Latest Updates
-
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా.. -
మీ మొబైల్ ఫోన్లో ఈ వాల్ పేపర్ ఉంటే.. రోజూ అదృష్టం మీ వెంటే.! -
కలలో బొద్దింకలు కనిపిస్తే.. మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా.? -
జేబులో రూ.200 ఉంటే చాలు.. హైదరాబాద్ లో మీ ఫ్రెండ్స్ తో గడిపే సూపర్ ప్లాన్స్ ఇవే! -
చేసిన పనికి గుర్తింపు లేకపోతే ప్రేమ ఎలా తగ్గిపోతుంది -
బరువు తగ్గాలనుకునే వారు మామిడి పండ్లు తినొచ్చా? ఫిట్నెస్ నిపుణులు ఏమంటున్నారంటే!
నోట్లో వేసుకోగానే వెన్నలా కరిగిపోయే క్రీమీ బటర్ గార్లిక్ చికెన్..పిల్లలైనా, పెద్దలైనా ఫిదా అవ్వాల్సిందే!
ఎప్పుడూ రొటీన్‌గా తినే చికెన్ 65, చికెన్ మంచూరియా, తందూరి లేదా ఫ్రైడ్ చికెన్ వంటివి తిని మీకు బోర్ కొట్టిందా? అయితే ఈ సారి మీ నాలుకకు ఓ కొత్త రుచిని పరిచయం చేయండి. కొంచెం క్రీమీగా, కమ్మని వెన్న సువాసనతో, వెల్లుల్లి ఘాటుతో నోట్లో వేసుకోగానే కరిగిపోయే అద్భుతమైన వంటకం.. క్రీమీ బటర్ గార్లిక్ చికెన్.
రెస్టారెంట్ స్టైల్ రుచి, సువాసనతో క్రీమీ బటర్ గార్లిక్ చికెన్ ను చాలా తక్కువ సమయంలో, మన ఇంట్లో ఉండే సాధారణ పదార్థాలతోనే ఎంతో సులభంగా తయారు చేసుకోవచ్చు. క్రీమీ బటర్ గార్లిక్ చికెన్ ఎలా తయారు చేయాలో ఇక్కడ చూడండి.

కావాల్సిన పదార్థాలు
బోన్‌లెస్ చికెన్- పావు కిలో
మైదా పిండి - 1 టీస్పూన్
మొక్కజొన్న పిండి (కార్న్ ఫ్లోర్) - 1 టీస్పూన్
మిరియాల పొడి - అర టీస్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
బటర్ గార్లిక్ సాస్ తయారీ కోసం:
వెన్న (బటర్) - 2 టేబుల్ స్పూన్లు
వెల్లుల్లి రెబ్బలు - 2 టేబుల్ స్పూన్లు
మైదా పిండి - 1 టేబుల్ స్పూన్
నీళ్లు - 1 కప్పు
ఒరేగానో - పావు టీస్పూన్
చిల్లీ ఫ్లేక్స్ (ఎండుమిర్చి ముక్కలు) - పావు టీస్పూన్
మిరియాల పొడి - చిటికెడు
ఉప్పు - కొద్దిగా
నిమ్మకాయ - సగం చెక్క
కొత్తిమీర తరుగు - కొద్దిగా
తయారీ విధానం
-ఒక గిన్నెలో కడిగిన చికెన్ ముక్కలను తీసుకుని, అందులో మైదా, కార్న్ ఫ్లోర్, మిరియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు వేసి ముక్కలన్నింటికీ పట్టేలా బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని కనీసం 15 నిమిషాల పాటు పక్కన ఉంచాలి.
-ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకోండి. చికెన్ ముక్కలు వేయించడానికి సరిపడా కొద్దిగా నూనె పోయండి. నూనె వేడెక్కిన తర్వాత చికెన్ ముక్కలను ఒక్కొక్కటిగా వేస్తూ, దోరగా బంగారు రంగు వచ్చే వరకు వేయించి పక్కన ఒక ప్లేట్ లో పెట్టుకోండి.
-స్టవ్ మీద మరో కడాయి పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల తాజా వెన్న వేయండి. వెన్న కరుగుతున్నప్పుడే సన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కలను వేసి దోరగా వేయించండి. వెల్లుల్లి కొద్దిగా వేగిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ మైదా పిండి వేసి ఒక నిమిషం పాటు కలుపుతూ వేయించాలి. ఆ వెంటనే ఒరేగానో, చిల్లీ ఫ్లేక్స్, కొద్దిగా మిరియాల పొడి, సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి.
-ఇప్పుడు అందులో 1 కప్పు నీళ్లు పోసి మరగనివ్వండి. నీళ్లు మరిగి, సాస్ కొద్దిగా చిక్కబడుతున్న సమయంలో.. ముందుగా వేయించి పెట్టుకున్న చికెన్ ముక్కలను ఇందులో వేసి బాగా కలపండి. రెండు నిమిషాలు ఉడికించండి.
-కూర క్రీమీగా తయారయ్యాక స్టవ్ ఆఫ్ చేయండి. చివరగా సగం నిమ్మకాయ రసాన్ని పిండి, సన్నగా తరిగిన తాజా కొత్తిమీరను చల్లుకుని కలుపుకుంటే చాలు.
-అంతే ఘుమఘుమలాడే, నోరూరించే రెస్టారెంట్ స్టైల్ క్రీమీ బటర్ గార్లిక్ చికెన్ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications