Latest Updates
-
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు! -
అంతర్జాతీయ యోగా దినోత్సవం స్పెషల్.. ఈ యోగాసనాలతో సంతానలేమి సమస్యలకు చెక్.! -
రిలేషన్ షిప్ పై త్రిప్తి డిమ్రి ఆసక్తికర వ్యాఖ్యలు..అది ఉంటే తప్ప వర్కౌట్ కాదంట..! -
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 10 నిమిషాల ఎగ్ కుర్మా..ఎలా చేయాలో చూడండి.. -
మైగ్రేన్‌తో గుండెకి ప్రమాదం.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.! -
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం!
అనుకోకుండా అతిథులు వచ్చారా? 15 నిమిషాల్లో ఘీ మటర్ రైస్ చేసి పెట్టండి, ఫిదా అయిపోతారు!
మీ ఇంటికి ఎప్పుడైనా అనుకోకుండా అతిథులు వచ్చారా? లేదా పండుగలు, సెలవు దినాల్లో కుటుంబ సభ్యుల కోసం ఏదైనా స్పెషల్ గా వండాలనుకుంటున్నారా? రోజూ తినే మామూలు అన్నం కాకుండా, చూస్తేనే తినాలనిపించేలా, తింటే వహ్వా అనిపించేలా ఉండే వంటకం కోసం మీరు వెతుకుతున్నట్లయితే ఘీ మటర్ రైస్ బెస్ట్ ఆప్షన్(నెయ్యి బఠానీ అన్నం).
తక్కువ సమయంలో, తక్కువ శ్రమతో తయారయ్యే ఈ వంటకం రుచిలో మాత్రం ఏదో ఖరీదైన హోటల్ లో లభించే రాజభోజనంలా ఉంటుంది. ఇది కేవలం రుచికరమైనది మాత్రమే కాదు, పోషక విలువలు నిండినది కూడా. పచ్చి బఠానీలలో ప్రోటీన్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా శీతాకాలంలో దొరికే తాజా బఠానీలతో చేస్తే దీని రుచి రెట్టింపు అవుతుంది. ఘీ మటర్ రైస్ ఇంట్లోనే ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
బాస్మతి బియ్యం: 1 కప్పు
పచ్చి బఠానీలు: అర కప్పు
స్వచ్ఛమైన నెయ్యి: 2-3 టేబుల్ స్పూన్లు
బిర్యానీ ఆకు: 1
యాలకులు: 2
లవంగాలు: 4
దాల్చిన చెక్క ముక్క: చిన్న ముక్క
మిరియాల పొడి: కొద్దిగా
ఉప్పు: కొద్దిగా
జీడిపప్పు,బాదం: కొద్దిగా
నీరు: 2 కప్పులు
తయారీ విధానం
-ముందుగా బాస్మతి బియ్యాన్ని శుభ్రంగా కడిగి సుమారు 20 నుండి 30 నిమిషాల పాటు నీటిలో నానబెట్టండి.
-ఒక మందపాటి పాన్ లేదా కుక్కర్ తీసుకుని అందులో నెయ్యి వేడి చేయండి. నెయ్యి కరిగాక బిర్యానీ ఆకు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క వేసి వేయించండి. ఆ వెంటనే జీడిపప్పు, బాదం పలుకులు కూడా వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించండి.
-ఇప్పుడు పచ్చి బఠానీలను ఆ నేతిలో వేయండి. సుమారు 2-3 నిమిషాల పాటు బఠానీలను నేతిలో వేయించడం వల్ల అవి మృదువుగా మారి, నెయ్యి రుచిని గ్రహిస్తాయి.
-నానబెట్టిన బియ్యం నుండి నీటిని పూర్తిగా వడకట్టి, బియ్యాన్ని పాన్ లో వేయండి. రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు మిరియాల పొడి వేసి, బియ్యం విరిగిపోకుండా చాలా నెమ్మదిగా కలపండి.
-ఇప్పుడు 2 కప్పుల నీరు పోసి (లేదా మీ బియ్యానికి సరిపడా)ఒకసారి కలిపి మూత పెట్టండి. మంటను తక్కువలో ఉంచి ఉడికించండి. నీరంతా ఆవిరైపోయి, అన్నం 90 శాతం ఉడికాక స్టవ్ ఆఫ్ చేసి, మూత తీయకుండా మరో 5 నిమిషాలు అలాగే ఉంచండి. దీనివల్ల అన్నం చక్కగా మగ్గుతుంది.
-వేడివేడి ఘీ మటర్ రైస్ ను ప్లేట్ లోకి తీసుకుని పక్కన దాల్ తడ్కా, వెజ్ కుర్మా, పన్నీర్ బటర్ మసాలా లేదా చల్లటి పెరుగు రైతాతో వడ్డించండి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications