Latest Updates
-
శ్రావణ మాసం స్పెషల్ హెల్తీ లడ్డు.. పప్పు నానబెట్టే పనే లేదు,పాకం పట్టే శ్రమ లేదు..ఈజీగా చేసుకోండిలా.. -
పాలు విరిగిపోయాయా? అయితే పారబోయకుండా ఈ 5 అద్భుతమైన వంటకాలు చేయండి! -
ఇడ్లీ, దోసె పిండి బాగా పులిసిపోయిందా? పారేయకుండా ఈ చిట్కాలతో ఫ్రెష్ గా మార్చేయండి! -
కాళ్లు, చేతుల్లో తిమ్మిర్లు, జలదరింపుని లైట్ తీసుకుంటున్నారా? పక్షవాతానికి ముందస్తు హెచ్చరిక? -
ఆరోగ్యానికి మహా బలం అందించే నువ్వుల బాదం లడ్డు..ఈజీగా ఎలా చేసుకోవాలంటే -
ప్రపంచంలోనే అత్యంత ఆరోగ్యకరమైన ప్రోటీన్ చిక్కి..ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
Chanakya Niti: మహిళలు ఈ 5 విషయాలను రహస్యంగా ఉంచితేనే జీవితంలో తిరుగుండదు! -
ఫ్రెంచ్ ఫ్రైస్ కాదు..ఇది కాకరకాయ ఫ్రైస్..ఒక్కసారి టేస్ట్ చేశారంటే అస్సలు వదిలిపెట్టరు.. -
కీళ్ల నొప్పులు, జలుబును మాయం చేసే మునగాకు ఉలవల సూప్..ఎలా చేసుకోవాలంటే.. -
ఈ పచ్చడి చేస్తే ఇంట్లో అందరూ ప్లేట్లు నాకేస్తారు.. బెండకాయ వంకాయ కాంబినేషన్ అదుర్స్!
తందూర్, ఓవెన్ లేకుండానే.. ఇంట్లో పెనంపైనే నోరూరించే పనీర్ టిక్కా..మస్త్ టేస్ట్!
రెస్టారెంట్ లేదా ధాబాకు వెళ్లగానే మెనూ చూడగానే మనకు ముందుగా గుర్తొచ్చే స్నాక్ పనీర్ టిక్కా. ఆ గుమగుమలాడే పొగ వాసన, కమ్మటి సుగంధ ద్రవ్యాల రుచి, నోట్లో వేసుకోగానే ఇట్టే కరిగిపోయే మెత్తటి పనీర్ ముక్కలు ఎవరినైనా ఇట్టే ఆకర్షిస్తాయి. అయితే ఇలాంటి అద్భుతమైన రుచిని ఆస్వాదించడానికి ప్రతిసారీ రెస్టారెంట్ కే వెళ్లాల్సిన అవసరం లేదు.
చాలామందికి పనీర్ టిక్కా ఇంట్లో చేయాలంటే కష్టమేమో, దానికి ఖచ్చితంగా తందూర్ ఉండాలేమో అన్న అపోహ ఉంటుంది. కానీ మీ ఇంట్లో ఉండే సాధారణ పెనంపైనే రెస్టారెంట్ రుచిని మించేలా పనీర్ టిక్కా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఇది కేవలం రుచికరమైనదే కాదు, ప్రోటీన్ పుష్కలంగా ఉండే ఆరోగ్యకరమైన స్నాక్ కూడా. వీకెండ్ పార్టీకైనా, ఇంట్లో చిన్న వేడుకకైనా, లేదా సాయంత్రం వేళలో ఇది పర్ఫెక్ట్ ఛాయిస్.

పనీర్ టిక్కా తయారీకి కావాల్సిన పదార్థాలు
-పనీర్
-ఉల్లిపాయలు
-టొమాటోలు
-క్యాప్సికమ్
-గట్టి పెరుగు
-అల్లం వెల్లుల్లి పేస్ట్
-కారం
-పసుపు
-ధనియాల పొడి
-గరం మసాలా
-కొద్దిగా చాట్ మసాలా
-ఉప్పు
-కొద్దిగా శనగపిండి
-ఆవ నూనె (మస్టర్డ్ ఆయిల్)
-నిమ్మరసం
-కసూరి మేతి
పనీర్ టిక్కా తయారీ విధానం
-ముందుగా ఒక పెద్ద గిన్నెలో పెరుగును తీసుకుని ఉండలు లేకుండా గిలకొట్టాలి. అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా పొడులు, ఉప్పు, నిమ్మరసం, ఒక చెంచా శనగపిండి, కాస్త ఆవ నూనె వేసి బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు చతురస్రాకారంలో కట్ చేసిన పనీర్, కూరగాయల ముక్కలను ఈ మిశ్రమంలో వేసి, ఆ మసాలా అంతా వాటికి బాగా పట్టేలా నెమ్మదిగా కలపాలి. దీన్ని కనీసం అరగంట పాటు పక్కన పెడితే మసాలాలు పనీర్‌లోకి ఇంకి రుచి అద్భుతంగా వస్తుంది.
-అరగంట తర్వాత మ్యారినేట్ చేసిన పనీర్, కూరగాయల ముక్కలను పుల్లలకు లేదా టూత్ పిక్స్ కు గుచ్చుకోవాలి.
-తర్వాత స్టవ్ వెలిగించి, పెనం పెట్టి కొద్దిగా నూనె లేదా వెన్న రాయాలి. పనీర్ ముక్కలను పెనంపై ఉంచి అన్ని వైపులా తిప్పుతూ ఎర్రగా, కరకరలాడేలా మీడియం మంట మీద కాల్చుకోవాలి. ఓవెన్ లో అయితే 200°C దగ్గర 15-20 నిమిషాలు బేక్ చేయండి.
-దీనికి తందూరి టచ్ ఇవ్వాలంటే ఒక చిన్న బొగ్గు ముక్కను స్టవ్ పై ఎర్రగా కాల్చండి. పనీర్ టిక్కా ఉన్న పెనంలో ఒక చిన్న గిన్నె పెట్టి, అందులో ఈ ఎర్రటి బొగ్గును వేయండి. దానిపై అర చెంచా నెయ్యి వేసి పొగ రావడం మొదలవ్వగానే వెంటనే పెనంపై మూతపెట్టేయండి. రెండు నిమిషాల తర్వాత మూత తీస్తే.. అచ్చం రెస్టారెంట్ లాంటి స్మోకీ ఫ్లేవర్ తో పనీర్ టిక్కా రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications