Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
Natu Kodi Pulusu: సంక్రాంతికి నాటుకోడి పులుసు..ఈ స్టైల్ లో చేస్తే గత జన్మలు కూడా గుర్తొస్తాయ్
సంక్రాంతి పండుగ సమయంలో చాలామంది ఇంట్లో నాటికోడి పులుసు వండుకుంటారు. ముఖ్యంగా కనుమ రోజు ఎక్కువమంది నాటుకోడి పులుసు చేసుకుంటారు. నాటు కోడి అంటే సహజంగా, స్వేచ్ఛగా పెరిగే కోడి. ఇవి కృత్రిమ దాణా కాకుండా క్రిమికీటకాలు, గింజలు, ఆకులు మొదలైనవి తింటాయి. దీనివల్ల నాటుకోడి మాంసంలో పోషకాలు ఎక్కువగా ఉండి మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
వేడి అన్నం, వడ,పూరీ,చపాతీ ఎందులోకి తిన్నా అదిరిపోయే నాటుకోడి పులుసుని ఎలా పడితే అలా చేస్తే టేస్ట్ రాదు. దీనిని వండటంలో కొన్ని టిప్స్ పాటిస్తే ఆ టేస్ట్ వస్తుంది. నాటుకోడి పులుసుని టేస్టీగా ఎలా వండుకోవాలో ఇక్కడ చూడండి.

నాటు కోడి పులుసు తయారీకి కావాల్సిన పదార్థాలు
-నాటు కోడి ముక్కలు - 1 కేజీ
-ఉల్లిపాయలు - 2
-టమాటాలు - 2
-పచ్చిమిర్చి - 5
-కరివేపాకు - 2 రెమ్మలు
-అల్లం వెల్లుల్లి పేస్ట్ - 2 టేబుల్ స్పూన్లు
-చింతపండు - నిమ్మకాయ సైజు అంత
-ఆయిల్ - 4 టేబుల్ స్పూన్లు
-ఆవాలు - 1 టీస్పూన్
-జీలకర్ర - 1 టీస్పూన్
-మెంతులు - 1/2 టీస్పూన్
-పసుపు - 1/2 టీస్పూన్
-కారం - రుచికి తగినంత
-ధనియాల పొడి - 2 టేబుల్ స్పూన్లు
-గరం మసాలా - 1 టీస్పూన్
-ఉప్పు - రుచికి తగినంత
-కొత్తిమీర - కొంచెం
నాటుకోడి పులుసు తయారీ విధానం
-నాటు కోడి ముక్కలును ఓ బౌల్ లో వేసుకొని శుభ్రంగా కడుక్కోని పక్కనపెట్టుకోండి.
-తర్వాత ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కోసుకోవాలి.
-చింతపండును నీటిలో నానబెట్టండి.
-ఇప్పుడు ఒక కుక్కర్ లో నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర, మెంతులు, కరివేపాకు వేసి వేయించాలి.
-ఉల్లిపాయ ముక్కలు వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి.
-అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి.
- తర్వాత అందులోనే టమాటో ముక్కలు వేసి మెత్తబడే వరకు ఉడికించాలి.
-ఇప్పుడు నాటు కోడి ముక్కలు, పసుపు, ఉప్పు వేసి బాగా కలపాలి.
-కొద్దిసేపు వేయించిన తర్వాత చింతపండు పులుసు, కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసి బాగా కలపాలి.
-తగినంత నీరు పోసి కుక్కర్ మూత పెట్టి 4-5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి.
-పులుసు చిక్కబడే వరకు ఉడికించాలి.
-తర్వాత దానిమీద కొంచెం కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. నాటుకోడి పులుసు రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications