలు, తురిమిన అల్లం వేసి కలపాలి. మూత పెట్టి టమోటాలు పూర్తిగా మెత్తబడి, గుజ్జులా అయ్యే వరకు ఉడికించాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి.
-వేయించి పెట్టుకున్న పప్పుల మిశ్రమం, ఉడికించిన టమాటో మిశ్రమం, పచ్చి కొబ్బరి తురుము, రుచికి సరిపడా ఉప్పు అన్నింటినీ మిక్సీ జార్ లోకి తీసుకొని అవసరమైతే కొద్దిగా నీళ్లు పోసి మరీ జారుగా కాకుండా, కొంచెం గట్టిగా మెత్తని పేస్ట్ లా రుబ్బుకోవాలి.
-ఇప్పుడు చట్నీకి అసలైన రుచినిచ్చే తాలింపుని రెడీ చేసుకోవాలి. ఇందుకోసం చిన్న కడాయిలో మిగిలిన నూనె వేడి చేసి ఆవాలు వేయండి. అవి చిటపటలాడాక ఎండుమిర్చి, కరివేపాకు, చివరగా చిటికెడు ఇంగువ వేసి వేయించండి. ఈ వేడి వేడి పోపును చట్నీలో వేసి బాగా కలపండి.
-అంతే ఎంతో రుచికరమైన, ఘుమఘుమలాడే హోటల్ స్టైల్ టమాటో కొబ్బరి చట్నీ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications