Latest Updates
-
భాగస్వామితో తరచూ గొడవలు.. విడాకులకు దారితీసే హెచ్చరిక సంకేతాలు ఇవే. -
పప్పు, సాంబార్ లోకి కేక..కరకరలాడే సగ్గుబియ్యం పాప్ కార్న్ వడియాలు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పెళ్లయినా, కాకపోయినా తప్పని టాక్సిక్ రిలేషన్షిప్.. ఎలా హ్యాండిల్ చేయాలి.? -
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు! -
అంతర్జాతీయ యోగా దినోత్సవం స్పెషల్.. ఈ యోగాసనాలతో సంతానలేమి సమస్యలకు చెక్.! -
రిలేషన్ షిప్ పై త్రిప్తి డిమ్రి ఆసక్తికర వ్యాఖ్యలు..అది ఉంటే తప్ప వర్కౌట్ కాదంట..! -
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 10 నిమిషాల ఎగ్ కుర్మా..ఎలా చేయాలో చూడండి.. -
మైగ్రేన్‌తో గుండెకి ప్రమాదం.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.! -
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.?
సమ్మర్ వచ్చేసింది గురూ..కర్డ్ రైస్ ఈ పద్థతిలో చేసుకుంటే బాడీలో వేడి మొత్తం దిగిపోతుంది
సాధారణంగా మనలో చాలామంది హోటల్స్ లేదా రెస్టారెంట్స్ కి వెళ్లినప్పుడు అక్కడ కర్డ్ రైస్ లేదా పెరుగు అన్నం తినడానికి ఇష్టపడతారు కానీ ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం దానివైపే చూడరు. దీనికి కారణం టేస్ట్ మాత్రమే కాదు అది కనిపించే విధానం కూడా. రెస్టారెంట్ లో అందించే పెరుగు అన్నంలో దానిమ్మ గింజలు, జీడిపప్పు మీద ఉండి చూస్తేనే నోరూరిపోతుంది. అయితే ఇలాంటి పెరుగన్నమే ఇంట్లో చేసుకోవాలంటే కొన్ని టిప్స్ పాటిస్తే సరిపోతుంది. రెస్టారెంట్ స్టైల్ పెరుగన్నం ఇంట్లోనే చాలా ఈజీగా తయారుచేసుకోడం ఎలా, దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇక్కడ చూడండి.
రెస్టారెంట్ స్టైల్ పెరుగు అన్నం తయారీకి కావాల్సిన
పదార్ధాలు
-నీళ్లు- 300 ml
-పాలు- 125 ml
-పెరుగు- 300 ml
-అల్లంపచ్చిమిర్చి తరుము- 1 టీస్పూన్
-ఆవాలు
-జీలకర్ర
-ఇంగువ
-ఆయిల్
-కరివేపాకు
-కొత్తిమీర
-జీడిపప్పు
-దానిమ్మ గింజలు
-ప్రెష్ క్రీమ్

రెస్టారెంట్ స్టైల్ పెరుగు అన్నం తయారీ విధానం
-ముందుగా అరకప్పు బియ్యాన్ని గంటసేపు నానబెట్టండి.
-తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టి అందులో నానబెట్టిన బియ్యం, వాటర్, పాలు పోసి అన్నాన్ని మెత్తగా ఉడికించుకోవాలి.
-అన్నం పూర్తిగా ఉడికి చల్లారిపోయిన తర్వాత గరిటతో కచ్చాపచ్చాగా చిదుముకోవాలి.
-ఇప్పుడు అందులో రుచికి సరిపడా ఉప్పు,పెరుగు, ప్రెష్ క్రీమ్, అల్లం పచ్చిమిర్చి తరుము వేసి బాగా కలిపి ఫ్రిడ్జ్ లో పెట్టేయండి.
-తినబోయే ముందు స్టవ్ మీద పాన్ లో ఎండుమిర్చి, ఆవాలు,జీలకర్ర,ఇంగువ, కరివేపాకు వేసి వేపుకోండి.
-ఈ తాలింపుని కలిపి పెట్టిన పెరుగు అన్నంలో వేసి కలపండి.
-ఇప్పుడు పాన్ లో నెయ్యిలో 1 టీస్పూన్ జీడిపప్పుని దోరగా వేయించుకొని దానిని కూడా పెరుగు అన్నంలో వేసి కలపండి. ఇందులోనే దానిమ్మ గింజలు, కొత్తిమీర తరుగు వేసి కలిపితే రెస్టారెంట్ స్టైల్ కర్డ్ రైస్ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications