Latest Updates
-
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు! -
అంతర్జాతీయ యోగా దినోత్సవం స్పెషల్.. ఈ యోగాసనాలతో సంతానలేమి సమస్యలకు చెక్.! -
రిలేషన్ షిప్ పై త్రిప్తి డిమ్రి ఆసక్తికర వ్యాఖ్యలు..అది ఉంటే తప్ప వర్కౌట్ కాదంట..! -
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 10 నిమిషాల ఎగ్ కుర్మా..ఎలా చేయాలో చూడండి.. -
మైగ్రేన్‌తో గుండెకి ప్రమాదం.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.! -
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం!
ఉల్లిపాయ ఎండుమిర్చి పేస్ట్ తో..ఇలా చికెన్ కర్రీ చేస్తే వావ్ అనాల్సిందే
ఉల్లిపాయ ఎండుమిర్చి పేస్ట్ తో చికెన్ కర్రీ చేస్తే వావ్ అని తీరాల్సిందే. సాధారణంగా మనం చేసే చికెన్ కూరలకు ఇది పూర్తిగా భిన్నమైనది. ఇందులో వాడే ప్రత్యేకమైన పేస్ట్ ఈ కూరకు అద్భుతమైన రంగు, రుచి, చిక్కదనాన్ని ఇస్తుంది.
ఈ కూరను వేడివేడి అన్నం, రోటీ, పులావ్ లేదా బిర్యానీతో తింటే స్వర్గం కనిపిస్తుంది. మనం బయట రెస్టారెంట్లలో తినే కూరల మాదిరిగా రిచ్‌గా, టేస్టీగా ఉంటుంది. ఉల్లిపాయ-ఎండుమిర్చి పేస్ట్ తో ఘుమఘుమలాడే రెడ్ చిల్లీ చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో ఇక్కడ చూడండి.

తయారీకి కావాల్సిన పదార్థాలు
-చికెన్
-కసూరి మేథీ
-ఆయిల్
-కొత్తిమీర
-కరివేపాకు
-ధనియాల పొడి
-జీలకర్ర పొడి
-గరం మసాలా
-ఎండుమిరపకాయలు
-పచ్చిమిరపకాయలు
-ఉల్లిపాయలు
-టమాటో
-అల్లంవెల్లుల్లి పేస్ట్
-యాలకలు
-లవంగాలు
-పసుపు
-ఉప్పు
-దాల్చిన చెక్క
తయారీ విధానం
-ముందుగా అరకేజీ చికెన్ ముక్కలను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోండి.
-తర్వాత 2 ఉల్లిపాయలను సన్నగా,పొడవుగా కట్ చేసుకోండి. 1 టమాటోను కూడా ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి.
-తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసి వేడి చేశాక అందులో ఉల్లిపాయలు వేసి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్(ఫ్రైడ్ ఆనియన్స్ లా)వచ్చేదాకా వేయించాలి.
-ఉల్లిపాయలు ఎర్రగా మారిన తర్వాత అందులో టమాటో ముక్కలు, 8 జీడిపప్పులు, 10 ఎండుమిరపకాయల ముక్కలు వేసి 1 నిమిషం తక్కువ మంట మీద వేయించాక అందులో కొద్దిగా నీళ్లు పోసి మూతపెట్టి బాగా మగ్గనివ్వాలి.
-నీళ్లు మొత్తం ఇంకిపోయి అన్నీ బాగా మగ్గిన తర్వాత స్టవ్ ఆపేయండి.
-బాగా చల్లారిన తర్వాత వేయించిన మిశ్రమం మొత్తం మిక్సీ గిన్నెలో వేసి మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.
-ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఇందులో 1ఇంచు దాల్చిన చెక్క, 3 యాలకలు, 4 లవంగాలు వేసి ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులో చికెన్ ముక్కలు, 2 టీస్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, అర టీస్పూన్ పసుపు, 1 టీస్పూన్ ఉప్పు కూడా వేసి మీడియం మంట మీద కలుపుతూ వేయించాలి.
-వేయించే సమయంలోనే అందులో పొడవుగా కట్ చేసిన 4 పచ్చిమిరపకాలు, 2 రెమ్మల కరివేపాకు వేయాలి.
-చికెన్ లో నుంచి నీళ్లు ఊరి పూర్తిగా ఇంకిపోయి ఆయిల్ సపరేట్ అవుతున్న సమయంలో అందులో గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసి తక్కువ మంట మీద కలుపుతూ మళ్లీ ఆయిల్ సపరేట్ అయ్యేదాకా వేయించుకోవాలి.
-ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు అందులో 2 టీస్పూన్ల ధనియాల పొడి, అర టీస్పూన్ జీలకర్ర పొడి, అర టీస్పూన్ గరం మసాలా పొడి, అర టీస్పూన్ చికెన్ మసాలా పొడి, రుచికి తగినంత ఉప్పు వేసి తక్కువ మంట మీదనే బాగా కలుపుకోండి.
-తర్వాత అందులో 1 గ్లాసు నీళ్లు పోసి కలిపి మూతపెట్టి 5 నిమిషాలు ఉడికించుకోవాలి. తర్వాత మూత తీసి అందులో 1 టేబుల్ స్పూన్ కసూరి మేథీ వేసి కలిపి మూతపెట్టి తక్కువ మంట మీద ఆయిల్ సపరేట్ అయ్యేదాకా ఉడికించుకోవాలి.
-చివరగా కొత్తిమీర తరుగు చల్లుకొని స్టవ్ ఆపేయండి. అంతే టేస్టీ రెడ్ చిల్లీ చికెన్ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications