Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
బయట వందల రూపాయలు పెట్టి కొనే క్రిస్పీ కార్న్..ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా
మనం ఏదైనా రెస్టారెంట్ కు వెళ్లినప్పుడు లేదా మాల్ కి వెళ్లినప్పుడు అక్కడ క్రిస్సీ కార్న్ రేటు చూస్తే దిమ్మదిరిగిపోతుంది. ఇంట్లో పెద్దగా ఖర్చు లేకుండా ఈజీగా తయారుచేసుకునే వీటిని వందల రూపాయలకు అమ్ముతుంటారు. క్రిస్పీ కార్న్ అనేది సాయంత్రం వేళల్లో టీతో పాటు లేదా స్టార్టర్ గా చాలా బాగుండే ఒక రుచికరమైన స్నాక్. క్రిస్పీగా కరకరలాడుతూ భలే రుచిగా ఉంటాయి. ఇది తయారు చేయడం సులభం, చాలా మందికి ఇష్టమైన వంటకం. రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ కార్న్ తయారీకి కావాల్సిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.
క్రిస్పీ కార్న్ తయారీకి కావాల్సిన పదార్థాలు
-మొక్క జొన్న కంకీలు
-ఉప్పు
-అల్లంవెల్లుల్లి పేస్ట్
-మిరియాల పొడి
-ఆయిల్
-మైదాపిండి
-కార్న్ ఫ్లోర్
-కొత్తిమీర
-రెడ్ చిల్లీ ఫ్లేక్స్
-ఉల్లిపాయ

క్రిస్పీ కార్న్ తయారీ విధానం
-ముందుగా రెండు మొక్క జొన్న కంకీలను(స్వీట్ కార్న్) తీసుకొని వాటిని వలిచి ఓ ప్లేట్ లో పెట్టుకోండి.
-తర్వాత స్టవ్ మీద పెద్ద గిన్నె పెట్టి స్వీట్ కార్న్ ఉడికించడానికి సరిపడా నీళ్లు పోసి బాగా వేడి చేశాక అర టీస్పూన్ ఉప్పు వేసి కలిపాక ఒలిచి పెట్టుకున్న స్వీట్ కార్న్ వేసి కనీసం 4 నిమిషాలు బాగా ఉడికించాలి.
-స్వీట్ కార్న్ బాగా ఉబ్బి పైకి తేలుతున్నప్పుడు జల్లెడ గరిటతో వాటిని నీటిలో నుంచి తీసి ఓ ప్లేట్ లో వేసి పెట్టుకోండి. 2 నిమిషాలు వదిలేస్తే అవి చల్లారతాయి.
-కొంచెం చల్లారిన తర్వాత అందులో అర టీస్పూన్ ఫ్రెష్ గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్, అర టీస్పూన్ మిరియాల పొడి, పావు టీస్పూన్ ఉప్పు వేసి బాగా కలపండి.
-ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ మైదాపిండి, అరకప్పు కార్న్ ఫ్లోర్(మొక్కజొన్న పిండి)వేసి కొంచెం నీళ్లు చిలకరించి స్పూన్ తో బాగా కలపండి.
-తర్వాత స్టవ్ మీద బాండీలో ఆయిల్ వేడి చేసి స్వీట్ కార్న్ మీద ఎక్స్ట్రా పిండిని దులిపేసుకుంటూ వాటిని ఆయిల్ లో వేసి మంటను మీడియంలో ఉంచి బాండీ మీద సగానికిపైగా కప్పబడి ఉంచేలా మూతను పెట్టండి. 2 నిమిషాలు ఫ్రై చేయండి. మధ్య మధ్యలో మూతతీసి ఫ్రై అయ్యాయో లేదో చూసుకోండి.
-క్రిస్పీగా మారి లైట్ గా కలర్ మారేదాకా మధ్య మధ్యలో కలబెడుతూ ఫ్రై చేసుకోవాలి.
-తర్వాత వాటిని ఆయిల్ నుంచి తీసి ఓ ప్లేట్ లోకి తీసుకోండి.
-తర్వాత స్టవ్ మీద పాన్ లో కొంచెం ఆయిల్ వేసి వేడి చేసి ఉల్లిపాయ ముక్కలు, అర టీస్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్, పావు టీస్పూన్ మిరియాల పొడి, పావు టీస్పూన్ ఉప్పు వేసి ఉల్లిపాయలు దోరగా ఫ్నై చేయాలి.
ఇప్పుడు పాన్ లో ఫ్రై చేసిన స్వీట్ కార్న్ వేసి బాగా కలిపి కొత్తిమీర తరుగు చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇది డీప్ ఫ్రై చేసిన వంటకం కాబట్టి ఆరోగ్య ప్రయోజనాల దృష్ట్యా దీనిని మితంగా తీసుకోవడం మంచిది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications