కరివేపాకుతో రాగి రొట్టి ఇలా చేసుకొని తింటే వర్షాకాలం లో జబ్బులు అన్ని మటు మాయం!

Posted By:

ఉదయం పూట ఎప్పుడూ ఇడ్లీ, దోసె తిని బోర్ కొట్టిందా? అయితే మీ ఇంట్లో రాగిపిండి "ఫింగర్ మిల్లెట్" ఉంటే చాలు ఈ వర్షాకాలంలో నోటికి కమ్మగా రొట్టి చేసి తినండి. దీనికి తాజాగా కొన్ని కరివేపాకు, జీలకర్ర జోడించి తయారుచేస్తే వాసనకే మీకు నోరు ఊరిస్తుంది. ఇది రుచికరమైనది మరియు పోషకమైనది కూడా. ఇది ఆరోగ్యకరమైన మరియు పోషకమైన గ్లూటెన్ రహిత రొట్టి.మరియు దీన్ని తయారు చేయడం చాలా సులభం. ముఖ్యంగా దీనికి సైడ్ డిష్ అవసరం లేదు. రాగి పిండిలో అధిక ఐరన్, కాల్షియం మరియు ఫైబర్ కంటెంట్ ఉంటుంది. దీన్ని దక్షిణ భారతీయులు అత్యంత ఇష్టపడే గ్లూటెన్ రహిత ధాన్యాలలో ఒకటిగా చేస్తుంది.

ఈ రాగిపిండితో తయారుచేసే వంటలు, డయాబెటిస్ కు చాలా మంచిది. కరివేపాకులోని హైపోగ్లైసీమిక్ లక్షణం శరీరంలోని రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.కళ్లకు మంచిది, ఇన్ఫెక్షన్స్ తో పోరాడుతుంది. అలాగే జీలకర్ర జీర్ణశక్తి పెంచుతుంది.ఐరన్ పుష్కలంగా ఉండటం వల్ల రక్తహీనతను నివారిస్తుంది. ఇక రాగి పిండి ఎముకలను పటిష్టం చేస్తుంది, బరువు పెరగడం, బరువు తగ్గడం లేదా రక్తహీనతను అధిగమించడానికి సహాయపడుతుంది, రాగి పిండితో వివిధ రకాల ఆహారాన్ని తయారు చేసుకోవచ్చు. అధిక ఫైబర్ ఉండే రాగి పిండి వంటలు ఆకలి అవ్వుకుండా ఎక్కువసేపు ఉంచడం కోసం మిమ్మల్ని కడుపు నిండిన భావన కల్పిస్తుంది. జంక్ ఫుడ్ జోలికి పోనివ్వదు.

ఈ రాగి పిండితో రోటీ, దోస, ఉప్మా, గంజి, ముద్దే, లడ్డూ మరియు హల్వా వంటి అనేక వంటలను తయారుచేసుకోవచ్చు. అయితే ఈ రోజు మనం కరివేపాకు జీలకర్ర రాగి రొట్టి ఎలా చేయాలో తెలుసుకోండి. కరివేపాకు జీలకర్ర రాగి రొట్టి రెసిపీ ఒక సింపుల్ రిసిపి క్రింద ఉంది. చదివి రుచి చూసి మీ అభిప్రాయాన్ని మాతో పంచుకోండి.

కావాల్సిన పదార్థాలు:
* రాగి పిండి - 2 కప్పులు
* నూనె - 2 టేబుల్ స్పూన్లు
* ఆవాలు - 1/2 tsp
* జీలకర్ర - 2 tbsp
* ఉల్లిపాయ - 2 (సన్నగా తరిగినవి)
* పచ్చిమిర్చి - 8 (సన్నగా తరిగినవి)
* కరివేపాకు - 1 కప్పు (సన్నగా తరిగినవి)
* కొత్తిమీర - కొద్దిగా (సన్నగా తరిగినవి)
* ఉప్పు - రుచికి సరిపడా
* నీరు - అవసరమైన పరిమాణం

తయారుచేయు విధానం
* ముందుగా స్టౌ మీద ఫ్రైయింట్ పాన్ పెట్టి అందులో రాగి పిండి వేసి రెండు మూడు నిముషాలు వేయించాలి. తర్వాత ప్లేట్ లో తీసుకుని చల్లారనివ్వాలి.
* తర్వాత పొయ్యి మీద కడాయి పెట్టి అందులో నూనె పోసి వేడయ్యాక ఆవాలు, జీలకర్ర వేసి తాలింపు వేయాలి.
* తర్వాత అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయను వేసి, కొద్దిగా ఉప్పు చల్లి గ్లాస్‌గా వేగించాలి.
* తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు వేసి కాసేపు వేయించాలి.
* తర్వాత అందులో కొత్తిమీర తరుగు కూడా వేసి వేగించాలి.
* ఆ తర్వాత మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో రాగి పిండి వేసి వేయించిన పదార్థలన్నీ వేసిగా బాగా కలపాలి. తర్వాత సరిపడా నీళ్ళు పోసి రాగి పిండిని ముద్దలా కలుపోవాలి.
* తర్వాత మెత్తగా కలుపుకున్న పిండిని కొద్దికొద్దిగా తీసుకుని రోల్ చేసి ప్లేటులో పెట్టుకోవాలి.
*తర్వాత అరటి ఆకు లేదా పాల కవర్ పై కూడా పిండిని వేసి రొట్టిలా తట్టుకోవచ్చు. లేదా నేరుగా పెనం వేసి కూడా నీళ్ళ చిలకరిస్తూ రొట్టె తట్టుకోవచ్చు.
* చివరగా స్టౌ మీద పాన్ పెట్టి వేడి అయ్యాక అందులో నూనె రాసి రాగి రొట్టే వేసి పైన నూనె చిలకరించి అటు ఇటు బాగా కాల్చాలి. మీడియం మంట మీద కాల్చడం వల్ల రుచికరమైన రాగి కర్రీలీవ్స్ రొట్టి రెడీ. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది.

Image Courtesy: Gomathi's Kitchen

[ of 5 - Users]
Desktop Bottom Promotion