Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
తమిళనాడు ఫేమస్ మధుర వడ..పర్ఫెక్ట్ క్రంచీ స్నాక్..ఎన్ని తిన్నా అలా పోతూనే ఉంటాయ్..
తమిళనాడులో ముఖ్యంగా మదురై ప్రాంతంలో, కర్ణాటకలో మధుర వడ చాలా ఫేమస్. మద్దూర్ వడ అని కూడా దీనిని పిలుస్తారు. దీని ప్రత్యేకత ఏమిటంటే.. ఇది తక్కువ సమయంలో, ఇంట్లో అందుబాటులో ఉండే పదార్థాలతో సులభంగా తయారు చేయవచ్చు. సాధారణ వడల మాదిరిగా దీన్ని పప్పులను నానబెట్టాల్సిన అవసరం లేదు. దీనిని అప్పటికప్పుడు వేడివేడిగా గానీ, లేదా తయారు చేసుకుని నిల్వ ఉంచుకుని గానీ ఆస్వాదించవచ్చు. ఈ వడలు చల్లారిన తర్వాత కూడా కరకరలాడుతూ ఉంటాయి. వారం రోజుల వరకు నిల్వ ఉంటాయి.
తయారీకి కావాల్సిన పదార్థాలు
-ఉల్లిపాయలు
-పచ్చిమిరపకాయలు
-బొంబాయి రవ్వ
-జీలకర్ర
-తెల్ల నువ్వులు
-కొత్తిమీర తరుగు
-బియ్యప్పిండి
-అల్లం తరుగు
-కరివేపాకు
-కొత్తిమీర
-ఉప్పు
-పల్లీలు

తయారీ విధానం
-ముందుగా 4 పెద్ద సైజు ఉల్లిపాయలను సన్నగా,బారుగా ఉండేలా కట్ చేసుకోవాలి.
-తర్వాత 4 పచ్చిమిరపకాయలను గుండ్రాటి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
-ఇప్పుడు ఓ పెద్ద గిన్నె తీసుకొని అందులో కట్ చేసుకున్న ఉల్లిపాయలు,పచ్చిమిరపకాయలు వేసి,ఇందులోనే ఒకటిన్నర కప్పు బియ్యం పిండి, ఒక కప్పు బొంబాయి రవ్వ, 1 స్పూన్ జీలకర్ర, రుచికి తగ్గట్లు ఉప్పు, గుప్పెడు పల్లీలు, గుప్పడు తెల్ల నువ్వులు, కొంచెం కొత్తిమీర తరుగు, కొంచెం అల్లం తరుగు, కొద్దిగా సన్నగా కట్ చేసిన కరివేపాకు వేసి మొత్తం చేత్తో బాగా కలుపుకోవాలి.
-అవసరమైనన్ని నీళ్లను కొంచెం కొంచెంగా వేసుకుంటూ గట్టిగా ముద్దలా తడుపుకోవాలి. ఒకేసారి ఎక్కువ నీళ్లు పోస్తే పిండి లూస్ గా అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి కొన్ని కొన్ని పోసుకుంటూ గట్టిగా కలుపుకోవాలి. ఉల్లిపాయల్లో నుంచి ఎలాగూ తేమ వస్తుంది కాబట్టి ఇంకొంచెం నీళ్లను వేసుకుంటే సరిపోతుంది.
-కలిపిన పిండిని కొంచెం కొంచెంగా చేత్తుల్లోకి తీసుకొని వడల్లా వత్తుకోవాలి. ఎక్కువ మందంగా ఉండకూడదు,కొంచెం పల్చగానే ఉండాలి.
-తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో డీప్ ఫ్రై చేయడానికి తగినంత ఆయిల్ పోసి బాగా వేడి చేశాక మంటను మీడియంలో ఉంచి వత్తుకున్న వడలను ఒక్కొక్కటిగా వేస్తూ మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేయాలి.
-వడలు బంగారు గోధుమ రంగులోకి వచ్చి, కరకరలాడే వరకు వేయించి, టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లో తీయాలి.
-వేడివేడిగా కొబ్బరి చట్నీ లేదా పుదీనా చట్నీతో వడ్డించాలి. ఈ వడలను చట్నీ లేకుండా టీ లేదా కాఫీతో కూడా తీసుకోవచ్చు.
-ఇది డీప్ ఫ్రై చేసిన వంటకం కాబట్టి ఇతర డీప్ ఫ్రై చేసిన ఆహారాల మాదిరిగానే కొవ్వు పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్య పరిరక్షణ దృష్ట్యా మితంగా తీసుకోవడం ఉత్తమం.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications