Latest Updates
-
వేసవి స్పెషల్.. ఎవరూ ఊహించని పుచ్చకాయ తొక్క హల్వా.. వావ్ అనాల్సిందే! -
రొటీన్ మామిడికాయ పచ్చళ్లతో బోర్ కొట్టిందా? అయితే క్యారెట్ మామిడి పచ్చడి ట్రై చేయండి..వేడి అన్నంలోకి నెయ్యితో.. -
నీట్ పరీక్ష రోజు పీరియడ్స్ వస్తున్నాయా? కంగారు వద్దు.. ఈ చిట్కాలు మీకోసమే! -
తెలంగాణలో మండుతున్న ఎండలు: గర్భిణులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
పొయ్యి వెలిగించే పనే లేదు.. నోట్లో వెన్నలా కరిగిపోయే పచ్చి కొబ్బరి పాయసం -
భార్య వేధింపులు భరించలేక టెక్కీ ఆత్మహత్య: అసలేం జరిగింది? -
సమ్మర్ లో దొరికే అరుదైన పండు..బీపీ కంట్రోల్, జీర్ణక్రియ నుంచి కాలేయ సంరక్షణ వరకు బోలెడు ప్రయోజనాలు -
వ్యతీపాత యోగంతో ఈ రాశుల వారికి రాజయోగం.. ఈ తప్పులు అస్సలు చేయకండి! -
ఇలా టమాటా రసం చేస్తే పళ్లెంలో అన్నం నిమిషాల్లో ఖాళీ అవ్వాల్సిందే! -
హైదరాబాద్ టెక్కీ రాసిన 19 పేజీల నోట్… ఆ ఒక్క నిర్ణయం వెనుక ఉన్న భయంకరమైన నిజం ఇదే!
Ramzan Delicious Dishes: రంజాన్ అంటే హలీమ్ ఒక్కటే కాదు, లొట్టలేసే వంటకాలు చాలానే ఉన్నాయి
రంజాన్ నెల నడుస్తోంది. హైదరాబాద్ లో ఏ వీధి చూసిన హలీమ్ సెంటర్ లు వెలిశాయి. అలా రోడ్లపై వెళ్తూ ఉంటే ఫుడ్ లవర్స్‌ను హలీమ్ ఘుమఘుమలు ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నాయి. అయితే రంజాన్ అంటే హలీమ్ ఒక్కటే కాదు.
రంజాన్ నెలలో హలీమ్‌తో పాటు నోరూరించే ఎన్నో ఐటెమ్స్ తో హైదరాబాద్ హోటళ్లు సిద్ధమైపోతాయి. హైదరాబాదీ హలీమ్ మాత్రమే కాకుండా ఈ రంజాన్ నెలలో తప్పక రుచి చూడాల్సిన ఇతర ఆహార పదార్థాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.
1. నిహరి & కుల్చా
బిర్యానీ, హలీమ్ తర్వాత హైదరాబాదీలు చాలా ఇష్టంగా తినేది నిహరి & కుల్చాను. బీఫ్, మటన్, చికెన్ తో దీనిని తయారు చేస్తారు. నిహరి ని సాధారణంగా కుల్చా లేదా రోటీతో కలిపి తింటారు. మంచి ఇరానీ హోటళ్లలో ఇది లభిస్తుంది. చార్మినార్ సమీపంలోని హోటల్ నయాబ్ లో నిహరి & కుల్చా తప్పకుండా టేస్టు చేయండి.
2. పథర్ కా గోష్
వెడల్పాటి రాయిపై మటన్ ముక్కలతో పథర్ కా గోష్ తయారు చేస్తారు. మాంసం రంగు లేత గోధుమ రంగులోకి వచ్చేంత వరకు కాలుస్తారు. తర్వాత మంచి ఘాటైన మసాలాలు జోడిస్తారు.
3. దహి వడ
రంజాన్ నెలలో ఎక్కువ మంది తినే వంటకం దహి వడ. ఓల్ట్ సిటీతో పాటు హైదరాబాద్ లోని చాలా ప్రాంతాల్లో దహి వడ లభిస్తుంది. పెరుగులో వడను నానబెట్టి తయారు చేస్తారు. కొత్తిమీర, దానిమ్మ, ఆమ్చూర్ పౌడర్ ను జోడిస్ారు.
4. షాహి తుక్డా
పాలు, బ్రెడ్ స్లైసులు ప్రధాన పదార్థాలుగా తయారు చేసే ప్రసిద్ధ వంటకం షాహి తుక్డా. పాలు, చక్కెర, యాలకుల పొడి, బాదం, పిస్తా అన్ని వేసి మరిగి దగ్గరకు వచ్చాక అందులో నెయ్యిలో వేయించిన బ్రెడ్ స్లైసులు వేస్తారు. కొద్దిగా డబుల్ కా మీతా తరహాలో ఉండే షాహి తుక్డా రుచి అద్భుతంగా ఉంటుంది.
5. షీర్ ఖుర్మా
రంజాన్ రోజు షీర్ ఖుర్మా తాగనిదే అసలు పండగలా అనిపించదు. రంజాన్ మాసం అంతా హలీమ్ తో సరిసమానంగా షీర్ ఖుర్మా అమ్మకాలు జరుగుతాయి. చాలా మంది తీపి ప్రియులను ఆకట్టుకుంటుంది షీర్ ఖుర్మా.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications












