Latest Updates
-
విష్ణు సహస్రనామ స్తోత్రం చదివినా, విన్నా చాలు.. గ్రహ దోషాల నుంచి సత్వర ఉపశమనం.! -
ఒకే స్థానంలో గురు, రాహు గ్రహాలు.. గురు చండాల యోగంతో జీవితంలో ఈ కష్టాలు తప్పవు.! -
బెండకాయ ఎప్పుడు వండినా జిగురుగా ఉంటుందా.?..ఈ పద్ధతిలో ట్రై చేస్తే అస్సలు వదిలిపెట్టరు.! -
ఆకలినే ఆయుధంగా మార్చి 20 రోజులుగా నిరాహార దీక్ష.. ఎందుకీ ఉద్యమం, ఎవరీ సోనం వాంగ్ చుక్.! -
గ్రహాల శక్తితో పాటు దైవానుగ్రహం.. పూజలో ఈ రంగు వస్త్రాన్నే ఎందుకు ఉపయోగిస్తారో తెలుసా.? -
రాత్రి పూట స్వీట్ తినాలనిపిస్తుందా? ఓవెన్ అక్కర్లేకుండానే ఇంట్లోనే బేకరీ స్టైల్ బనానా బ్రెడ్ చేసుకోండిలా.. -
పిల్లలు, వృద్ధుల ఎముకల బలానికి రాగి, మునగాకు రోటి.. రోజూ ఒక్కటి తింటే చాలు.! -
మగవారిలో వీర్య కణాల సంఖ్య దారుణంగా పడిపోవడానికి ఈ పది ఆహార పదార్థాలే కారణం.! -
పప్పుచారులోకి బెస్ట్ సైడ్ డిష్.. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ వడ.. 10 నిమిషాల్లో చేసేయండిలా -
ఈ మూడు రాశుల వారికి ఊహించని ఆర్థిక అవకాశాలు.. ఏ పరిహారాలు చేస్తే ఇంకా మంచిది.!
గ్యాస్, ఎసిడిటీకి గుడ్ బై.. మీ జీర్ణక్రియను పెంచే సంజీవని పుదీనా కంజి వడ..ఎలా చేసుకోవాలంటే..
జూన్ నెలలోకి అడుగుపెట్టేశాం. భానుడి భగభగలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ తీవ్రమైన వేడికి ముందుగా అలసిపోయేది మన కడుపు. ఉక్కబోత, విపరీతమైన చెమటల వల్ల ఏమీ తినాలనిపించదు, ఆకలి చచ్చిపోతుంది. దీనికి తోడు అరగకపోవడం, గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఇలాంటి సమయంలో పొట్టకు హాయినిస్తూ, నోటికి రుచినిచ్చే బ్రేక్ ఫాస్ట్ దొరికితే ఆ రోజంతా ఎంతో ఉత్సాహంగా గడిచిపోతుంది. అందుకే మన పూర్వీకులు వేసవిలో ప్రత్యేకంగా చేసుకునే కంజి వడ ఈ టైంలో బెస్ట్ ఆప్షన్.

జస్థాన్, ఉత్తర భారతదేశంలో ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ సాంప్రదాయ వంటకానికి పుదీనా జోడిస్తే.. అద్భుతమైన రుచితో పాటు అసమానమైన ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతం అవుతాయి. పుదీనాలోని చల్లదనం కడుపు మంటను తగ్గిస్తుంది. ఇక కంజి నీటిలో వాడే ఆవాలు, ఇంగువ మీ జీర్ణక్రియను అద్భుతంగా మెరుగుపరుస్తాయి. వేసవిలో ఉబ్బరం, అజీర్ణంతో బాధపడేవారికి ఇది సంజీవని లాంటిది. ఇందులో ఉండే కొద్దిపాటి పుల్లని రుచి చచ్చిపోయిన ఆకలిని సైతం తిరిగి పుట్టిస్తుంది.
పుదీనా కంజి వడ తయారీకి కావలసిన పదార్థాలు
పెసరపప్పు - 1 కప్పు
తాజా పుదీనా ఆకులు - 1 కప్పు
కొత్తిమీర - అర కప్పు
పచ్చిమిర్చి - 2 లేదా 3
నల్ల ఆవాలు (లేదా పసుపు ఆవాలు) - 2 టేబుల్ స్పూన్లు
ఇంగువ - అర టీస్పూన్
నల్ల ఉప్పు (బ్లాక్ సాల్ట్) - 1 టేబుల్ స్పూన్
సాధారణ ఉప్పు - రుచికి సరిపడా
కారం - 1 టీస్పూన్
పసుపు - అర టీస్పూన్
వడలు వేయించడానికి - తగినంత నూనె

పుదీనా కంజి వడ తయారీ విధానం
-ముందుగా ఒకటిన్నర లీటర్ల నీటిని బాగా మరిగించి చల్లార్చుకుని, ఒక మట్టి కుండ లేదా గాజు పాత్రలో పోయాలి.
-ఇప్పుడు మిక్సీలో పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి వేసి కొద్దిగా నీళ్లు కలిపి మెత్తని పేస్ట్ లా రుబ్బాలి. ఈ పేస్ట్ ను ముందుగా చల్లార్చుకున్న నీటిలో కలపాలి. అందులో ఆవాల పొడి, ఇంగువ, నల్ల ఉప్పు, సాధారణ ఉప్పు, కారం, పసుపు వేసి బాగా కలుపుకోవాలి. ఈ పాత్రపై ఒక కాటన్ వస్త్రాన్ని కప్పి, ఒకటి లేదా రెండు రోజుల పాటు మితమైన సూర్యరశ్మి లేదా వెచ్చని ప్రదేశంలో ఉంచాలి.
-పెసరపప్పును 3-4 గంటల పాటు నానబెట్టాలి. తర్వాత నీరంతా వంపేసి, మిక్సీలో బరకగా రుబ్బుకోవాలి. పిండి మరీ పల్చగా ఉండకూడదు. ఈ పిండిలో కాస్త ఉప్పు, చిటికెడు ఇంగువ, సన్నగా తరిగిన పుదీనా వేసి 5 నిమిషాల పాటు చేత్తో ఒకే డైరక్షన్ లో బాగా గిలకొట్టాలి. ఇలా చేస్తే వడలు లోపల గాలి చేరి స్పాంజీలా వస్తాయి.
-ఇప్పుడు బాండీలో నూనె వేడి చేసి, చిన్న చిన్న వడలుగా గోల్డెన్ బ్రౌన్ రంగు వచ్చేవరకు వేయించాలి. ఆ వడలను తీసి గోరువెచ్చని నీటిలో 10 నిమిషాలు వేసి ఉంచితే, అదనపు నూనె పోయి మరింత మెత్తబడతాయి. ఆ తర్వాత చేత్తో సున్నితంగా నొక్కి నీటిని పిండేయాలి.
-సిద్ధంగా ఉన్న వడలను పులిసిన పుదీనా కంజి నీటిలో వేయాలి. ఈ మసాలా నీటి రుచి వడలకు బాగా పట్టాలంటే కనీసం అరగంట పాటు ఫ్రిజ్ లో ఉంచాలి. ఆ తరువాత బయటకు తీసి, పైన కొద్దిగా వేయించిన జీలకర్ర పొడి చల్లి సర్వ్ చేసుకోవడమే.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications