Latest Updates
-
3 నిమిషాల మ్యాజిక్..ఈ చిన్న పనితో 13 రకాల క్యాన్సర్లకు చెక్! -
ఈ ఐదు లక్షణాలు ఉంటే మీ భర్త బంగారమే.. మరి మీవారిలో ఈ గుణాలు ఉన్నాయా.? -
కర్ణాటక స్పెషల్ వాంగి బాత్ పొడి..ఒక్కసారి చేస్తే 4 నెలలు నిల్వ..బోర్ కొట్టించే కూరలు కూడా అమృతమైపోతాయ్.. -
కృష్ణాష్టమి స్పెషల్: చిన్ని కన్నయ్యకి ఎంతో ప్రీతికరమైన అటుకుల లడ్డూ.. చక్కెర లేకుండా భలే రుచిగా.! -
పుట్టుకతోనే అదృష్టవంతులు.. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాజ యోగం ఉన్న రాశులు ఇవే! -
కృష్ణాష్టమి స్పెషల్..కన్నయ్యకు అత్యంత ఇష్టమైన ధనియాల పంజిరి ఎలా చేసుకోవాలంటే.. -
జ్వరం వచ్చినప్పుడు త్వరగా కోలుకోవాలంటే ఏం తినాలి? ఏం తినకూడదు? -
వంకాయ వండటం ఓ కళ.. అయ్యంగార్ స్టైల్ లో ఇలా చేస్తే రుచికి ఎవరైనా దాసోహం అవ్వాల్సిందే! -
పేరెంట్స్ రిచ్ అయితే జెన్ జెడ్ చెడుదారులు పడుతుందా.. వైరల్ పోస్ట్‌పై చర్చ.! -
కన్నయ్య కరుణ: శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు నుంచి ఈ రాశులకు కుబేర యోగమే!
బ్రకోలీ, బాదంతో సూపర్ హెల్తీ పాస్తా..రుచి చూస్తే వదిలిపెట్టరు!
సాయంత్రం కాగానే పిల్లలైనా, పెద్దలైనా ఏదైనా రుచికరంగా, వేడివేడిగా తినాలని కోరుకుంటారు. బయట దొరికే జంక్ ఫుడ్ తినే కంటే, రెస్టారెంట్ స్టైల్ రుచిని పంచే ఆహారం ఇంట్లోనే చేసుకుంటే ఎంత బాగుంటుంది? అందుకే ఈ క్రీమీ బ్రకోలీ పాస్తా మీకు బెస్ట్ ఛాయిస్.
బ్రకోలీ, బాదం పప్పులు వాడటం వల్ల ఇది రుచికరమైనదే కాదు, ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. తక్కువ సమయంలోనే, ఎంతో సులభంగా క్రీమీ బ్రకోలీ పాస్తా మీ ఇంట్లో ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

క్రీమీ బ్రకోలీ పాస్తా తయారీకి కావలసిన పదార్థాలు
బ్రకోలీ ప్యూరీ కోసం
బ్రకోలీ - 200 గ్రాములు
బాదం పప్పులు - 15
వెల్లుల్లి రెబ్బలు - 2 లేదా 3
నీళ్లు - తగినన్ని
ఉప్పు - చిటికెడు
పాస్తా ఉడికించడానికి:
పాస్తా - 200 గ్రాములు
స్వీట్ కార్న్ - అర కప్పు
నూనె - 1 టీస్పూన్
ఉప్పు - కొద్దిగా
సాస్ తయారీకి
ఆలివ్ నూనె - 1 టీస్పూన్
పుట్టగొడుగులు (మష్రూమ్స్) - 1/3 కప్పు
ఎర్ర క్యాప్సికమ్ - 1
సన్నగా తరిగిన వెల్లుల్లి - 1 టేబుల్ స్పూన్
చిల్లీ ఫ్లేక్స్ - 1 టీస్పూన్
ఒరేగానో - 1 టీస్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
మిరియాల పొడి - అర టీస్పూన్
కృష్ణాష్టమి స్పెషల్..కన్నయ్యకు అత్యంత ఇష్టమైన ధనియాల పంజిరి ఎలా చేసుకోవాలంటే..
క్రీమీ బ్రకోలీ పాస్తా తయారీ విధానం
-ముందుగా ఒక పెద్ద గిన్నెలో నీటిని మరిగించి, అందులో కొద్దిగా ఉప్పు వేయండి. ఇప్పుడు బ్రకోలీ ముక్కలు, బాదం పప్పులు, వెల్లుల్లి రెబ్బలు వేసి మెత్తబడేవరకు ఉడికించాలి. ఆ తర్వాత వాటిని మిక్సీ జార్ లో వేసి క్రీమీగా, ప్యూరీలా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు బ్రకోలీ ఉడికించిన అదే నీటిలో పాస్తా, స్వీట్ కార్న్, కొద్దిగా నూనె, ఉప్పు వేసి ఉడికించండి. పాస్తా ఉడికిన తర్వాత నీటిని వడకట్టి, అవి ఒకదానికొకటి అంటుకోకుండా ఉండటానికి కొద్దిగా నూనె రాసి పక్కన ఉంచండి.
-స్టవ్ మీద ఒక పాన్ పెట్టి ఆలివ్ నూనె వేడి చేయండి. అందులో పుట్టగొడుగులు, క్యాప్సికమ్ ముక్కలు వేసి మంట పెంచి ఒక నిమిషం పాటు వేయించాలి. అవి వేగాక ఒక గిన్నెలోకి తీసుకోండి.
-అదే పాన్ లో మరికొద్దిగా నూనె వేసి వెల్లుల్లి ముక్కలు, ఒరేగానో, చిల్లీ ఫ్లేక్స్ వేసి మంచి సువాసన వచ్చే వరకు సుమారు 30 సెకన్ల పాటు వేయించండి.
-ఇప్పుడు ముందుగా సిద్ధం చేసుకున్న బ్రకోలీ ప్యూరీని ఈ పాన్ లో వేసి బాగా కలపండి. రుచికి సరిపడా ఉప్పు, మిరియాల పొడి వేసి ఒకటి, రెండు నిమిషాలు ఉడికించాలి. ఆ తర్వాత ఉడికించిన పాస్తా, స్వీట్ కార్న్, వేయించి పెట్టుకున్న కూరగాయల ముక్కలు వేసి సాస్ అంతా పాస్తాకు పట్టేలా బాగా కలపండి.
-పాస్తా మరీ చిక్కగా అనిపిస్తే కొద్దిగా నీళ్లు పోసి మరో రెండు నిమిషాలు సన్నని మంట మీద ఉడికించండి.
-అంతే నోరూరించే వేడివేడి బ్రకోలీ పాస్తా రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications