Latest Updates
-
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.! -
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్!
Raju gari kodi pulao: రాజు గారి 'కోడి పులావ్'..ఇలా చేసుకుంటే వాసనకే కడుపు నిండిపోతుంది
రాజు గారి కోడి పులావ్ అంటే తెలియని తెలుగువారుండరు. సిటీల్లో ఉండే చాలామంది వీకెండ్ వస్తే మధ్యాహ్నాం,సాయంత్రం రెండుపూట్ల రెస్టారెంట్లకి వెళ్లి రాజు గారి కోడి పులావ్ ఆర్డర్ చేసుకొని తింటుంటారు. అసలు దీని వాసనకే కడుపు నిండిపోతుంటది. రెస్టారెంట్ స్టైల్ రాజుగారి కోడి పులావ్ ని ఇంట్లోనే ఈజీగా తయారుచేసుకోవచ్చు. వాసనతో ఇల్లంతా ఘుయాయించే రాజుగారి కోడి పులావ్ తయారీకి కావాల్సిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.
రాజు గారి కోడి పులావ్ తయారీకి కావాల్సిన
పదార్థాలు
-1 కేజీ చికెన్
-2 గ్లాస్ ల నానబెట్టిన బియ్యం
-జీడిపప్పు
-పచ్చిమిర్చి పేస్ట్
-అల్లం వెల్లుల్లి పేస్ట్
-దాల్చిన చెక్క
-యాలకలు
-లవంగ మొగ్గలు
-బిర్యానీ ఆకులు
-జాపత్రి
-ధనియాల పొడి
-జీలకర్ర పొడి
-పసుపు
-ఉల్లిపాయ
-ఆయిల్
-నెయ్యి
-కారం
-ఉప్పు
-గరం మసాలా
-కొత్తిమీర
-పుదీనా
-అనాస
-నూనె

రాజు గారి కోడి పులావ్ తయారీ విధానం
-ముందుగా 2 గ్లాసుల బియ్యం నానబెట్టుకోండి.
-తర్వాత స్టవ్ మీద ఒక పెద్ద గిన్నె పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి,6 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి అది కొంచెం వేడెక్కిన తర్వాత అందులో అరకప్పు(40 గ్రాములు)జీడిపప్పు,2 ఇంచుల దాల్చిన చెక్క, స్టార్ అనాస ఒకటిన్నర, 4 యాలకులు,8 లవంగ మొగ్గలు,2 బిర్యానీ ఆకులు,1 జాపత్రి వేసి వేయించుకోవాలి.
-తర్వాత అందులో సన్నగా కట్ చేసిన అరకేజీ ఉల్లిపాయలు వేసి ఎర్రగా వేగిన తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ పచ్చిమిర్చి పేస్ట్,కొద్దిగా పసుపు వేసి కలుపుకోండి.
-1 నిమిషం తర్వాత అందులో శుభ్రం చేసిన 1 కేజీ చికెన్ ను వేసి బాగా కలపి మూతపెట్టేసి మంటను మీడియం ప్లేమ్ లో ఉంచండి.
-3 నిమిషాల తర్వాత మూత తీసి ఇంకోసారి బాగా కలపి తర్వాత అందులో 2 టీ స్పూన్ల ధనియాల పొడి,1 టీస్పూన్ జీలకర్ర పొడి,1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 2 టేబుల్ స్పూన్ల కారంపొడి, రుచికి సరిపడా ఉప్పు వేసి మొత్తం కలిసేలా బాగా కలిపి మూత పెట్టి మీడియం ప్లేమ్ మీద 2 నిమిషాలు ఉడికించండి.
-తర్వాత మూత తీసి అందులో ఒక కప్పు కొత్తిమీర,అరకప్పు పుదీనా వేసి కలపండి. తర్వాత అందులోనే 200 గ్రాముల పెరుగు కూడా వేసి కలిపి మూతపెట్టి మంటను లో ప్లేమ్ మీద పెట్టి 10 నిమిషాలు ఉడికించాలి.
-తర్వాత మూత తీసి 80శాతం వరకు చికెన్ ఉడికిందో లేదో చెక్ చేయండి. 80శాతం ఉడికిన చికెన్ లో 5 గ్లాసుల నీళ్లు పోసి మూత పెట్టి 15 నిమిషాలు మీడియం ప్లేమ్ మీద ఉడికించాలి.
-తర్వాత గంటతో ఆయిల్ కలిసేలా కలిపి అందులోనే 2 గ్లాసుల నానబెట్టిన బియ్యం పోసి కలిపి మూతపెట్టేయండి.
-5 నిమిషాల తర్వాత మూత తీసి ఒక్కసారి కలిపి తర్వాత 2 టేబుల్ స్పూన్ల నెయ్యి అందులో వేసి మూతపెట్టేసి మంటను లో ప్లేమ్ మీద పెట్టి 15 నిమిషాలు ఉడికిస్తే వేడి వేడి రాజుగారి పులావ్ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications