Latest Updates
-
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.!
బిర్యానీ కంటే రుచిగా..నిమిషాల్లో అదిరిపోయే హోటల్ స్టైల్ టొమాటో రైస్..ఎలా చేసుకోవాలంటే..
సండే వచ్చిందంటే చాలు..మనసు ఏదైనా కొత్త రుచిని కోరుకుంటుంది. రోజూ తినే వంటకాలు కాకుండా, సులువుగా చేసుకునేలా, ఎంతో ప్రత్యేకంగా ఉండే వంటకం కోసం ఎదురుచూస్తాం. అలాంటి సమయంలో బియ్యంతో చేసే వంటకాలే మనకు గుర్తొస్తాయి. మీరు ఇదివరకే ఎన్నో రకాల టొమాటో బాత్, టొమాటో బిర్యానీలు రుచి చూసి ఉండొచ్చు. కానీ హోటల్ స్టైల్ లో అదిరిపోయే రుచితో, అతి తక్కువ పదార్థాలతో సరికొత్త టొమాటో రైస్ చేసుకోవచ్చు. దీని సువాసనకే సగం ఆకలి తీరిపోతుంది. ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.
కావాల్సిన పదార్థాలు
బాస్మతి లేదా సాధారణ
బియ్యం - 1 కప్పు,
పండిన టమాటాలు - 3
ఉల్లిపాయ - 1 (పెద్దది)
పెరుగు - పావు కప్పు
అల్లం - చిన్న ముక్క
వెల్లుల్లి రెబ్బలు - 5
పచ్చి మిర్చి - 2
కొత్తిమీర, పుదీనా ఆకులు - గుప్పెడు.
నూనె - 3 టేబుల్ స్పూన్లు
బిర్యానీ ఆకు - 1
లవంగాలు - 3
యాలకులు - 2
దాల్చిన చెక్క - చిన్న ముక్క
అనాస పువ్వు - 1
జీలకర్ర - 1 టీస్పూన్.
పసుపు - పావు టీస్పూన్
కారం - 1 టీస్పూన్
బిర్యానీ మసాలా పొడి - 1 టీస్పూన్
కసూరి మేథి - 1 టీస్పూన్
రుచికి సరిపడా ఉప్పు

తయారీ విధానం
-ముందుగా బియ్యాన్ని శుభ్రంగా కడిగి, అరగంట పాటు నానబెట్టండి.
-మిక్సీ జార్ లో టమాటాలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా వేసి, కొద్దిగా నీరు పోసి మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.
-ఇప్పుడు స్టవ్ పై ప్రెషర్ కుక్కర్ పెట్టి నూనె వేడి చేయండి. నూనె వేడెక్కాక బిర్యానీ ఆకు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, అనాస పువ్వు, జీలకర్ర వేసి మంచి సువాసన వచ్చేవరకు వేయించాలి.
-తర్వాత రుబ్బి పెట్టుకున్న టొమాటో మసాలా ముద్ద, సరిపడా ఉప్పు వేసి, నూనె పైకి తేలేంత వరకు 3-4 నిమిషాల పాటు బాగా వేయించాలి.
-ఇప్పుడు పసుపు, కారం, బిర్యానీ మసాలా పొడి వేసి మరో నిమిషం పాటు కలిపి ఆ తర్వాత గిలకొట్టిన పెరుగు, కసూరి మేథి వేసి బాగా కలపాలి.
-మసాలా చిక్కబడ్డాక మీరు ఏ కప్పుతో బియ్యం తీసుకున్నారో అదే కప్పుతో రెండు కప్పుల నీళ్లు పోసి బాగా మరిగించాలి.
-నీరు మరుగుతున్నప్పుడు, నానబెట్టిన బియ్యంలోని నీటిని వంపేసి ఆ బియ్యాన్ని కుక్కర్ లో వేసి ఒకసారి కలపండి.
-కుక్కర్ మూతపెట్టి, మీడియం మంట మీద 2 విజిల్స్ వచ్చేవరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేయండి. ప్రెషర్ పూర్తిగా పోయాక మూత తీసి, నెమ్మదిగా ఒకసారి కలిపితే, పొడిపొడిగా ఉండే ఘుమఘుమలాడే టొమాటో రైస్ రెడీ. దీన్ని వేడివేడిగా రైతా లేదా పెరుగుతో తింటే, ఆ రుచి మాటల్లో చెప్పలేం.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications