Latest Updates
-
మహిళలను వేధిస్తున్న పీసీఓఎస్ సమస్య.. వాళ్లు ఏం చేయాలి ఏం చేయకూడదో తెలుసా.? -
శరవణ భవన్ స్టైల్ వెన్ పొంగల్..కొబ్బరి చట్నీతో తింటే మర్చిపోలేరు! -
తప్పతాగి రోడ్డుకి అడ్డంగా పడుకున్న యువతి.. ఒక చేతిలో సిగరెట్, పక్కనే మందు బాటిల్తో రచ్చ.! -
మెరిసే ముఖం కోసం ఇంట్లోనే ఫేస్ ఆయిల్.. రోజూ ఉదయం ఇలా చేస్తే చాలు.! -
అమ్మాయిల గురించి మీకు తెలియని 7 షాకింగ్ నిజాలు! -
శిల్పా శెట్టి స్పెషల్..పంచదార లేని పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం.. టేస్ట్ అదుర్స్! -
షుగర్ పేషెంట్లకు రోజులో ఎక్కువ డేంజరస్ టైం ఏది? బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ కి ఈజీ చిట్కాలు.. -
వర్క్ ఫ్రం హోంలో పెరుగుతున్న ఒత్తిడి.. ఆందోళన తగ్గేందుకు ఇలా చేయండి.! -
మెనోడివోర్స్ అంటే ఏంటి? నడివయసులో దాంపత్యం దారితప్పడానికి కారణమిదే.. -
పప్పులకు పురుగులు పడుతున్నాయా? ఈ ఒక్కటి వేస్తే చాలు ఏడాదైనా పాడవ్వవు!
బంటికి బలం, నోటికి రుచి..క్యాల్షియం, ఐరన్ నిండిన రాజస్థాన్ ఫేమస్ చుర్మ లడ్డు..ఎలా చేసుకోవాలంటే..
భారతదేశం విభిన్న సంస్కృతులకు, ఆచారాలకు,అత్యంత రుచికరమైన వంటకాలకు పుట్టినిల్లు. ఒక్కో రాష్ట్రానికి ఒక్కో ప్రత్యేకమైన వంటకం ఉంటుంది. అలాంటి వాటిలో రాజస్థానీ వంటకాలకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎంతో గుర్తింపు ఉంది. రాజస్థానీ సాంప్రదాయ వంటకాల్లో చుర్మ లడ్డూ అత్యంత ప్రాచుర్యం పొందింది. చుర్మ లడ్డూ అంటే కేవలం ఒక స్వీట్ మాత్రమే కాదు, ఇది రాజస్థానీయుల ఆతిథ్యానికి ప్రతీక.

రాజస్థాన్ స్పెషల్ చుర్మ లడ్డు తయారీకి కావాల్సిన పదార్థాలు
-గోధుమ నిండి
-ఉప్మా రవ్వ
-శెనగపిండి
-జీడిపప్పు
-బాదంపప్పు
-బెల్లం
-నూనె లేదా నెయ్యి
-నీళ్లు
-యాలకలు
రాజస్థాన్ స్పెషల్ చుర్మ లడ్డు తయారీ విధానం
-ముందుగా ఒక వెడల్పాటి గిన్నెను తీసుకొని అందులో 2 కప్పుల గోధుమ పిండి(పావు కేజీ), అర కప్పు ఉప్మా రవ్వ, 2 టేబుల్ స్పూన్ల శెనగపిండి వేసి మొత్తం కలిసేలా ఒకసారి బాగా కలపండి.
-ఇప్పుడు అందులో 3-4 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి పిండికి పట్టేలా బాగా కలపండి. దీంతో లడ్డూలు గట్టిగా రాకుండా మృదువుగా వస్తాయి.
-ఇప్పుడు పిండిలో 1 కప్పు నీళ్లను కొద్ది కొద్దిగా పోసుకుంటూ పిండిని మరీ మెత్తగా కాకుండా సెమీ సాఫ్ట్ గా కలపండి.
-ఇప్పుడు కలిపిన పిండి కొద్ది కొద్దిగా చేతుల్లోకి తీసుకొని కొంచెం పల్చగా పొడవాటి కుడుముల్లా నొక్కుకొని ఓ ప్లేట్ లో పెట్టుకోండి.
-ఇప్పుడు నొక్కుకున్న వాటిని ఫ్రై చేయడానికి స్టవ్ మీద కడాయి పెట్టి అందులో డీప్ ఫ్రై చేయడానికి సరిపడా నెయ్యి లేదా ఆయిల్ వేసి వేడి చెయ్యాలి.
-వేడెక్కిన నెయ్యి లేదా నూనెలో కుడుముల్లా నొక్కుకున్న వాటిని వేసి మీడియం మంట మీద మధ్య మధ్యలో స్పూన్ తో తిప్పుకుంటూ ఫ్రై చెయ్యాలి.అవి బాగా ఫ్రై అయ్యి పైన మంచి కలర్ వచ్చి క్రిస్పీగా అయ్యాక వీటిని ఓ ప్లేట్ లోకి తీసి పక్కన పెట్టుకోండి. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కలుగా విరిచి గిన్నెలో వేసుకోండి.
-ఇప్పుడు స్టవ్ మీద పాన్ లో ఉన్న నెయ్యిలోనే పావు కప్పు బాదంపప్పు వేసి 3-4 నిమిషాలు వేయించి తీసి పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు పావు కప్పు జీడిపప్పు పలుకులను కూడా స్టవ్ మీద పాన్ లో ని నెయ్యిలో వేసి ఎర్రగా అయ్యేంతవరకు వేయించి తీసి పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు మిక్సీ జార్ లో ముక్కలుగా చేసుకున్న వాటిని వేసి,ఇందులో 8 యాలకలను దంచి వేసి మధ్య మధ్యలో కలపుకుంటూ పల్స్ మోడ్ లో గ్రైండ్ చేసుకోండి. దీంతో అది ముద్దలా కాకుండా రవ్వలా వస్తుంది.
- గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక గిన్నెలో వేసుకోండి.
-ఇప్పుడు స్టవ్ మీద పాన్ లో 4 టేబుల్ స్పూన్ల నెయ్యిలో ఒక కప్పు బెల్లం(250 గ్రాములు) వేసి తక్కువ మంట మీద కలుపుతూ కరిగించాలి. పాకం పట్టాల్సిన అవసరం లేదు.
-కరిగిన బెల్లం సిరప్ ని గ్రైండ్ చేసుకున్న పిండి మిశ్రమంలో వేసుకోండి. ఇందులోనే వేయించిన జీడిపప్పు, బాదంపప్పులను చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసి గరటితో మొత్తం బాగా కలుపుకోండి.
-తర్వాత కొంచెం కొంచెం మిశ్రమాన్ని చేతుల్లోకి తీసుకొని లడ్డుల్లా చేసుకోండి. అంతే హెల్తీ,టేస్టీ చుర్మ లడ్డు రెడీ. వీటిని డబ్బాలో పెట్టుకుంటే దాదాపు నెల రోజుల వరకు పాడవకుండా ఉంటాయి.

చుర్మ లడ్డు ఆరోగ్య ప్రయోజనాలు
-ఈ లడ్డూలో ఉండే గోధుమ పిండి, నెయ్యి, బెల్లం శరీరానికి కావాల్సిన కార్బోహైడ్రేట్లు, క్యాలరీలను తక్షణమే అందిస్తాయి. ఉదయం పూట రోజుకు ఒక లడ్డూ తినడం వల్ల రోజంతా ఉల్లాసంగా, యాక్టివ్ గా ఉండొచ్చు.
-పంచదారకు బదులుగా బెల్లం వాడటం వల్ల ఎముకలకు అవసరమైన కాల్షియం, ఫాస్పరస్ లభిస్తాయి. పాలు, నెయ్యి కూడా వాడటం వల్ల ఎముకలు దృఢంగా తయారవుతాయి.
-మితంగా క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రక్తంలో హిమోగ్లోబిన్ శాతం త్వరగా పెరిగి, రక్తహీనత సమస్య దరిచేరకుండా ఉంటుంది. శరీరంలో రక్త ప్రసరణ కూడా మెరుగుపడుతుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications