Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
కాల్షియం నిండుగా, రుచి మెండుగా.. అదిరిపోయే రాగి ఖీర్ ఎలా చేసుకోవాలంటే..
ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మిల్లెట్స్ లో ఒకటైన రాగితో అనేక వంటకాలను తయారుచేస్తుటారు. రాగి చపాతీ,రాగి దోశ, రాగి ఇడ్లీ, రాగి లడ్డూ ఇలాంటి ఏదో ఒక సందర్భంలో టేస్ట్ చేసి ఉంటారు. అయితే మీరెప్పునా రాగి ఖీర్ లేదా రాగి పాయసం ఎప్పుడైనా ట్రై చేశారా? ఇది కేవలం రుచికరంగా ఉండటమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. అధిక కాల్షియం, ఐరన్, ఫైబర్ కంటెంట్‌కు ప్రసిద్ధి చెందిన సూపర్ ఫుడ్ ఇది.రాగి ఖీర్ తయారు చేయడం చాలా సులువు. ఇంట్లో లభించే సాధారణ పదార్థాలతోనే దీనిని సిద్ధం చేసుకోవచ్చు. రాగి ఖీర్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.
రాగి ఖీర్ తయారీకి కావాల్సిన పదార్థాలు
-రాగి పిండి - 1/2 కప్పు
-పాలు - 2 కప్పులు
-ఉప్పు- సరిపడా
-బెల్లం తురుము - 1/2 కప్పు
-నీరు - 1/2 కప్పు
-యాలకుల పొడి - 1/2 టీస్పూన్
-నెయ్యి - 1 టీస్పూన్
-డ్రై ఫ్రూట్స్ (బాదం, జీడిపప్పు, కిస్మిస్) - 2 టేబుల్ స్పూన్లు

రాగి ఖీర్ తయారీ విధానం
-ముందుగా ఒక చిన్న గిన్నెలో రాగి పిండి, అర కప్పు నీరు పోసి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇది చిక్కని పేస్ట్ లాగా మారుతుంది.
-తర్వాత స్టవ్ మీద గిన్నె లేదా పాన్ పెట్టి అందులో 1 టీస్పూన్ నెయ్యి వేసి వేడి చేయండి. నెయ్యి కరిగిన తర్వాత సన్నగా తరిగిన డ్రై ఫ్రూట్స్ వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించి పక్కన పెట్టుకోండి.
-అదే గిన్నెలో 2 కప్పుల పాలు పోసి మీడియం మంటపై మరిగించాలి. పాలు పొంగివచ్చే వరకు వేడి చేయండి.
-పాలు మరుగుతున్నప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న రాగి పిండి మిశ్రమాన్ని ఇందులో నెమ్మదిగా కలుపుతూ, గడ్డలు కట్టకుండా నిరంతరం కలుపుతూ ఉండండి.
-మంటను తగ్గించి 5-7 నిమిషాల పాటు ఉడికించండి. రాగి పిండి పాలలో పూర్తిగా కలిసిపోయి మిశ్రమం చిక్కబడుతుంది.
సంపూర్ణ ఆరోగ్యం కోసం ఒకే వంటకం..అరికెల పొంగలి ఎలా చేసుకోవాలంటే
-రాగి పిండి బాగా ఉడికిన తర్వాత బెల్లం తురుమును కలపండి. బెల్లం పూర్తిగా కరిగే వరకు బాగా కలుపుతూ ఉండండి.
-బెల్లం కరిగిన తర్వాత అవసరమైతే ఖీర్ చిక్కదనాన్ని బట్టి కొద్దిగా పాలు కలుపుకోవచ్చు.
-చివరగా యాలకుల పొడి, చిటికెడు ఉప్పు వేసి బాగా కలపండి.
-వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ తో అలంకరించండి. అంతే సూపర్ హెల్దీ రాగి ఖీర్ రెడీ. దీనిని వేడి వేడిగా లేదా చల్లగా ఎలా తిన్నా సూపర్ గానే ఉంటది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications