Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
నోరూరించే స్టఫ్డ్ టమాటో కర్రీ.. తక్కువ శ్రమతో అదిరిపోయే రుచి!
భారతీయ వంటగదిలో టమాటోలకు ఉండే స్థానం ప్రత్యేకమైనది. మనం రోజూ తినే భోజనంలో టమాటోలను సలాడ్ గా పచ్చిగా తింటాం లేదా కూరల్లో పులుపు, గ్రేవీకి చిక్కదనం తీసుకురావడానికి వాడుతాం. ఇంకా చెప్పాలంటే ఘాటైన టొమాటో పచ్చడి లేనిదే చాలామందికి ముద్ద దిగదు. అయితే టొమాటోలను కేవలం ఇతర కూరల్లో సహాయకారిగా మాత్రమే కాకుండా, వాటినే ప్రధాన వంటకంగా చేసే స్టఫ్డ్ టమాటో కర్రీ (మసాలా నింపిన టొమాటో కూర) ఎప్పుడైనా రుచి చూశారా?

ఈ స్టఫ్డ్ టమాటో కర్రీ రుచికి రుచి, అలాగే సమయాన్ని కూడా చాలా ఆదా చేస్తుంది. టమాటోలు చాలా త్వరగా ఉడికిపోతాయి కాబట్టి, గంటల తరబడి వంటగదిలో శ్రమించాల్సిన అవసరం ఉండదు. కేవలం లోపల పెట్టే స్టఫింగ్ (మసాలా మిశ్రమం) సిద్ధం చేసుకుని, టొమాటోలలో కూరి ఉడికిస్తే చాలు.. గుమగుమలాడే కూర మీ డైనింగ్ టేబుల్ పైకి వచ్చేస్తుంది.
స్టఫ్డ్ టమాటో కర్రీ తయారీకి కావలసిన పదార్థాలు
మీడియం సైజు టమాటోలు
పల్లీలు- పావు కప్పు
తెల్ల నువ్వులు - 1 టేబుల్ స్పూన్
సేవ్ (లావుపాటి కారప్పూస)- పావు కప్పు
వెల్లుల్లి రెబ్బలు - 5
పసుపు - 1 టీస్పూన్
కారం పొడి - 1 టేబుల్ స్పూన్
ధనియాల పొడి - 1 టేబుల్ స్పూన్
గరం మసాలా - 1 టీస్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - తాలింపు కొరకు
జీలకర్ర - 1 టీస్పూన్
సన్నగా తరిగిన తాజా కొత్తిమీర
స్టఫ్డ్ టమాటో కర్రీ తయారీ విధానం
-ముందుగా స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని మంటను సిమ్లో ఉంచి వేరుశెనగ గుళ్లను పచ్చివాసన పోయేలా దోరగా వేయించుకుని పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని, అందులో ముందుగా వేయించిన పల్లీలు, తెల్ల నువ్వులు, వెల్లుల్లి రెబ్బలు, సేవ్ వేసి బరకగా గ్రైండ్ చేసుకోండి.
-ఒక గిన్నెలో మనం గ్రైండ్ చేసుకున్న పొడిని తీసుకోండి. దానికి పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, రుచికి సరిపడా ఉప్పు, తరిగిన కొత్తిమీర వేసి బాగా కలుపుకోండి. ఇదే మన టమాటోల లోపల నింపే అసలైన మసాలా.
-ఇప్పుడు తాజా టమాటోలను కడిగి, పొడిగా తుడవండి. ఇప్పుడు ప్రతి టమాటోను పైభాగం నుండి నాలుగు భాగాలుగా కోయండి. కానీ ముక్కలు విడిపోకుండా అడుగు భాగం కలిసే ఉండేలా చూసుకోండి.
-సిద్ధం చేసుకున్న స్టఫింగ్ మసాలాను ప్రతి టమాటో లోపల జాగ్రత్తగా నింపండి.
-ఇప్పుడు పాన్ లో కొద్దిగా నూనె వేడి చేసి, జీలకర్ర వేసి చిటపటలాడనివ్వండి. ఆ తర్వాత మసాలా కూరిన టమాటోలను ఒక్కొక్కటిగా పాన్ లో నెమ్మదిగా పేర్చండి. మూత పెట్టి సన్నని మంట మీద 4-5 నిమిషాల పాటు ఉడికించండి. మిగిలిన స్టఫింగ్ మసాలా ఏమైనా ఉంటే దానిని కూడా టమాటోల చుట్టూ వేయండి.
-చివరగా అర కప్పు వేడి నీళ్లను కూరలో పోసి మళ్లీ మూతపెట్టండి. మరో 4-5 నిమిషాలు ఉడికించండి. నూనె పైకి తేలి, టమాటోలు మెత్తబడగానే స్టవ్ ఆపేయండి.
-అంతే గుమగుమలాడే వేడివేడి స్టఫ్డ్ టమాటో కర్రీ రెడీ. దీనిని వేడి వేడి చపాతీ, పరాఠా, రోటీ లేదా అన్నంతో వడ్డించండి. పల్లీలు, నువ్వుల కమ్మదనం, టమాటోల పులుపు కలగలిసి ఈ కూర మీ నోటికి పండుగలా అనిపిస్తుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications