Latest Updates
-
వాతావరణ మార్పులతో మోకాళ్ల నొప్పుల బాధలు.. ఉపశమనం కోసం ఇంట్లోనే ఇలా చేయండి.! -
తిరోగమనం నుంచి బయటపడ్డ బుధ గ్రహం.. ఇక ఈ రాశుల వారి దశ తిరిగినట్లే.! -
సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్‌కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.! -
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.!
ఇడ్లీ, దోశ పిండి లేదా? 15 నిమిషాల్లో రవ్వ మసాలా బన్ దోశ రెడీ..ఎలా చేసుకోవాలంటే
ఉదయాన్నే ఏం టిఫిన్ చేయాలా అని ఆలోచిస్తున్నారా? ఇంట్లో ఇడ్లీ, దోస పిండి లేదా? అయినా నో ప్రాబ్లమ్. కేవలం ఒక కప్పు బొంబాయి రవ్వ, కొన్ని కూరగాయలు ఉంటే చాలు, అప్పటికప్పుడు నోరూరించే, మెత్తటి మసాలా బన్ దోసను చిటికెలో రెడీ చేయవచ్చు. రుచి కూడా అమోఘం. దీనిని ఒక్కసారి మీ ఇంట్లోవాళ్లకు చేసిపెట్టారంటే మళ్లీ మళ్లీ కావాలని అడగడం ఖాయం. ఆ ఘుమఘుమలాడే వాసనకే సగం ఆకలి వేస్తుంది. ఈ అద్భుతమైన వంటకాన్ని ఎలా తయారు చేయాలో ఇక్కడ చూడండి.
కావలసిన పదార్థాలు
బొంబాయి రవ్వ (ఉప్మా రవ్వ) - 1 కప్పు
గోధుమ పిండి - పావు కప్పు
నీరు - తగినంత
ఉప్పు - రుచికి సరిపడా
పచ్చి కొబ్బరి తురుము - 2 టేబుల్ స్పూన్లు
క్యారెట్ తురుము - 1
టమాటా - 1
ఉల్లిపాయ - 1
బంగాళదుంప తురుము - 1
కొత్తిమీర - కొద్దిగా
కారం - 1 టీస్పూన్
జీలకర్ర పొడి - పావు టీస్పూన్
గరం మసాలా - పావు టీస్పూన్
నూనె - దోసలు కాల్చడానికి సరిపడా
దోస పైన చల్లడానికి:
ఉల్లిపాయ - 1 (చాలా సన్నగా తరిగినది)
కారం - అర టీస్పూన్
ఉప్పు - చిటికెడు

తయారీ విధానం
-ముందుగా ఒక పెద్ద గిన్నె తీసుకుని అందులో బొంబాయి రవ్వ వేయండి. రవ్వ మునిగేంత వరకు నీళ్లు పోసి ఒకసారి కలిపి, మూతపెట్టి అరగంట పాటు నానబెట్టాలి. ఇలా చేయడం వల్ల రవ్వ మెత్తగా ఉబ్బి, దోసలు స్పాంజిలా వస్తాయి.
-అరగంట తర్వాత నానిన రవ్వలో గోధుమపిండి, రుచికి సరిపడా ఉప్పు వేసి కలపండి. ఇప్పుడు కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ దోస పిండిలా జారుగా, ఉండలు లేకుండా కలుపుకోవాలి.
-ఈ పిండిలో సన్నగా తురిమిన క్యారెట్, తరిగిన టమాటా, ఉల్లిపాయ, కొబ్బరి తురుము, బంగాళదుంప తురుము, కొత్తిమీరను కూడా వేసి బాగా మిక్స్ చేయండి.
-చివరగా కారం, జీలకర్ర పొడి, గరం మసాలా వేసి పిండిని మరోసారి బాగా కలుపుకుని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టండి. ఈ సమయంలో మసాలాలన్నీ పిండికి బాగా పడతాయి.
-ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి వేడి చేయండి. పెనం వేడెక్కాక కొద్దిగా నూనె వేసి, ఒక గరిటెడు పిండిని తీసుకుని మరీ పల్చగా కాకుండా చిన్న బన్ లేదా ఊతప్పంలా పోయాలి.
-దోస పైన మనం సిద్ధం చేసుకున్న ఉల్లిపాయ-కారం మిశ్రమాన్ని చల్లి, మూత పెట్టి, మంటను తక్కువలో ఉంచి రెండు నిమిషాలు ఉడికించాలి.
-ఒకవైపు చక్కగా కాలిన తర్వాత రెండో వైపుకు తిప్పి, బంగారు రంగు వచ్చేవరకు కాల్చుకుంటే వేడివేడి, ఘుమఘుమలాడే రవ్వ మసాలా బన్ దోస రెడీ. దీనిని కొబ్బరి చట్నీ లేదా టమాటా చట్నీతో తింటే, ఆ రుచే వేరు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications