Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
రోటీ నుండి రైస్ వరకు.. అన్నింటికీ సెట్ అయ్యే ఆల్ రౌండర్..ఇలా క్యాప్సికమ్ గ్రేవీ వండితే లొట్టలేసుకుని తింటారు!
రోజూ అవే కూరలు, పచ్చళ్లు తిని విసుగొచ్చిందా? ఉరుకుల పరుగుల జీవితంలో వంట గదిలో గంటల తరబడి గడిపే సమయం దొరకడం లేదా? అయితే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం అందించే అద్భుతమైన వంటకం క్యాప్సికమ్ గ్రేవీ. ఇది చాలా తక్కువ సమయంలోనే రెడీ చేసుకోవచ్చు. ఇది అన్నం, చపాతీ, పూరీ, దోశ.. ఇలా మీరు దేనితో తిన్నా అద్భుతంగా సరిపోతుంది.
వంకాయ లేదా బంగాళదుంపలతో చేసే సాధారణ గ్రేవీల కంటే ఇది చాలా భిన్నంగా ఉంటుంది. క్యాప్సికమ్ ను ఇలా వండటం వల్ల, అచ్చం రెస్టారెంట్లో దొరికే స్మోకీ ఫ్లేవర్ మీ ఇంట్లోనే ఆస్వాదించవచ్చు. పైగా ఇందులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి కాబట్టి ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. క్యాప్సికమ్ గ్రేవీ ఎలా తయారుయేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
-క్యాప్సికమ్ ముక్కలు
-ఉల్లిపాయ
-టమాటో పేస్ట్
-అల్లంవెల్లుల్లి పేస్ట్
-కారం
-ధనియాల పొడి
-గరం మసాలా
-పసుపు
-నూనె
-సోంపు
-కసూరి మేతి
-పెరుగు
-ఉప్పు
-తాజా కొత్తిమీర
తయారీ విధానం
-ముందుగా స్టవ్ వెలిగించి ప్రెషర్ కుక్కర్ పెట్టుకుని తగినంత నూనె వేడి చేయండి. నూనె వేడెక్కాక అర టీస్పూన్ సోంపు, కొద్దిగా కసూరి మేతి వేసి వేయించాలి.
-ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి, అవి లేత బంగారు వర్ణంలోకి మారే వరకు రెండు నిమిషాల పాటు వేయించాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేలా వేపాలి.
-ఇందులో కొంచెం పెద్దగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు వేసి నాలుగు నిమిషాల పాటు నూనెలో మగ్గనివ్వాలి. ఇలా మగ్గడం వల్లే గ్రేవీకి చక్కటి ఆకృతి వస్తుంది.
-క్యాప్సికమ్ కొద్దిగా మెత్తబడ్డాక.. కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా వేసి మంటను సిమ్ లో పెట్టి మసాలాలు అడుగంటకుండా బాగా కలపాలి.
-ఇప్పుడు మిక్సీ పట్టిన టమాటో పేస్ట్ (4 టేబుల్ స్పూన్లు), గిలకొట్టిన పెరుగు (2 టేబుల్ స్పూన్లు) వేసి కలపాలి. పెరుగు వల్ల గ్రేవీకి హోటల్ స్టైల్ క్రీమీ టెక్స్చర్ వస్తుంది.
-చివరగా గ్రేవీకి తగినన్ని నీళ్లు పోసి, కుక్కర్ మూత పెట్టి పది నిమిషాలు ఉడికించండి. గ్రేవీ చిక్కబడి, నూనె పైకి తేలుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి, సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకుంటే వేడివేడి క్యాప్సికమ్ కర్రీ రెడీ.
-చపాతీ లేదా పూరీలతో ఈ గ్రేవీని తింటే ఆ మజాయే వేరు. అలాగే దోశలోకి రొటీన్ చట్నీలకు బదులుగా దీన్ని ట్రై చేయండి, భలే రుచిగా ఉంటుంది. ఇక మధ్యాహ్నం వేడివేడి అన్నంలో ఈ గ్రేవీ వేసుకుని, పైన కొద్దిగా నెయ్యి కలుపుకుని తింటే అమృతంలా ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications