Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
రెస్టారెంట్ స్టైల్ రుచితో సోయా పులావ్..ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే..లంచ్ బాక్స్ లోకి బెస్ట్
ప్రస్తుత కాలంలో ఆరోగ్యం, రుచి రెండూ కలిగిన ఆహారాన్ని తీసుకోవడానికి అందరూ ఆసక్తి చూపిస్తున్నారు. శాకాహారులకు మాంసాహారంతో సమానమైన ప్రోటీన్ అందించే అద్భుతమైన ఆహార పదార్థం సోయా చంక్స్. దీనిని సాధారణంగా మనం మీల్ మేకర్ అని కూడా పిలుస్తారు. సోయా చంక్స్ తో పులావ్ చేస్తే టేస్ట్ అదిరిపోతుంది.
సోయా చంక్స్ పులావ్ అనేది తక్కువ సమయంలో, తక్కువ శ్రమతో తయారు చేసుకోగలిగే ఒక రుచికరమైన వంటకం. సోయా చంక్స్ పులావ్ అనేది కేవలం రుచికరమైన వంటకం మాత్రమే కాదు, ఇది పోషకాల గని. ఇది లంచ్ బాక్సులకు, డిన్నర్ పార్టీలకు లేదా సాధారణ భోజనానికి చాలా బాగుంటుంది. ఇంట్లోనే రెస్టారెంట్ స్థాయి రుచితో సోయా పులావ్ ను ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
సోయా చంక్స్ - 1 కప్పు
బాస్మతి రైస్ - 1 కప్పు (250 ml)
పెరుగు - పావు కప్పు
పసుపు - పావు టీస్పూన్
ఎండుకారం - 1 టీస్పూన్
ఉప్పు - అర టీస్పూన్
ఉల్లిపాయలు - 2
పచ్చిమిరపకాయలు - 2
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టీస్పూన్
టమాటోలు - 2
నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు
నూనె - 1 టేబుల్‌స్పూన్
మసాలా దినుసులు (చెక్క, లవంగం, యాలక్యాయ, బిర్యానీ ఆకు, జీలకర్ర)
పసుపు - పావు టీస్పూన్
ఎండుకారం - 1 టీస్పూన్
గరం మసాలా - 1 టీస్పూన్
పుదీనా
కొత్తిమీర
ఉప్పు
నీళ్లు
తయారుచేసే విధానం
-ముందుగా సొయా చంక్స్ ని నీళ్ళల్లో పదిహేను నిమిషాల పాటు నానపెట్టాలి
-తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో బియ్యం వేసి 20 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి.
-తర్వాత సొయా చంక్సులో ఉన్న నీళ్ళని పిండేసి, ఒక బౌలులో వేసి అందులోనే పెరుగు, ఎండుకారం, పసుపు, ఉప్పు వేసి కలుపుకుని 20 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి.
-ఒక ప్రెషర్ కుక్కర్ లో కొద్దిగా నూనె వేసి అందులో జీలకర్ర, యాలకలు, లవంగాలు, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క వేసి వేయించుకోవాలి. ఇందులో తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు వేసి ఒకట్రెండు నిమిషాల పాటు వేయించిన తర్వాత తరిగిన టమాటోలని కూడా వేసి వేయించుకోవాలి.
-టమాటోలు కొద్దిగా మగ్గిన తర్వాత అందులో పసుపు, ఎండుకారం, గరం మసాలా వేసి వేయించాక ఇప్పుడు సొయా చంక్స్ కూడా వేసి ఐదు నిమిషాల పాటు ఉడికించాలి.
-తర్వాత అందులో కొత్తిమీర, పుదీనా ఆకులు, ఉప్పు వేసి బాగా కలుపుకుని నానపెట్టిన బియ్యాన్ని వేసి, సరిపడా నీళ్లు పోసి ప్రెషర్ కుక్కరుకి మూత పెట్టుకోవాలి. రెండు విజిల్స్ వచ్చేంత వరకూ ఉడికించి, పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి
-అంతే సొయా పులావ్ రెడీ. దీన్ని వేడివేడిగా రైతాతో కలిపి సర్వ్ చేసుకుంటే అదిరిపోతుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications