Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
నోరూరించే శరవణ భవన్ హోటల్ స్టైల్ పూరీ కుర్మా.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..2 పూరీలు ఎక్కువే తింటారు!
శరవణ భవన్ హోటల్ అనగానే అక్కడ పూరీ, చపాతీలతో వడ్డించే కుర్మా రుచి అందరికీ భలే ఇష్టం. ఆ కుర్మా రుచి వెనుక ఒక స్పెషల్ మసాలా పేస్ట్ ఉంది. ఈ పద్ధతిలో గనక మీరు కుర్మా చేస్తే, పిల్లల నుండి పెద్దల వరకు ఎవరైనా సరే లొట్టలేసుకుంటూ తింటారు.
పూరీ అంటే ఇష్టపడని వారు కూడా ఈ కుర్మా రుచికి ఫిదా అయిపోయి, మామూలుగా తినేదాని కంటే రెండు పూరీలు ఎక్కువే లాగించేస్తారు. మరి అంతటి అద్భుతమైన శరవణ భవన్ హోటల్ స్టైల్ పూరీ కుర్మా మీ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావాల్సిన పదార్థాలు
పచ్చి కొబ్బరి తురుము - అర కప్పు
జీడిపప్పు - 2 టేబుల్ స్పూన్లు
సోంపు - అర టీస్పూన్
దాల్చిన చెక్క - అర అంగుళం ముక్క
యాలకులు - 2
లవంగాలు - 2
గసగసాలు - అర టీస్పూన్
నీళ్లు - పావు కప్పు
నూనె - 2 టేబుల్ స్పూన్లు
ఆవాలు - అర టీస్పూన్
జీలకర్ర - అర టీస్పూన్
దాల్చిన చెక్క - అర అంగుళం ముక్క
సోంపు - 1 టేబుల్ స్పూన్
బిర్యానీ ఆకులు - 2
కరివేపాకు - కొద్దిగా రెమ్మలు
ఉల్లిపాయ - 1 పెద్దది
అల్లం పేస్ట్ - 1 టేబుల్ స్పూన్
టమాటా - 1
క్యారెట్ - అర ముక్క
పచ్చి బఠానీలు - 3 టేబుల్ స్పూన్లు
బీన్స్ - 5
బంగాళదుంపలు - 2
పసుపు - అర టీస్పూన్
ఉప్పు - 1 టేబుల్ స్పూన్
కారం - 1 టేబుల్ స్పూన్
ధనియాల పొడి - అర టేబుల్ స్పూన్
జీలకర్ర పొడి - అర టేబుల్ స్పూన్
గరం మసాలా - అర టేబుల్ స్పూన్
కొత్తిమీర - 2 టేబుల్ స్పూన్లు
నీళ్లు - తగినన్ని

తయారీ విధానం
-ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో కొబ్బరి తురుము, జీడిపప్పు, సోంపు, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, గసగసాలు వేయాలి. దానికి తగినన్ని నీళ్లు జతచేసి మెత్తని పేస్ట్ లా రుబ్బుకుని పక్కన పెట్టుకోవాలి.
-ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేడి చేయాలి. నూనె కాగాక ఆవాలు, జీలకర్ర, దాల్చిన చెక్క, సోంపు, బిర్యానీ ఆకులు, కొద్దిగా కరివేపాకు వేసి దోరగా వేయించాలి. అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అల్లం పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఎర్రగా వేయించుకోవాలి.
-ఉల్లిపాయలు మగ్గిన తర్వాత..అందులో టమాటా ముక్కలు, క్యారెట్, పచ్చి బఠానీలు, బీన్స్, బంగాళదుంప ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి.
-ఇప్పుడు అందులో పసుపు, ఉప్పు వేసి కూరగాయలన్నీ బాగా కలిసేలా గరిటెతో తిప్పాలి. ఆ తర్వాత కూరగాయలు ఉడకడానికి తగినన్ని నీళ్లు పోసి మూత పెట్టి సన్నని మంట మీద సుమారు 10 నిమిషాల పాటు ఉడికించాలి.
-కూరగాయలు మెత్తగా ఉడికిన తర్వాత, అందులో కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసి బాగా కలపాలి.
-కుర్మా బాగా మరుగుతున్నప్పుడు అందులో ముందుగా రుబ్బి పెట్టుకున్న మసాలా పేస్ట్ వేయాలి. గ్రేవీకి సరిపడా మరో రెండు కప్పుల నీళ్లు పోసి కలిపి మూతపెట్టి మీడియం మంట మీద మరో 10 నిమిషాల పాటు బాగా మరగనివ్వాలి.
-కుర్మా నుండి ఘుమఘుమలాడే సువాసన వస్తూ గ్రేవీ దగ్గర పడుతున్నప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేయాలి.
-అంతే ఎంతో రుచికరమైన, నోరూరించే శరవణ భవన్ స్టైల్ పూరీ కుర్మా రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications