Latest Updates
-
రిలేషన్ షిప్ పై త్రిప్తి డిమ్రి ఆసక్తికర వ్యాఖ్యలు..అది ఉంటే తప్ప వర్కౌట్ కాదంట..! -
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 10 నిమిషాల ఎగ్ కుర్మా..ఎలా చేయాలో చూడండి.. -
మైగ్రేన్‌తో గుండెకి ప్రమాదం.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.! -
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం! -
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు!
రంజాన్ స్పెషల్..దహీ చనా ఇలా చేసుకుంటే శరీరానికి కొత్త శక్తి,పూర్వీకుల్లా బలంగా ఉండొచ్చు
ఈ ఏడాది మార్చి 2 నుంచే రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభమయ్యాయి. పవిత్ర రంజాన్ మాసంలో ముస్లింలు నెల రోజుల పాటు ఉపవాసం ఆచరించి నియమ నిబంధనలు పాటించి అల్లాని ప్రార్థిస్తారు. ఇస్లాం మతం ఆచారాల ప్రకారం ఉపవాస దీక్షను విరమించడానికి, ఉపవాస దీక్ష ప్రారంభించే ముందు సెహ్రీ, ఇఫ్తార్ నిర్వహిస్తారు. ఇఫ్తార్ విందులో భాగంగా రంజాన్ స్పెషల్ దహీ చనా తింటే అద్భుతమైన రుచిగా ఉండటంతో పాటు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. శెనగలతో తయారుచేసే దహీ చనాలో ఫైబర్ ఎక్కువగా ఉండటం వలన ఇది ఎక్కువ సమయం పాటు కడుపు నిండుగా ఉంచుతుంది.ఇది శరీరానికి కావలసిన శక్తిని అందిస్తుంది.
దహీ చనాలో వాడే కొత్తిమీర, పుదీనా వంటి ఆకుకూరలు శరీరానికి విటమిన్లు, ఖనిజాలను అందిస్తాయి. ఈ వంటకంలో వాడే మసాలా దినుసులు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి. రంజాన్ సమయంలో దహీ చనా లాంటి పోషకమైన ఆహారాలు తీసుకోవడం వలన శరీరం శక్తివంతంగా ఉంటుంది. దహీ చనా ఇంట్లో తయారుచేసుకోడానికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఇక్కడ చూడండి.

దహీ చనా తయారీకి కావలసిన పదార్థాలు
తెల్ల శెనగలు - 1 కప్పు
పెరుగు - 2 కప్పులు
చాట్ మసాలా - 1 టీస్పూన్
జీలకర్ర పొడి - 1/2 టీస్పూన్
నల్ల ఉప్పు - 1/4 టీస్పూన్
కారం - 1/2 టీస్పూన్
ఉల్లిపాయలు - 1
టమోటాలు - 2
పచ్చిమిర్చి - 2
కొత్తిమీర - కొద్దిగా
పుదీనా - కొద్దిగా
ఉప్పు - సరిపడా
ఆయిత్- 2 టేబుల్ స్పూన్లు
చింతపండు రసం - 2 టేబుల్ స్పూన్లు
బూందీ - కొద్దిగా
పచ్చికారం ఎగ్ కర్రీ ఎప్పుడైనా తిన్నారా? జిందగీలో ఇలాంటి టేస్ట్ చూసి ఉండరు,ఎలా చేయాలంటే
దహీ చనా తయారీ విధానం
-ముందుగా తెల్లశెనగలను రాత్రంతా నానబెట్టాలి.
-తర్వాత నానబెట్టిన శెనగలను కుక్కర్ లో వేసి మెత్తగా ఉడికించుకోవాలి.
-ఇప్పుడు ఒక పాన్ లో ఆయిల్ వేడి చేసి, సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి.
-తర్వాత సన్నగా తరిగిన టమోటాలు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసి టమోటాలు మెత్తబడే వరకు వేయించాలి.
-వేయించిన ఉల్లిపాయలు, టమోటాల మిశ్రమాన్ని ఉడికించిన శెనగల్లో వేసి కలపాలి.
-ఇప్పుడు పెరుగులో చాట్ మసాలా, జీలకర్ర పొడి, నల్ల ఉప్పు, కారం, ఉప్పు వేసి బాగా కలిపి దీనిని శెనగల మిశ్రమంలో వేసి బాగా కలపాలి.
-చివరగా కొత్తిమీర, పుదీనా, చింతపండు రసం వేసి కలపాలి. అంతే దహీ చనా రెడీ.
-దహీ చనాను ఒక గిన్నెలోకి తీసుకుని బూందీతో గార్నిష్ చేసి చల్లగా తింటే అద్భుతంగా ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications