Latest Updates
-
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా.. -
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక! -
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే! -
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.!
తింటే స్వర్గమే అనిపించేంత రుచి..కేవలం 10 నిమిషాల్లో చేసుకునే టమాటో రైస్..ఇలా చేసుకోండి
నేటి ఉరుకులు పరుగుల జీవితంలో వంట చేయడానికి ఎక్కువ సమయం కేటాయించడం చాలా మందికి కష్టంగా మారింది. ముఖ్యంగా ఉదయం పూట ఆఫీసులకు వెళ్లేవారికి, పాఠశాలలకు వెళ్లే పిల్లలకు లంచ్ బాక్స్ సిద్ధం చేయడం ఒక పెద్ద సవాలు. ఇలాంటి సమయాల్లో తక్కువ సమయంలో, సులభంగా, రుచిగా,ఆరోగ్యకరంగా చేసుకోగలిగే వంటకాల వైపు మొగ్గు చూపుతారు. అలాంటి వంటకాల్లో టమాటో రైస్ ముందు వరుసలో ఉంటుంది.
అప్పటికప్పుడు వండిన అన్నంతో అయినా లేదా రాత్రి మిగిలిన అన్నంతో కేవలం 10 నిమిషాల్లో వేడివేడిగా, ఎంతో రుచిగా ఉండే టమాటో రైస్‌ను తయారు చేసుకోవచ్చు. టమాటో రైస్ కేవలం రుచికరమైన భోజనం మాత్రమే కాదు, ఇది పోషకాల గని కూడా. ఇందులో ప్రధాన పాత్ర పోషించే టమాటాలలో మన శరీరానికి అవసరమైన అనేక విటమిన్లు, మినరల్స్ ఉంటాయి.

టమాటో రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలు
-వండిన అన్నం
-టమాటాలు
-ఉల్లిపాయ
-పచ్చిమిర్చి
-అల్లం వెల్లుల్లి పేస్ట్
-నూనె లేదా నెయ్యి
-పసుపు
-కారం
-గరం మసాలా
-ధనియాల పొడి
-కరివేపాకు
-కొత్తిమీర
-ఉప్పు
టమాటో రైస్ తయారీ విధానం
-టమాటో రైస్ చేయడానికి ముందుగా 3 టమాటోలను మిక్సీ జార్ లో మెత్తని ప్యూరీలా చేసుకొని పక్కన ఉంచుకోండి.
-తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడి చెయ్యాలి.
-ఆయిల్ వేడయ్యాక అందులో సన్నగా తరిగిన 1 ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయ చీలికలు వేసి మీడియం మంట మీద ఉల్లిపాయలను బాగా వేగనివ్వాలి.
-ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత అందులో అర టీస్పూన్ అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేదాకా వేయించాలి. తర్వాత ఇందులో టమాటో ప్యూరీ వేయండి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు, 1 టీస్పూన్ కారం, 1 టీస్పూన్ గరం మసాలా, 1 టీస్పూన్ ధనియాల పొడి, చిటికెడు పసుపు, కొద్దిగా కరివేపాకు వేసి మీడియం మంట మీద టమాటోలోని నీరు అంతా ఇగిరిపోయి, ఆయిల్ అంతా సైడ్స్ కి వచ్చే వరకు హై ప్లేమ్ లో కలుపుకోవాలి.
-ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు అందులో సన్నగా తరిగిన కొత్తిమీర, సన్నగా తరిగిన పుదీనా కొద్దిగా వేసి కలుపుకోవాలి. తర్వాత ఇందులో 2 కప్పుల ఉడికించిన అన్నం వేసి మీడియం మంట మద మొత్తం అన్నంకి బాగా కలిసేలా కలుపుకోండి.
-అంతే టమాటో రైస్ రెడీ. వేడి వేడిగా దీన్ని తింటే స్వర్గమే. లంచ్ బాక్సులోకి కూడా బాగుంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
