Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
పుదీనా టమాటో పచ్చడి ఇలా చేసుకుంటే ఒక్క ముద్ద కూడా మిగల్చకుండా తింటారు!
రోటి పచ్చడి ఎలాంటిదైనా ఆ రుచి అమోఘంగా ఉంటుంది. రుచితో పాటు ఆరోగ్యానికి కూడా రోటి పచ్చడి ఎంతో మేలు చేస్తాయి. అలాంటి రోటి పచ్చడిలో ఒకటి పుదీనా టమాటో పచ్చడి. దీనిని ఉదయం మనం తినే ఇడ్లీ, దోశ, పూరితో కలిపి తినొచ్చు. అలాగే అన్నంతో పాటు కూడా కలుపుకొని తినొచ్చు. ఈ పచ్చడిని ఎలా చేసుకోవాలి? దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి? ఈ పచ్చడితో ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
పుదీనా టమాటో పచ్చడికి కావాల్సిన పదార్థాలు
- నాలుగు లేదా అయిదు మీడియం సైజు టొమాటోలు
- ఒక గుప్పెడు పుదీనా ఆకులు
- రెండు లేదా మూడు పచ్చిమిర్చి
- నాలుగు లేదా అయిదు వెల్లుల్లి రెబ్బలు
- రుచికి సరిపడా ఉప్పు
- అర టీస్పూన్ కారం పొడి
- ఒక టేబుల్ స్పూన్ నూనె
- గుప్పెడు కరివేపాకులు

పుదీనా టమాటో పచ్చడి తయారీ విధానం
ముందుగా టొమాటోలను శుభ్రంగా కడుక్కోవాలి. ఆ టొమాటోలను సన్నటి మంట మీద లేదా నిప్పుల మీద కాల్చుకోవాలి. టొమాటోలు కాలిన తరువాత వాటిని తీసి పక్కన పెట్టుకొని.. వాటిపైన ఉండే కాలిన పొరను తీసేయాలి. ఇప్పుడు రోటిలో మనం కాల్చిన టొమాటోలు వేసి మెత్తగా రుబ్బుకోవాలి.
టొమాటోలు మెత్తగా అయిపోయిన తరువాత అందులో పుదీనా, పచ్చిమిర్చి, వెల్లుల్లి, వేసుకొని మంచిగా మెత్తగా మరోసారి రుబ్బుకోవాలి. అందులోనే రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా కారం కూడా వేసుకొని మరోసారి ఒక తిప్పు తిప్పి రుబ్బుకోవాలి.
ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ నూనె పోసుకోవాలి. అందులోనే తాలింపు గింజలు వేసుకొని.. గుప్పెడు కరివేపాకులు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని మొత్తం తీసుకొని ముందుగా రుబ్బి పెట్టుకున్న టమాటో పుదీనా పచ్చడి మీద పోసుకొని కలుపుకోవాలి. అనంతరం కొత్తమీర ఆ పచ్చడి మీద చల్లుకుంటే ఎంతో రుచికరమైన పుదీనా టమాటో పచ్చడి సిద్ధమైపోతుంది. ఈ పచ్చడిని ఇడ్లీ, దోశతో పాటు వేడి వేడి అన్నంలో కూడా కలుపుకొని ఆస్వాదించొచ్చు.
పుదీనా టమాటో పచ్చడితో ఆరోగ్య ప్రయోజనాలు
ఈ పుదీనా టమాటో పచ్చడి జీర్ణక్రియ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. టొమాటోల్లో పుష్కలంగా దొరికే ఫైబర్ ఆహరం మంచిగా జీర్ణమవడానికి సహాయపడుతుంది. అలాగే మలబద్దకం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
ఈ పుదీనా టమాటో పచ్చడి శరీరంలో ఉష్ణోగ్రతలను నియంత్రిస్తుంది.
వేసవి కాలంలో శరీరానికి కావాల్సిన చల్లదనాన్ని ఇస్తుంది. ఎవరికైనా
శరీరం వేడి చేస్తే ఈ పచ్చడి తినడం వల్ల ఫలితాలను పొందవచ్చు.
టమాటోలతో పాటు పుదీనాలో విటమిన్-సీ పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరంలో
రోగ నిరోధక శక్తిని పెంపొందించేందుకు సహాయపడతాయి. దీని వల్ల వైరల్
ఇన్ఫెక్షన్, ఇతర రోగాల బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకోవచ్చు.
టొమాటోల్లో లైకోపీన్ అధికంగా ఉంటుంది. అలాగే పుదీనాలో యాంటీ యాక్సిడెంట్లు మెండుగా లభిస్తాయి. ఇవి రెండు చర్మం కాంతి వంతంగా మారడానికి సహాయపడతాయి. అలాగే చర్మం అందంగా కనిపించేందుకు పనికొస్తుంది.
పుదీనా, టొమాటోల్లో విటమిన్ A పుష్కలంగా ఉంటుంది. ఇవి కళ్ల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అలాగే శ్వాసకోశ సమస్యల నుంచి ఇది ఉపశమనం కలిగిస్తుంది. తలనొప్పిని తగ్గిస్తుంది.
గమనిక: ఈ కథనంలో మేము పొందుపరిచిన అంశాలు పలు అధ్యయనాలు, ఇంటర్నెట్‌లో మాకు దొరికిన సమాచారం ఆధారంగా అందించబడింది. వీటి శాస్త్రీయతను మేము నిర్ధారించడం లేదు. వీటిని పాటించే ముందు తప్పనిసరిగా నిపుణుల సలహాలు తీసుకోండి. మా ఉద్దేశం మీకు సమాచారం అందించడం మాత్రమే. వీటికి తెలుగు బోల్డ్ స్కై ఎటువంటి బాధ్యత వహించదు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications