Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
సంక్రాంతి స్పెషల్..మిరియాల ఘాటు, నేతి కమ్మదనంతో కారా పొంగల్.. ఇలా చేసుకోండి..
సంక్రాంతి అంటేనే కొత్త పంటల పండుగ. రైతులు తాము పండించిన కొత్త బియ్యం, కొత్త బెల్లం, పప్పు దినుసులతో ఈ పండుగను జరుపుకుంటారు. సూర్య భగవానుడికి కృతజ్ఞతలు తెలుపుతూ చేసే నైవేద్యమే పొంగల్. పొంగల్ అనే పదానికి అర్థం పొంగడం లేదా ఉప్పొంగడం. పాలు పొంగినట్లుగా మన జీవితాల్లో ఆనందం పొంగాలని కోరుకుంటూ దీనిని వండుతారు.
సంక్రాంతి రోజున ఈ వంటకానికి ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. సాధారణంగా మనం తీపి పొంగలి, కారా పొంగలి అని రెండు రకాలు చేసుకుంటాము. కారా పొంగల్ కేవలం రుచికరమైనదే కాదు, శీతాకాలంలో శరీరానికి అత్యంత మేలు చేసే ఆహారం కూడా. హోటల్ లేదా గుడిలో ప్రసాదంగా లభించే కారా పొంగల్ అదే రుచితో మీ ఇంట్లో ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
బియ్యం: 1 కప్పు
పెసరపప్పు (సాయి పెసరపప్పు): అర కప్పు
నీళ్లు: 4- 5 కప్పులు
నెయ్యి: పావు కప్పు
మిరియాలు: 1 టేబుల్ స్పూన్
జీలకర్ర: 1 టేబుల్ స్పూన్
అల్లం: 1 అంగుళం ముక్క
పచ్చిమిర్చి: 2
కరివేపాకు: 2 రెమ్మలు
జీడిపప్పు: 10-15 పలుకులు
ఇంగువ: చిటికెడు
ఉప్పు: రుచికి సరిపడా
తయారీ విధానం
-ముందుగా ఒక కుక్కర్ లేదా బాండీలో పెసరపప్పును తీసుకోండి. సన్నని మంటపై పప్పును దోరగా వేయించండి. పప్పు రంగు మారకూడదు కానీ కమ్మటి వాసన రావాలి. ఇలా వేయించడం వల్ల పొంగల్ జిగురుగా లేకుండా మంచి రుచిని కలిగి ఉంటుంది.
-వేయించిన పప్పులో బియ్యం కలపండి. రెండింటినీ శుభ్రంగా కడగండి. ఇప్పుడు కుక్కర్ లో ఈ మిశ్రమాన్ని వేసి, దానికి 4 నుండి 5 కప్పుల నీళ్లు పోయండి. రుచికి సరిపడా ఉప్పు వేసి కుక్కర్ మూత పెట్టండి. 4- 5 విజిల్స్ వచ్చే వరకు మెత్తగా ఉడికించుకోవాలి.
-కుక్కర్ ఆవిరి పోయిన తర్వాత మూత తీసి, ఉడికిన అన్నం, పప్పు మిశ్రమాన్ని గరిటతో బాగా మెదపాలి. అన్నం పలుకులుగా ఉండకూడదు, పప్పుతో కలిసిపోయి పేస్ట్ లాగా మృదువుగా ఉండాలి. ఒకవేళ గట్టిగా అనిపిస్తే, కొంచెం వేడి నీళ్లు పోసి కలుపుకోవచ్చు.
-పొంగల్ రుచి అంతా ఈ తాలింపులోనే ఉంటుంది. ఇందుకోసం స్టవ్ వెలిగించి ఒక చిన్న కడాయి పెట్టి, అందులో నెయ్యి వేయండి.
-నెయ్యి వేడెక్కాక ముందుగా జీడిపప్పు వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మిరియాలు, జీలకర్ర వేయండి. అవి చిటపటలాడాక, సన్నగా తరిగిన అల్లం ముక్కలు, పచ్చిమిర్చి చీలికలు వేయండి. తర్వాత కరివేపాకు వేయండి. చివరిగా చిటికెడు ఇంగువ వేయండి.
-వేడివేడి తాలింపును, ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నం-పప్పు మిశ్రమంలో వేయండి. నెయ్యి అన్నం అంతటికీ పట్టేలా బాగా కలపండి.
-చివరిగా వేయించిన జీడిపప్పుతో గార్నిష్ చేసుకోండి. అంతే వేడివేడి, కమ్మని కారా పొంగల్ రెడీ. దీనిని కొబ్బరి చట్నీ లేదా సాంబార్ తో తింటే అమృతంలా ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications