Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
నోరూరించే వైట్ మటన్ కుర్మా..పూరీ,చపాతీలోకి అబ్బో కేక అంతే..ఎలా చేసుకోవాలో చూడండి
వీకెండ్ వస్తే చాలు చాలా ఇళ్లలో మటన్ ఘుమఘుమలు మొదలవుతాయి. అయితే ఎప్పుడూ చేసుకునే రొటీన్ మటన్ కూరతో విసుగొచ్చిందా? ఈసారి మీ రుచిని ఒక మెట్టు పైకి తీసుకెళ్లే సరికొత్త వంటకాన్ని ప్రయత్నించాలనుకుంటున్నారా? అయితే రెస్టారెంట్ స్టైల్ లో ఉండే వైట్ మటన్ కుర్మా ఓ సారి ట్రై చేసి చూడండి. మసాలాలు, జీడిపప్పు, బాదంల క్రీమీ టెక్స్చర్ తో, మృదువుగా ఉడికిన మటన్ ముక్కలతో ఈ కుర్మా రుచి అమోఘం. దీని తయారీ కూడా చాలా సులభం. వేడివేడి నాన్ లు, చపాతీలు, పుల్కాలు,పూరీ, బిర్యానీతో దీనిని తింటుంటే ఆ అనుభూతి మాటల్లో చెప్పలేనిది. రెస్టారెంట్ స్టైల్ లో వైట్ మటన్ కుర్మా ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.
కావలసిన పదార్థాలు
మటన్ ఉడికించడానికి:
-మటన్: అర కిలో
-అనాసపువ్వు: 1
-దాల్చిన చెక్క: 1 అంగుళం ముక్క
-జాపత్రి: కొద్దిగా
-పచ్చిమిర్చి: 1
-అల్లం వెల్లుల్లి పేస్ట్: అర టేబుల్ స్పూన్
-నీరు: తగినంత
మసాలా పేస్ట్ కోసం:
-నూనె: 3 టేబుల్ స్పూన్లు
-ఉల్లిపాయలు: 2
-జీడిపప్పు: 20
-బాదం: 10
-ధనియాల పొడి: పావు టేబుల్ స్పూన్
-పచ్చిమిర్చి: 2
-పాలు: 100 మి.లీ
-గట్టి పెరుగు: 2 టేబుల్ స్పూన్లు
కుర్మా తయారీకి:
-: 3 టేబుల్ స్పూన్లు
-బిర్యానీ ఆకులు: 2
-దాల్చిన చెక్క: 2 చిన్న ముక్కలు
-లవంగాలు: 5
-కసూరి మేతి: కొద్దిగా
-అల్లం వెల్లుల్లి పేస్ట్: 1 టేబుల్ స్పూన్
-గట్టి పెరుగు: 100 మి.లీ
-పాలు: 100 మి.లీ
-మిరియాల పొడి: అర టేబుల్ స్పూన్
-నిమ్మరసం: సగం చెక్క
-ఉప్పు: రుచికి సరిపడా
-కొత్తిమీర, పుదీనా: కొద్దిగా (సన్నగా తరిగినవి)

తయారీ విధానం
-ముందుగా శుభ్రం చేసుకున్న మటన్ ను ప్రెషర్ కుక్కర్ లో వేయండి. అందులోనే అనాసపువ్వు, దాల్చిన చెక్క, జాపత్రి, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ముక్కలు మునిగే వరకు నీరు పోసి 8-10 విజిల్స్ వచ్చేదాకా ఉడికించి పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు మసాలా పేస్ట్ కోసం బాండీలో నూనె వేడి చేసి ఉల్లిపాయ ముక్కలు వేసి అవి బంగారు రంగులోకి మారే వరకు వేయించి, చల్లారనివ్వండి.
-చల్లారిన ఉల్లిపాయలను మిక్సీ జార్ లో వేసి, జీడిపప్పు, బాదం, ధనియాల పొడి, పచ్చిమిర్చి, పాలు, పెరుగు వేసి మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోండి.
-ఇప్పుడు కుర్మా కోసం మరో మందపాటి గిన్నెలో నూనె వేడి చేసి బిర్యానీ ఆకులు, దాల్చిన చెక్క, లవంగాలు వేసి చిటపటలాడనివ్వండి. కసూరి మేతిని కూడా నలిపి వేసి వేయించండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించి 100 మి.లీ పెరుగు వేసి నూనె పైకి తేలేదాకా కలపండి.
-ఇప్పుడు ఉడికించిన మటన్ ను నీళ్లతో సహా అందులో వేసి గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్, మిగిలిన పాలు, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి.
-గిన్నెపై మూత పెట్టి సన్నని మంట మీద 15-20 నిమిషాలు లేదా గ్రేవీ చిక్కబడి నూనె పైకి తేలే వరకు ఉడికించండి.
-చివరగా మిరియాల పొడి, తరిగిన కొత్తిమీర, పుదీనా, నిమ్మరసం వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేయండి. అంతే నోరూరించే క్రీమీ వైట్ మటన్ కుర్మా రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications