Latest Updates
-
రాజస్థాన్ ఫేమస్ కార్న్ ఢోక్లా..బరువు తగ్గాలనుకునేవాళ్లకి ఇది బెస్ట్! -
గుడ్డు పచ్చసొన తింటే కొలెస్ట్రాల్ పెరిగి హార్ట్ ఎటాక్ వస్తుందా? డాక్టర్ విక్రాంత్ సింగ్ ఏమంటున్నారంటే.. -
ఈ ఒక్క పొడి ఉంటే చాలు..జీవితంలో హాస్పిటల్ కి వెళ్లాల్సిన పనే ఉండదు..అన్నం, టిఫిన్స్ లోకి సూపర్ -
అబ్బాయి వర్జిన్ కాదని పెళ్లి రద్దు చేసుకున్న యువతి..అసలు నువ్వు వర్జినేనా అంటూ.. -
100 ఏళ్లు బతికించే హెల్తీ బ్రేక్ ఫాస్ట్..రోజుకి ఒక గిన్నె తింటే బరువు ఇట్టే తగ్గిపోతారు..ఎలా చేసుకోవాలంటే.. -
హోటల్ స్టైల్ ఇడ్లీ కారం పొడి..బ్రేక్ ఫాస్ట్ లోకి చట్నీ కూడా వద్దంటారు..ఇంట్లోనే ఇలా చేసుకోండి.. -
కిడ్నీలు పాడవడానికి ముందు కనిపించే ముఖ్యమైన లక్షణాలు ఇవే -
ఇడ్లీ,దోశ,చపాతీల్లోకి కేక పుట్టించే చికెన్ నిర్వాణ..బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు -
పెద్ద ఎర్రిపప్ప అయ్యావ్ మావా: ప్రియురాలి కోసం మొత్తం అమ్మేసి 1900 కి.మీ ప్రయాణించి వెళ్తే..అసలు అమ్మాయే కాదట! -
దసరా స్పెషల్ నైవేద్యం చక్కెర పొంగలి..సంప్రదాయ పద్ధతిలో ఇలా చేస్తే ఇళ్లంతా డివోషనల్ వైబ్
కొబ్బరి చట్నీలో ఆ ఒక్క పదార్థం కలిపితే..రుచి వేరే లెవల్లో ఉంటుంది!
ఇడ్లీ,దోసెల్లోకి ప్రతిరోజూ ఇంట్లో చేసుకునే పల్లీ చట్నీ, రొటీన్ కొబ్బరి చట్నీ, టమాటా లేదా కారపు చట్నీలు తిని తిని మీకు విసుగొచ్చేసిందా? ఉదయం బ్రేక్ ఫాస్ట్ లోకి ఏదైనా సరికొత్త రుచిని ఆస్వాదించాలని మీ మనసు లాగుతోందా? అయితే మీ వంటగదిలో క్యారెట్లు, కొబ్బరి ఉంటే.. అద్భుతమైన, ఎంతో ఆరోగ్యకరమైన క్యారెట్ కొబ్బరి చట్నీని తయారు చేసుకోవచ్చు. ఈ చట్నీ ఇడ్లీ, దోశలకే కాకుండా ఉప్మా, పొంగల్ లాంటి ఏ బ్రేక్ ఫాస్ట్ లోకైనా సైడ్ డిష్ గా అదిరిపోతుంది.

క్యారెట్ కొబ్బరి చట్నీ తయారీకి కావలసిన పదార్థాలు
తురిమిన క్యారెట్ - అర కప్పు
తురిమిన కొబ్బరి - అర కప్పు
పచ్చిమిర్చి - 3
అల్లం - అర అంగుళం ముక్క
వెల్లుల్లి రెబ్బలు - 2
వేరుశెనగ గుళ్లు (పల్లీలు) - 1 టేబుల్ స్పూన్
జీలకర్ర పొడి - అర టీస్పూన్
చింతపండు గుజ్జు - 1 టేబుల్ స్పూన్
ఉప్పు-తగినంత
నూనె - 1 లేదా 2 టేబుల్ స్పూన్లు
ఆవాలు - అర టీస్పూన్
జీలకర్ర - అర టీస్పూన్
మెంతులు - చిటికెడు
కరివేపాకు - ఒక కట్ట లేదా రెబ్బ
పసుపు - చిటికెడు

క్యారెట్ కొబ్బరి చట్నీ తయారీ విధానం
ముందుగా స్టవ్ వెలిగించి ఒక చిన్న పాన్ పెట్టుకుని మీడియం మంట మీద ఉంచండి. అందులో ఒక చెంచా నూనె వేసి వేడి చేయండి. నూనె వేడెక్కాక ఒక చెంచా వేరుశెనగ గుళ్లు వేసి, అవి కమ్మటి వాసన వస్తూ బంగారు గోధుమ రంగులోకి మారే వరకు దోరగా వేయించుకోండి. బాగా వేగిన పల్లీలను ఒక ప్లేట్ లోకి తీసుకుని పక్కన పెట్టుకుని చల్లారనివ్వండి.
ఇప్పుడు అదే పాన్ లో అవసరమైతే మరి కాస్త నూనె వేసి ముందుగా తరిగి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, అల్లం వేసి పచ్చివాసన పోయేదాకా వేయించండి. తర్వాత అందులో అర చెంచా జీలకర్ర పొడి వేసి బాగా కలపండి. పాన్ పై మూత పెట్టి, సన్నని మంట మీద కొన్ని నిమిషాల పాటు ఆ కూరగాయలను మగ్గనివ్వండి. ఆ తర్వాత స్టవ్ ఆపేసి, మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వండి.
ఇప్పుడు ఒక మిక్సీ జార్ లో చల్లారిన క్యారెట్ మిశ్రమాన్ని, తురిమి పెట్టుకున్న పచ్చి కొబ్బరి, ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలను కలపండి. కొద్దిగా నీళ్లు పోసి, ఈ మిశ్రమం అంతా మెత్తగా, చిక్కటి పేస్ట్ లా అయ్యేంతవరకు బాగా రుబ్బుకోండి.
సగం రుబ్బుకున్న తర్వాత మూత తీసి, అందులో రుచికి సరిపడా ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ చింతపండు గుజ్జు వేసి మరోసారి మిక్సీ పట్టండి. ఇప్పుడు తయారైన ఈ మెత్తటి చట్నీని ఒక గిన్నెలోకి తీసుకోండి.
తాలింపు కోసం ఒక చిన్న బాండీలో ఒక చెంచా నూనె వేడి చేసి, అందులో ఆవాలు, జీలకర్ర, చిటికెడు మెంతులు వేయండి. ఆవాలు, జీలకర్ర చిటపటలాడటం మొదలైనప్పుడు కరివేపాకు ఆకులు వేసి వేయించండి. కరివేపాకు కరకరలాడే రంగులోకి మారగానే, అందులో చిటికెడు పసుపు వేసి స్టవ్ ఆపేయండి.
ఈ కమ్మటి తాలింపుని గిన్నెలో ఉన్న చట్నీపై చల్లి గరిటెతో బాగా కలుపుకోండి. అంతే ఎంతో రుచికరమైన, నోరూరించే స్పెషల్ క్యారెట్ కొబ్బరి చట్నీ రెడీ.
ఆరోగ్య ప్రయోజనాలు
-క్యారెట్లలో ఉండే విటమిన్ ఏ, యాంటీ ఆక్సిడెంట్లు మన కంటిచూపుకు, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అలాగే కొబ్బరిలోని మంచి కొవ్వులు శరీరానికి తక్షణ శక్తినిస్తాయి. కాబట్టి ఇది కేవలం రుచికరమైనదే కాదు, ఆరోగ్యానికి సైతం ఎంతో మంచిది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
