Latest Updates
-
శని దేవుడి కటాక్షం: ఈ రాశుల వారికి నేడు ఊహించని ధనలాభం, అదృష్టం మీదే! -
మనసు ప్రశాంతంగా ఉండట్లేదా? పురాతన హిందూ ధ్యాన పద్ధతులు జీవితాన్నే మార్చేస్తాయి -
వివాహిత స్త్రీ వేరొకరి పట్ల ఆకర్షితురాలవుతోందని సూచించే సంకేతాలివే! -
రాహుకాలం అంటే ఏంటి? ఈ టైంలో పుడితే అన్నీ కష్టాలేనా?..అదృష్టాన్ని తెచ్చే జ్యోతిష్య రహస్యం! -
ఫోన్ పాస్‌వర్డ్‌లే ఇప్పుడు భార్యాభర్తల మధ్య పెద్ద అనుమానాలకు కారణమవుతున్నాయా -
సండే స్పెషల్: పప్పుచారులోకి అదిరిపోయే సైడ్ డిష్ గ్రీన్ మసాలా కింగ్ ఫిష్ ఫ్రై..ఇంట్లోనే ఇలా ఈజీగా -
రోజుకో పెగ్గు ఆరోగ్యానికి మంచిదా?..మీకు ఈ నిజం తెలుసా? -
రెచ్చిపోయి తినేంత రుచి..అరిటాకులో పొట్లం చికెన్ బిర్యానీ ఇలా చేస్తే ఇంట్లో వాళ్లు ఫిదా! -
Viral Video: ఆ బుడ్డోడు మాములోడు కాదయ్యా..తానే చదివిస్తానంటూ ఆనంద్ మహీంద్రా బంపరాఫర్ -
పెళ్లై ఏళ్లు గడిచాక చాలా జంటలు భార్యాభర్తలుగా కాదు, రూమ్మేట్లలా జీవిస్తున్నారు మీరూ ఇలాంటివారేనా?
అచ్చం రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ చికెన్ ఫ్రైస్.. ఈ స్పెషల్ సాస్ తో ట్రై చేస్తే టేస్ట్ వేరే లెవల్!
సాయంత్రం పూట వాతావరణం చల్లగా ఉన్నప్పుడు, వేడివేడిగా, కరకరలాడే స్నాక్స్ తినాలనిపించడం సహజం. అలాంటి సమయాల్లో బయట క్రిస్పీగా, లోపల ఎంతో జ్యూసీగా ఉండే క్రిస్పీ చికెన్ ఫ్రైస్ మీకు పర్ఫెక్ట్ ఛాయిస్. కేవలం చికెన్ మాత్రమే కాకుండా, దానికి జతగా ఇంట్లోనే చేసుకోగలిగే స్పెషల్ డిప్పింగ్ సాస్ ఉంటే ఆ రుచి మాటల్లో చెప్పలేం. పిల్లలైనా, పెద్దలైనా లొట్టలేసుకుని తినే క్రిస్పీ చికెన్ ఫ్రైస్ ఇంట్లోనే ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

చికెన్ ఫ్రైస్ తయారీకి కావలసిన పదార్థాలు
బోన్‌లెస్ చికెన్ బ్రెస్ట్ - 1 కిలో
ఉప్పు - రుచికి తగినంత
మిరియాల పొడి - 1 టేబుల్ స్పూన్
ఉల్లిపాయ పొడి - 1 టీస్పూన్
కశ్మీరీ కారం- 1 టేబుల్ స్పూన్
వంట నూనె - 2 టేబుల్ స్పూన్లు
మైదా పిండి - 2 కప్పులు
ఉప్పు - తగినంత
వెల్లుల్లి పొడి - 1 టేబుల్ స్పూన్
ఉల్లిపాయ పొడి - 1 టీస్పూన్
స్మోక్డ్ పాప్రికా - 1 టేబుల్ స్పూన్
మిరియాల పొడి - 1 టీస్పూన్
పాంకో బ్రెడ్ క్రంబ్స్ - 2 కప్పులు
డ్రై పార్స్లీ - 1 టేబుల్ స్పూన్
గుడ్లు - 2
నీళ్లు - 1/3 కప్పు
స్పెషల్ డిప్పింగ్ సాస్ కోసం
మయోనైస్ - 1 కప్పు
టొమాటో కెచప్ - 2 టేబుల్ స్పూన్లు
వోర్సెస్టర్ షైర్ సాస్ - 1 టేబుల్ స్పూన్
ఉప్పు, మిరియాల పొడి - తగినంత
వెల్లుల్లి పొడి - 1 టేబుల్ స్పూన్
స్మోక్డ్ పాప్రికా - 1 టీస్పూన్
చికెన్ ఫ్రైస్ తయారీ విధానం
-ముందుగా చికెన్ ను పొడవాటి ముక్కలుగా,ఫ్రైస్ లాగా కోసుకోవాలి. తర్వాత వాటిని శుభ్రం చేసి, పేపర్ టవల్ తో తడి లేకుండా తుడుచుకోవాలి.
-ఒక వెడల్పాటి గిన్నెలో చికెన్ ముక్కలు వేసి ఉప్పు, మిరియాల పొడి, పాప్రికా, ఉల్లిపాయ, వెల్లుల్లి పొడి వేసి బాగా కలపాలి. ఆపై కొద్దిగా నూనె వేసి ముక్కలన్నింటికీ మసాలా బాగా పట్టేలా చూసుకోవాలి. ఈ గిన్నెను కనీసం ఒక గంట పాటు ఫ్రిజ్ లో ఉంచాలి. ఇలా చేయడం వల్ల చికెన్ లోపల మృదువుగా, జ్యూసీగా మారుతుంది.
-ఇప్పుడు మూడు వేర్వేరు గిన్నెలను సిద్ధం చేసుకోవాలి. మొదటి గిన్నెలో మైదా పిండి, ఉప్పు, మిరియాల పొడి, పాప్రికా, వెల్లుల్లి, ఉల్లిపాయ పొడి వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. రెండవ గిన్నెలో రెండు గుడ్లు పగలగొట్టి, కొద్దిగా నీళ్లు పోసి బాగా గిలక్కొట్టాలి. మూడవ గిన్నెలో బ్రెడ్ క్రంబ్స్, డ్రై పార్స్లీ వేసి కలపాలి.
-మ్యారినేట్ చేసిన ఒక్కో చికెన్ ముక్కను తీసి, ముందుగా మైదా పిండి మిశ్రమంలో దొర్లించాలి. ఆ తర్వాత గుడ్డు మిశ్రమంలో ముంచి, మళ్ళీ మైదాలో, మళ్ళీ గుడ్డు మిశ్రమంలో (డబుల్ కోటింగ్) ముంచాలి. చివరగా బ్రెడ్ క్రంబ్స్ లో బాగా దొర్లించి ఒక ట్రేలో విడివిడిగా పెట్టుకోవాలి. ఇలా అన్ని ముక్కలనూ సిద్ధం చేసుకోవాలి.
-చికెన్ వేయించేలోపు సాస్ రెడీ చేసుకోవాలి. ఒక చిన్న బౌల్ తీసుకుని అందులో మయోనైస్, కెచప్, వోర్సెస్టర్ షైర్ సాస్, ఉప్పు, మిరియాల పొడి, వెల్లుల్లి పొడి, పాప్రికా వేసి క్రీమీగా అయ్యేలా స్పూన్‌తో బాగా కలుపుకోవాలి. అంతే నోరూరించే స్పెషల్ సాస్ రెడీ.
-ఇప్పుడు స్టవ్ మీద మందపాటి కడాయి పెట్టి, డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడెక్కాక, కోట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలను మెల్లగా నూనెలో వేయాలి. ఇవి 2 నుంచి 3 నిమిషాల పాటు గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి మారి, కరకరలాడే వరకు వేయించుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి.
-వేడివేడి క్రిస్పీ చికెన్ ఫ్రైస్ ను, తయారుచేసుకున్న స్పెషల్ క్రీమీ సాస్ లో అద్దుకుని తింటుంటే.. ఆ మజానే వేరు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications