Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ బటర్ మష్రూమ్ మసాలా.. ఇలా చేస్తే రుచి అదుర్స్!
నాన్, కుల్చా, బటర్ రోటీ లేదా బగారా రైస్, జీరా రైస్ లోకి అదిరిపోయే కాంబినేషన్ కోసం చూస్తున్నారా? అయితే రెస్టారెంట్ రుచిని తలపించే ఘుమఘుమలాడే బటర్ మష్రూమ్ మసాలాను మీ ఇంట్లోనే చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. వెన్న, మసాలాల కలయికతో నోరూరించే ఈ వంటకం ఒక్కసారి రుచి చూశారంటే మళ్లీ మళ్లీ కావాలంటారు. మష్రూమ్స్ ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి.

బటర్ మష్రూమ్ మసాలా తయారీకి కావలసిన పదార్థాలు
పుట్టగొడుగులు (మష్రూమ్స్)- 300 గ్రాములు
వెన్న (బటర్)- 2 టేబుల్ స్పూన్లు
ఉల్లిపాయలు- 2
టమాటాలు - 2
పచ్చి బఠానీలు - 1 కప్పు
జీడిపప్పు - కొద్దిగా
పెరుగు - అర కప్పు
అల్లంవెల్లుల్లి పేస్ట్ - 1 టేబుల్ స్పూన్
కారం - ఒకటిన్నర టేబుల్ స్పూన్లు
ధనియాల పొడి - 1 టేబుల్ స్పూన్
పసుపు - పావు టీస్పూన్
గరం మసాలా - అర టీస్పూన్
జీలకర్ర - పావు టీస్పూన్
బిర్యానీ ఆకులు- 2
యాలకులు - 2
మరాఠీ మొగ్గ - 2
లవంగాలు - కొద్దిగా
చెక్క - కొద్దిగా
ఉప్పు - రుచికి సరిపడా
కొత్తిమీర - తగినంత

బటర్ మష్రూమ్ మసాలా తయారీ విధానం
-ముందుగా పుట్టగొడుగులను శుభ్రంగా కడిగి, మీకు నచ్చిన సైజులో ముక్కలుగా కోసుకోండి.
-ఒక గిన్నెలో మష్రూమ్ ముక్కలను తీసుకుని.. అందులో కొద్దిగా పసుపు, ధనియాల పొడి, అర స్పూన్ కారం వేసి ముక్కలన్నింటికీ పట్టేలా బాగా కలపండి.
-స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకోండి. అందులో ఒక టేబుల్ స్పూన్ వెన్న వేసి కరిగించండి. వెన్న కరిగాక మసాలా పట్టించిన మష్రూమ్ ముక్కలను వేసి ఐదు నిమిషాల పాటు దోరగా వేయించి పక్కన పెట్టుకోండి.
గ్రేవీ చిక్కగా, కమ్మగా రావడం కోసం.. ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ఒక టమాటా ముక్కలు ,నానబెట్టిన జీడిపప్పు వేసి మెత్తని పేస్ట్ లాగా రుబ్బుకోవాలి.
-ఇప్పుడు స్టవ్ మీద మందపాటి కడాయి పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ వెన్న వేయండి. అది కరిగాక జీలకర్ర, బిర్యానీ ఆకులు, యాలకులు, మరాఠీ మొగ్గ, చెక్క, లవంగాలు వేసి వేయించండి. ఈ మసాలా దినుసులు సువాసన వస్తున్నప్పుడు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి ఎర్రగా వచ్చేంతవరకు వేయించాలి.
-ఉల్లిపాయలు వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేలా వేయించాలి. ఆ తర్వాత తరిగిన టమాటా ముక్కలు, పచ్చి బఠానీలు, తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి. టమాటా ముక్కలు మెత్తబడేవరకు ఉడికించాలి. ఇప్పుడు ఇందులో కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసి కలుపుకోవాలి.
-గ్రేవీ కోసం ముందుగా మిక్సీ పట్టుకున్న టమాటా-జీడిపప్పు పేస్ట్, బాగా చిలికిన పెరుగు వేసి కలపాలి. గ్రేవీకి సరిపడా కొద్దిగా నీళ్లు పోసి,ఆయిల్ పైకి తేలేవరకు ఉడికించాలి.
-గ్రేవీ చిక్కబడి మంచి రంగులోకి వచ్చాక ముందుగా వెన్నలో వేయించి పెట్టుకున్న మష్రూమ్ ముక్కలను అందులో వేసి ఓ 5 నిమిషాల పాటు సన్నని మంటపై ఉడకనివ్వాలి. మసాలాలన్నీ మష్రూమ్స్ కు పట్టి కూర గుమగుమలాడుతున్నప్పుడు, సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
-అంతే ఎంతో రుచికరమైన బటర్ మష్రూమ్ మసాలా రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications