Latest Updates
-
మైగ్రేన్‌తో గుండెకి ప్రమాదం.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.! -
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం! -
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా..
Sankranti recipe 2025: సంక్రాంతి స్పెషల్ కలగూర పులుసు..వేళ్లు జుర్రుకొని తినేంత రుచి,ఇదిగో రెసిపి
తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో చేసుకునే వంటకం కలగూర. సంక్రాంతి పండుగ సమయంలో దీన్ని ఎక్కువగా తయారు చేస్తారు. కలగూర అంటే వివిధ రకాల కూరగాయలు కలిపి చేసే ఒక వంటకం. కలగూర పులుసు, కలగూర కూర అని రెండు రకాలుగా చేస్తారు. కలగూర కూర అనేది పులుసు లేకుండా చేసే ఒక డ్రై కర్రీ. కలగూర రెండు రకాలుగా చేసినా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో అనేక రకాల విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. కలగూర పులుసుని ఎలా చేసుకోవాలో ఇక్కడ చూడండి.
కలగూర పులుసు తయారీకి కావలసిన పదార్థాలు
-వివిధ రకాల కూరగాయలు (బెండకాయ, ములక్కాడ, వంకాయ, క్యారెట్,
బంగాళాదుంప, గుమ్మడికాయ, టమాటా)
-చింతపండు
-నూనె
-ఆవాలు
-జీలకర్ర
-మెంతులు
-కరివేపాకు
-పచ్చిమిర్చి
-ఉల్లిపాయ
-ఉప్పు
-కారం
-పసుపు
-ధనియాల పొడి
- బెల్లం

తయారు చేసే విధానం
-కూరగాయలను శుభ్రంగా కడిగి ముక్కలుగా కోసుకోవాలి.
-చింతపండును నీటిలో నానబెట్టి పులుసు తీసుకోవాలి.
- తర్వాత ఆయిల్ వేడి చేసి ఆవాలు, జీలకర్ర, మెంతులు, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి వేయించాలి.
-అందులోనే ఉల్లిపాయ ముక్కలు వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి.
-తర్వాత కూరగాయ ముక్కలు, ఉప్పు, పసుపు వేసి కొద్దిసేపు వేయించాలి.
-తర్వాత అందులో చింతపండు పులుసు, కారం, ధనియాల పొడి వేసి బాగా కలపాలి. మూత పెట్టి కూరగాయలు మెత్తబడే వరకు ఉడికించాలి.
-చివరగా కొద్దిగా బెల్లం వేసి కలిపి దింపేయాలి. అంతే కలగూర పలుసు రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications