Latest Updates
-
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.!
బరువు తగ్గాలనుకునేవారికి బెస్ట్ బ్రేక్ ఫాస్ట్ రెసిపి..ప్రోటీన్, పోషకాలతో నిండిన పాలక్ పనీర్ ఊతప్పం
రోజూ తినే ఇడ్లీ, పూరీ దోశలతో విసుగు చెందారా? ఏదైనా కొత్తగా, ఆరోగ్యంగా ఉండేది తినాలనిపిస్తోందా? అయితే మీరు పాలక్ పనీర్ ఊతప్పం ట్రై చేసి తీరాల్సిందే. పాలకూరలోని పోషకాలు, పనీర్ లోని ప్రొటీన్ కలిసి మీ బ్రేక్ ఫాస్ట్ ను హెల్దీగా మార్చేస్తుంది. బరువు తగ్గాలనుకునేవాళ్లకు కూడా ఇది బెస్ట్ ఆప్షన్. పాలక్ పనీర్ ఊతప్పం తయారుచేసుకోవడం కూడా చాలా ఈజీ. కేవలం పదిహేను నిమిషాల్లో పాలక్ పనీర్ ఊతప్పం ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.
పాలక్ పనీర్ ఊతప్పం తయారీకి కావాల్సిన పదార్ధాలు
-పనీర్ తురుము- అర కప్పు
-ఉల్లిపాయ- 1
-టమాటో- 1
-పచ్చిమిర్చి- 1
-కొబ్బరి తరుగు- 1 టేబుల్ స్పూన్
-బొంబాయి రవ్వ- 1 కప్పు
-తాజా పాలకూర-1 కప్పు
-గట్టి పెరుగు- అర కప్పు
-ఫ్రూట్ సాల్ట్ (ఈనో)- 1 ప్యాకెట్
-ఉప్పు-తగినంత
-కొత్తిమీర తరుగు-1 టేబుల్ స్పూన్

తయారీ విధానం
-పాలక్ పనీర్ ఊతప్పం తయారీ కోసం ముందుగా ఒక పెద్ద గిన్నెలో బొంబాయి రవ్వ, పెరుగు, పాలకూర ప్యూరీ, తగినంత ఉప్పు వేసి బాగా కలపండి. అవసరాన్ని బట్టి కొంచెం కొంచెంగా నీళ్లు పోస్తూ దోశ పిండి కంటే కొంచెం చిక్కగా ఉండేలా కలుపుకోండి.
-కలిపిన మిశ్రమాన్ని 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి.
-ఈలోపు టాపింగ్ కోసం మరో గిన్నెలో ఉల్లిపాయ తరుగు, టమాటో తరుగు, పచ్చిమిర్చి తరుగు, కొత్తిమీర తరుగు, పనీర్ తురుము, సరిపడా ఉప్పు వేసి అన్నీ కలిసేలా చేత్తో మెల్లగా కలపండి.
-ఇప్పుడు పిండిలో ఫ్రూట్ సాల్ట్ వేసి కలిపి పిండిని గరిటెతో నెమ్మదిగా ఒకే దిశలో కలపండి.
-తర్వాత స్టవ్ మీద పెనం పెట్టి మీడియం మంటపై వేడి చేశాక దానిపై ఒక టీస్పూన్ నీళ్లు పోస్తే అది నురుగలా పొంగుతుంది.
-పెనం వేడెక్కాక కొద్దిగా నూనె రాసి ఒక గరిటెడు పిండిని తీసుకుని, మరీ పల్చగా కాకుండా కొంచెం మందంగా ఉత్తపంలా పోయండి. దానిపై మనం సిద్ధం చేసుకున్న పనీర్ టాపింగ్ ను రెండు స్పూన్ల మోతాదులో సమానంగా చల్లి, గరిటెతో నెమ్మదిగా నొక్కండి.
-కింది వైపు బంగారు రంగులోకి వచ్చేవరకు కాలనిచ్చి, ఆ తర్వాత రెండో వైపుకు తిప్పి మరో నిమిషం పాటు కాల్చండి. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా ఉత్తపాలు తయారుచేసుకోండి. అంతే, వేడివేడి, పోషకాలతో నిండిన పాలక్ పనీర్ ఊతప్పం రెడీ. దీనిని మీకు ఇష్టమైన కొబ్బరి చట్నీ లేదా అల్లం చట్నీతో తింటే, ఆ రుచే వేరు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications