Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
పిల్లల నుంచి పెద్దల వరకు.. రక్తహీనత పోగొట్టి ఎముకల బలాన్ని పెంచే రాగి బీట్‌రూట్ జున్ను.!
ఈరోజుల్లో చాలా మంది రక్తహీనత సమస్య, ఎముకల బలహీనతతో బాధపడుతున్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధుల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. రోగనిరోధక శక్తి తగ్గడంతో పాటు నిరంతర అలసటా వారిలో ఉంటుంది. అలాంటి వారికి ఆరోగ్యకరమైన ఫుడ్ అందించడం అవసరం. రాగుల్లో కాల్షియం, బీట్‌రూట్‌లో ఐరన్ పుష్కలంగా ఉన్నందున రాగి బీట్‌రూట్ జున్నును తరచుగా తిన్నట్లయితే ఈ సమస్యను నివారించవచ్చు.

రాగులు, బీట్‌రూట్‌తో తయారుచేసే జున్ను పిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో మేలు చేస్తుంది. ఇది ఆరోగ్యకరమైన ఆహారం. శరీరానికి తగినన్ని పోషకాలు, ఖనిజాలను అందించి రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. వీటిలోని విటమిన్ ఎ, బి, సిలతో పాటు ఫొలేట్ వంటి పోషకాలు ఉన్న కారణంగా.. చర్మ సంరక్షణకు, కంటి చూపు మెరుగుపడటానికి దోహదపడుతుంది. సమృద్ధిగా ఫైబర్ ఉండటం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది. మలబద్ధకం సమస్యను నివారిస్తుంది. వీటిలోని ఫైటోన్యూట్రియెంట్లు, యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని విషతుల్యాలను బయటకు పంపిస్తాయి. రాగుల్లోని సహజమైన మొక్కల ఆధారిత ప్రోటీన్లు కండరాల నిర్మాణానికి తోడ్పడతాయి.
రాగి బీట్‌రూట్ జున్ను తయారీకి కావాల్సిన పదార్థాలు
రాగులు- ఒక కప్పు
బీట్‌రూట్- ఒకటి మీడియం
బెల్లం- రెండు కప్పులు
నెయ్యి- టీస్పూన్
డ్రైఫ్రూట్స్- అరకప్పు
ఏలకులు- మూడు
ఉప్పు- కొద్దిగా
రాగి బీట్‌రూట్ జున్ను తయారీ విధానం
ముందుగా రాగులను 8 గంటలపాటు నానబెట్టాలి. ఇప్పుడు బీట్‌రూట్‌ను తొక్క తీసి కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. రాగులను మరోసారి కడిగి నీళ్లు ఒంపి మిక్సీలోకి తీసుకోవాలి. దానితో పాటు బీట్‌రూట్ ముక్కలను వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు మెత్తగా రుబ్బిన పేస్ట్‌ను రెండు నుంచి మూడు సార్లు నీళ్లు పోస్తూ వడగట్టుకోవాలి.

ఇప్పుడు మరో గిన్నెలో బెల్లం వేసి కొన్ని నీళ్లు పోసి కరిగేవరకు స్టవ్‌పైన పెట్టాలి. కరిగాక ఆ నీటిని వడగట్టుకోవాలి. ఆ బెల్లం నీటిలో రాగి, బీట్‌రూట్ జ్యూస్‌ను కలిపి 20 నిమిషాల పాటు మరిగించాలి. తర్వాత చిన్న పాన్‌లో నెయ్యివేసి కాగిన తర్వాత డ్రైఫ్రూట్స్, ఏలకుల పొడి వేసి వేగిన తర్వాత రాగి, బీట్‌రూట్, బెల్లం మిశ్రమంలో కలుపుకోవాలి. మిశ్రమం చిక్కగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. కాసేపటికి జున్నులా మారుతుంది.
చివరిగా వేడివేడిగా ఉన్న ఈ జున్నును వెడల్పాటి గిన్నె తీసుకుని దానిపైన అరిటాకు వేసి పరుచుకోవాలి. చల్లారనివ్వాలి. అంతే రుచికరమైన రాగి బీట్‌రూట్ జున్ను రెడీ. వీటిని ముక్కలుగా కట్ చేసుకుని తినవచ్చు. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికీ ఈ ఆరోగ్యకరమైన ఫుడ్ ఎంతో మేలు చేస్తుంది.
రాగి బీట్‌రూట్ జున్నులో ఉండే పోషకాల ద్వారా జుట్టు ఆరోగ్యకరంగా ఉండేలా కాపాడుకోవచ్చు. చర్మాన్ని పొడిబారకుండా తేమగా ఉంచుతుంది. హార్మోన్లను సమతుల్యంగా ఉంచుతుంది. దంతాల బలానికి దోహదపడుతుంది. వర్షాకాలంలో పిల్లలకు స్నాక్స్‌లా ఈ రెసిపీని చేసిపెట్టడం ద్వారా వారిలో అలసట తగ్గి ఉత్సాహంగా ఉంటారు. బీట్‌రూట్, రాగులతో చేసే వంటకాలను విడిగా తినడం ఇష్టం లేని వారు ఇలా చేసుకోవడం ద్వారా ఒకటికి రెండు తినేస్తారు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications