For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పంజాబీ దమ్ ఆలూ రెసిపి । దమ్ ఆలూ రెసిపి ।పంజాబీ ఆలూ రెసిపి

పంజాబీ దమ్ ఆలూ రెసిపి । దమ్ ఆలూ రెసిపి ।పంజాబీ ఆలూ రెసిపి

Posted By:
|
పంజాబీ దమ్ ఆలూ రెసిపి । దమ్ ఆలూ రెసిపి ।పంజాబీ ఆలూ రెసిపి | Boldsky

పంజాబీ దమ్ ఆలూ వంటకం ప్రపంచంలోనే నోరూరించే పంజాబీ ఆహార స్టైల్ నుంచి వచ్చింది. మొదటిసారి రుచి చూసినప్పటినుండి అందరికీ అభిమాన ఆలూ రెసిపి అయిపోయింది. ఇది సులభంగా వండుకోగలిగే వంటకం,పైగా ఆఖరున నోరూరించే కూర తయారైనప్పుడు మనకి ఇంకా ఇంకా తినాలనిపించే వంటకం కాబట్టి పంజాబీ ఆలూ ఎన్నటికీ బోర్ కొట్టదు.

దమ్ ఆలూగా కూడా పిలిచే ఈ వంటకం చక్కగా ఉడికిన, మసాలా దినుసులన్నీ కూరబడిన ఆలూ, ఇంకా కస్తూరి మెంతులు, జీలకర్ర, జీడిపప్పు,ఏలకులు, దాల్చిన చెక్క, ఇతర భారతీయ దినుసులన్నీ వేసి నోరూరించే కూరల అద్భుతమైన కాంబినేషన్.

పంజాబీ ఆహారంలోనే ముఖ్య వంటకమైన పంజాబీ ఆలూ రెసిపి భారతీయ ప్రసిద్ధ వంటకంగా ప్రపంచంలో పేరు తెచ్చుకుంది. దీన్ని మీరు దాదాపు ఏ పెళ్ళిలోనైనా ,ఇతర ఫంక్షన్లలోనైనా చూడవచ్చు. ఈ రెసిపిలో ప్రత్యేకత ఏంటంటే ఇది మామూలుగా పెరుగుకి సంబంధించిన తడి కూర అయినా కూదా, మనం దీన్ని పొడి దమ్ ఆలూ మసాలాగా మార్చుకుని ముఖ్య భోజనం ముందు వంటకంలా వడ్డించుకోవచ్చు.

ఈ రుచికరమైన పంజాబీ దమ్ ఆలూ రెసిపిని వండటానికి, వీడియోను చూడండి లేదా ఫోటోలతో ఉన్న స్టెప్ బై స్టెప్ రెసిపిని కింద చదివి, మీకిష్టమైన ఘాటైన ఆలూ రెసిపిలను మాతో పంచుకోండి.

పంజాబీ దమ్ ఆలూ రెసిపి । దమ్ ఆలూ రెసిపి। పంజాబీ ఆలూ రెసిపి । పంజాబీ దమ్ ఆలూ స్టెప్ బై స్టెప్ ।పంజాబీ దమ్ ఆలూ వీడియో
పంజాబీ దమ్ ఆలూ రెసిపి । దమ్ ఆలూ రెసిపి। పంజాబీ ఆలూ రెసిపి । పంజాబీ దమ్ ఆలూ స్టెప్ బై స్టెప్ ।పంజాబీ దమ్ ఆలూ వీడియో
Prep Time
15 Mins
Cook Time
25M
Total Time
40 Mins

Recipe By: మీనా భండారీ

Recipe Type: ముఖ్యవంటకం

Serves: 3-4కి

Ingredients
  • 1.చిన్న బంగాళదుంపలు - 15-18

    2.కొత్తిమీర -చేతికి పట్టినన్ని

    3.టమాటా ప్యూరీ -3/4 కప్పు

    4.పెరుగు - 3/4కప్పు

    5.నూనె - 5చెంచాలు

    6.ఉల్లిపాయ -1 కప్పు

    7.అల్లం-వెల్లుల్లి పేస్టు -1 చెంచా

    8.జీలకర్ర -1 చెంచా

    9.జీడిపప్పు -6-7

    10. దాల్చినచెక్క -1 ముక్క

    11.ఏలకులు-1

    12.లవంగాలు-1

    13.ధనియాలు -1చెంచా

    14.కస్తూరి మెంతులు -1 చెంచా

    15. పంచదార -1 చెంచా

    16.కారం -1 చెంచా

    17.ఉప్పు-1 చెంచా

    18.ఇంగువ-1 చెంచా

    19. బిర్యానీ ఆకు -1

    20.పసుపు -1 చెంచా

How to Prepare
  • 1. మిక్సీ జార్ లో ధనియాలు, దినుసులు, జీడిపప్పు, జీలకర్ర అన్నీవేసి మెత్తని పొడిలా మిక్సీ పట్టండి.

    2. కుక్కర్ తీసుకుని నీళ్ళు పోసి, బంగాళదుంపలు వేయండి.

    3.బంగాళదుంపలు మెత్తగా అయ్యేవరకు కుక్కర్ లో ఉడికించండి.

    4. బంగాళదుంపల తొక్కు తీసేసి, ఫోర్క్ తో ఆలూలలో గుచ్చండి. దానివలన దినుసులు లోపలి వరకూ వెళ్తాయని ఖచ్చితంగా తెలుస్తుంది.

    5.ఒక పెనం తీసుకుని, నూనె వేసి, బంగాళదుంపల పైపొర గోధుమరంగులోకి మారేదాకా వేయించండి.

    6.ఇంకో పెనం తీసుకుని, నూనె,బిర్యానీ ఆకు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉల్లిపాయ ముక్కలు వేసి ఉల్లిముక్కలు లేత బ్రౌన్ రంగులోకి మారేదాకా కలపండి.

    7.టమాటా ప్యూరీని వేసి మళ్ళీ కలపండి.

    8.ప్యూరీ గట్టిపడుతుంటే, మసాలా దినుసుల మిశ్రమాన్ని వేసి ఆపకుండా కలుపుతూ ఉండండి.

    9.పెరుగు, కారం, ఉప్పు వేసి బాగా కలపండి

    10.పసుపు, పంచదార వేసి 2-3నిమిషాలు కలిపి నీళ్ళు ఆఖరిలో పోయండి.

    11.కస్తూరి మెంతులు వేసి ఒక నిమిషం కలపండి.

    12.మూతలు ఉంచి కొన్ని నిమిషాలు ఉడకనివ్వండి, కూర గట్టిపడుతూ, అన్ని దినుసుల వాసన మీకు తెలుస్తుంది.

    13.బంగాళదుంపలను ఈ కూరలో వేసి బాగా కలపండి.

    14.బంగాళదుంపలు కూరలో వేసి ఉడికించాక, దమ్ ఆలూను బౌల్ లోకి తీయండి.

    15.ఇక దీన్ని కొత్తిమీరతో పైన అలంకరించి చపాతీ లేదా పూరీకి పక్కన వంటకంలా వడ్డించండి.

Instructions
  • 1.బంగాళదుంపలు చక్కగా మెత్తబడి, కూరలో వేయడానికి అనువుగా ముందు కుక్కర్ లోనే ఉడికించండి. 2.దీన్ని నేరుగా భోజనం ముందు వడ్డించే వంటకంలా చేయటానికి తక్కువ నీరుపోసి, పొడి మసాలా ఎక్కువ ఉండేలా చూసుకుని వండండి.
Nutritional Information
  • వడ్డించే పరిమాణం - ఒకసారి
  • క్యాలరీలు - 211.7 క్యాలరీలు
  • కొవ్వు - 6.7గ్రా
  • ప్రొటీన్ - 5.2 గ్రా
  • కార్బొహైడ్రేట్లు - 34.4 గ్రా
  • ఫైబర్ - 4.7 గ్రా

స్టెప్ బై స్టెప్ – పంజాబీ దమ్ ఆలూ చేయటం ఎలా

1. మిక్సీ జార్ లో ధనియాలు, దినుసులు, జీడిపప్పు, జీలకర్ర అన్నీవేసి మెత్తని పొడిలా మిక్సీ పట్టండి.

2. కుక్కర్ తీసుకుని నీళ్ళు పోసి, బంగాళదుంపలు వేయండి.

3.బంగాళదుంపలు మెత్తగా అయ్యేవరకు కుక్కర్ లో ఉడికించండి.

4. బంగాళదుంపల తొక్కు తీసేసి, ఫోర్క్ తో ఆలూలలో గుచ్చండి. దానివలన దినుసులు లోపలి వరకూ వెళ్తాయని ఖచ్చితంగా తెలుస్తుంది.

5.ఒక పెనం తీసుకుని, నూనె వేసి, బంగాళదుంపల పైపొర గోధుమరంగులోకి మారేదాకా వేయించండి.

6.ఇంకో పెనం తీసుకుని, నూనె,బిర్యానీ ఆకు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉల్లిపాయ ముక్కలు వేసి ఉల్లిముక్కలు లేత బ్రౌన్ రంగులోకి మారేదాకా కలపండి.

7.టమాటా ప్యూరీని వేసి మళ్ళీ కలపండి.

8.ప్యూరీ గట్టిపడుతుంటే, మసాలా దినుసుల మిశ్రమాన్ని వేసి ఆపకుండా కలుపుతూ ఉండండి.

9.పెరుగు, కారం, ఉప్పు వేసి బాగా కలపండి

10.పసుపు, పంచదార వేసి 2-3నిమిషాలు కలిపి నీళ్ళు ఆఖరిలో పోయండి.

11.కస్తూరి మెంతులు వేసి ఒక నిమిషం కలపండి.

12.మూతలు ఉంచి కొన్ని నిమిషాలు ఉడకనివ్వండి, కూర గట్టిపడుతూ, అన్ని దినుసుల వాసన మీకు తెలుస్తుంది.

13.బంగాళదుంపలను ఈ కూరలో వేసి బాగా కలపండి.

14.బంగాళదుంపలు కూరలో వేసి ఉడికించాక, దమ్ ఆలూను బౌల్ లోకి తీయండి.

15.ఇక దీన్ని కొత్తిమీరతో పైన అలంకరించి చపాతీ లేదా పూరీకి పక్కన వంటకంలా వడ్డించండి.

[ 5 of 5 - 70 Users]
English summary

Punjabi Dum Aloo Recipe

Punjabi Dum aloo recipe traces back to the Punjabi gharana of delicacies and we love this recipe for being so easy to prepare. Though you can literally make this within minutes, the end result will always be a royal one, perfect for a main-course side-dish recipe with roti, chapati or poori.
Desktop Bottom Promotion