Latest Updates
-
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.!
చపాతీలోకి అదిరిపోయే కాంబినేషన్..నోరూరించే క్రీమీ సోయా వైట్ కుర్మా.. ఒక్కసారి తింటే వదిలిపెట్టరు
సాధారణంగా మన ఇళ్లలో రాత్రి పూట చపాతీలు చేసుకోవడం అలవాటు. అయితే చపాతీలోకి నంజుకోవడానికి రోజువారీగా చేసుకునే బంగాళాదుంప కుర్మానో, టమాటా పప్పు లేదా చికెన్ కర్రీనో తిని బోర్ కొట్టిందా? అయితే వెజిటబుల్ సోయా వైట్ కుర్మా ట్రై చేయండి.
ఇంట్లో ఉండే సాధారణ కూరగాయలు, మీల్ మేకర్‌తో చేసుకునే ఈ వైట్ కుర్మా రుచిలో హోటల్ స్టైల్ కుర్మాకు ఏమాత్రం తీసిపోదు. ముఖ్యంగా బ్యాచిలర్స్ తక్కువ సమయంలో, తక్కువ శ్రమతో చేసుకునే అద్భుతమైన వంటకం ఇది. రుచికరమైన వెజిటేబుల్ సోయా వైట్ కుర్మా ఎలా చేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
నూనె - 2 టేబుల్ స్పూన్లు
సోంపు - 1 టీస్పూన్
ఏలకులు - 2
లవంగాలు - 2
అనాస పువ్వు - 1
దాల్చిన చెక్క - 1 చిన్న ముక్క
బిర్యానీ ఆకు - 1
రాతి పువ్వు- కొద్దిగా
ఉల్లిపాయ - 1
క్యారెట్ - 1
బీన్స్ - 3
బంగాళాదుంప - 1
మీల్ మేకర్- అర కప్పు
కొత్తిమీర, పుదీనా - కొద్దిగా
ఉప్పు - రుచికి సరిపడా
పచ్చి కొబ్బరి తురుము - అర కప్పు
అల్లం - 1 చిన్న ముక్క
వెల్లుల్లి - 5 రెబ్బలు
జీడిపప్పు - 10
గసగసాలు - 1 టీస్పూన్
పచ్చిమిర్చి - 3
తయారీ విధానం
-ముందుగా మీల్ మేకర్ ను బాగా వేడి నీటిలో ఒక 5 నిమిషాల పాటు నానబెట్టాలి. అవి మెత్తబడ్డాక, నీటిని పూర్తిగా పిండేసి పక్కన పెట్టుకోవాలి.
-ఇప్పుడు మిక్సీ జార్ లో కొబ్బరి, అల్లం, వెల్లుల్లి, జీడిపప్పు, గసగసాలు, కొద్దిగా నీళ్ళు పోసి మెత్తని పేస్ట్ లా రుబ్బుకోవాలి.
-తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టి నూనె వేడి చేయండి. నూనె వేడెక్కాక సోంపు, ఏలకులు, లవంగాలు, అనాస పువ్వు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, కల్పాసి వేసి దోరగా వేయించాక సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి.
-ఉల్లిపాయ ముక్కలే మెత్తబడి లేత రంగులోకి వచ్చిన తర్వాత తరిగిన క్యారెట్, బీన్స్, బంగాళాదుంప ముక్కలను వేసి మరో 2 నిమిషాల పాటు నూనెలో మగ్గనివ్వాలి.
-కూరగాయలు కాస్త వేగాక ముందుగా సిద్ధం చేసుకున్న మీల్ మేకర్ ముక్కలను వేసి కలపాలి. వెంటనే రుబ్బుకున్న కొబ్బరి-జీడిపప్పు పేస్ట్ ను కూడా కుక్కర్ లో వేయాలి.
-మిక్సీ జార్ కడిగిన నీళ్లు, కుర్మాకి సరిపడా అదనపు నీళ్లు (సుమారు 1 కప్పు) పోసి బాగా కలపాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. ఈ కుర్మా తెల్లగా ఉండాలి కాబట్టి కారం పొడి అస్సలు వాడకూడదు, పచ్చిమిర్చి కారమే సరిపోతుంది.
-కుక్కర్ మూత పెట్టి, మీడియం మంటపై 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఆవిరి పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి సన్నగా తరిగిన కొత్తిమీర, పుదీనా చల్లి ఒకసారి కలిపితే చాలు.
-అంతే ఎంతో రుచికరమైన, క్రీమీగా ఉండే వెజిటబుల్ సోయా వైట్ కుర్మా రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications