Latest Updates
-
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు! -
అంతర్జాతీయ యోగా దినోత్సవం స్పెషల్.. ఈ యోగాసనాలతో సంతానలేమి సమస్యలకు చెక్.! -
రిలేషన్ షిప్ పై త్రిప్తి డిమ్రి ఆసక్తికర వ్యాఖ్యలు..అది ఉంటే తప్ప వర్కౌట్ కాదంట..! -
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 10 నిమిషాల ఎగ్ కుర్మా..ఎలా చేయాలో చూడండి.. -
మైగ్రేన్‌తో గుండెకి ప్రమాదం.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.! -
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం!
sabarimala prasadam: శబరిమల అయ్యప్పస్వామి ప్రసాదం..ఇంట్లో ఈజీగా ఇలా చేసుకోండి
మనకు తెలిసినవాళ్లు లేదా మన బంధువులు లేదా ఇంట్లోవాళ్లు శబరిమల వెళ్తే ఖచ్చితంగా శబరిమల ప్రసాదం(sabarimala ayyappa prasadam) తెచ్చి ఇవ్వండి అని అడుగుతుంటాం. వాళ్లు ఎప్పుడు శబరిమల నుంచి వస్తారు ప్రసాదం ఎప్పుడు తెస్తారు అని ఎదురుచూస్తుంటాం. శబరిమల అయ్యప్పస్వామి ప్రసాదం అరవణకి(aravana) ఉన్న క్రేజ్ అలాంటిది మరి. అయితే శబరిమల అయ్యప్ప స్వామి ప్రసాదాన్ని అంతే రుచిగా ఉండేలా ఇంట్లో కూడా చేసుకోవచ్చు. అయ్యప్పస్వామి ప్రసాదం తయారీకి కావాల్సిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.
శబరిమల అయ్యప్ప ప్రసాదం తయారీకి కావల్సిన
పదార్థాలు
-తాటి బెల్లం
-రెడ్ రైస్
-శొంటి పొడి
-ఆవు నెయ్యి
-నల్ల ఎండు ద్రాక్ష
-ఎండు కొబ్బరి ముక్కలు
-పచ్చి కర్పూరం
-యాలకుల పొడి

శబరిమల అయ్యప్ప ప్రసాదం తయారీ విధానం
-ముందుగా ఒక బౌల్ తీసుకోండి. అందులో ఒక కప్పు ఎర్ర బియ్యాన్ని(రెడ్
రైస్) పోసి శుభ్రంగా కడగి పక్కనపెట్టుకోండి.
-ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి అందులో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి అందులోనే శుభ్రంగా కడిగి పెట్టుకున్న రెడ్ రైస్ వేసి 5 నిమిషాల పాటు దోరగా వచ్చేదాకా వేయించండి. మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోండి.
-ఇప్పుడు రైస్ కొలిచి తీసుకున్న అదే కప్పుతో 3 కప్పుల నీళ్లు అందులో పోయండి.
-మధ్య మధ్యలో రైస్ కలుపుతూ ఉండండి. మరీ మెత్తగా అన్నం ఉడికించినంత సాఫ్ట్ గా కాకుండా లైట్ పలుకుగా ఉండాలి..చేతితో నొక్కితే మెత్తగా ఉండేలా ఉడికించి పక్కనపెట్టుకోండి.
-ఇప్పుడు ఇప్పడు స్టవ్ మీద ఓ గిన్నె పెట్టి అందులో ముప్పావు కప్పు నీళ్లు పోసి అందులో 3 కప్పుల సన్నగా తరిగిన తాటి బెల్లం వేయండి.
-మంటను మీడియం ప్లేమ్ మీద పెట్టి కలుపుతూ బెల్లాన్ని కరగబెట్టండి.
-బెల్లం పూర్తిగా కరిగితే చాలు పాకం రానవసరం లేదు. బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి గిన్నెను పక్కనపెట్టుకోండి.
-ఇప్పుడు ఉడికిన బియ్యంలో బెల్లం నీళ్లు ఫిల్టర్ చేసి కలుపుకోండి. మంటను మీడియం ప్లేమ్ మీద పెట్టుకోండి. గరిటతో తిప్పుతూ కాస్త చిక్కబడనివ్వండి.
-ఇప్పుడు అందులో రెండు టేబుల్ స్పూన్ల సన్నగా కట్ చేసిన ఎండు కొబ్బరి ముక్కలు, 2 టేబుల్ స్పూన్ల నల్ల ఎండు ద్రాక్ష వేయండి. అప్పుడప్పుడు కొంచెం కొంచెంగా ఆవు నెయ్యి వేస్తూ ఉడికించాలి. మెత్తంగా నాలుగు టేబుల్ స్పూన్ల నెయ్యి వాడితే చాలు.
-20 నిమిషాల పాటు ఉడికిన తర్వాత అది కాస్త చిక్కబడుతుంది. అప్పుడు అందులో 1 టీ స్పూన్ శొంటి పొడి, 1 టీ స్పూన్ యాలకల పొడి,చిటికెడంత పచ్చి కర్పూరం వేసి బాగా కలుపుకోండి.
-15 నిమిషాల పాటు మీడియం ప్లేమ్ మీద ఉడికించుకోండి. చితి వేళ్ల మధ్య పెడితే చిక్కటి తీగ పాకంలా వచ్చినప్పుడు స్టవ్ ఆపేసి కడాయిని పక్కకు తీసి ఉంచండి. చల్లారిన తర్వాత తింటే టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. ఫ్రిడ్జ్ లో పెట్టుకొని కొన్ని రోజుల పాటు తినవచ్చు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications