Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
శరవణ భవన్ స్టైల్ వెన్ పొంగల్..కొబ్బరి చట్నీతో తింటే మర్చిపోలేరు!
ప్రతిరోజూ ఉదయం బ్రేక్ ఫాస్ట్ అనగానే ఇడ్లీ, దోసె, లేదా ఉప్మా, బోండా,వడ ఇవే గుర్తొస్తుంటాయి మనకి. అయితే రోజూ ఇవే తిని విసిగిపోయారా? అయితే మీ ఉదయాన్ని మరింత స్పెషల్ గా, రుచికరంగా మార్చే అద్భుతమైన వంటకం వెన్ పొంగల్(తెల్ల పొంగల్). పొంగల్ అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది ప్రఖ్యాత శరవణ భవన్ హోటల్. అక్కడ వేడి వేడిగా, కమ్మటి నెయ్యి సువాసనలతో వడ్డించే తెల్ల(వెన్) పొంగల్ రుచి ఎప్పటికీ మర్చిపోలేం. నోట్లో పెట్టుకోగానే వెన్నలా కరిగిపోయే ఆ అద్భుతమైన రుచిని ఇప్పుడు మీరు మీ ఇంట్లోనే చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు.

వెన్ పొంగల్ తయారీకి కావాల్సిన పదార్థాలు
పచ్చి బియ్యం (సోనా మసూరి) - 1 కప్పు
పెసర పప్పు - పావు కప్పు
పాలు - 1 కప్పు
నీళ్లు - 3 కప్పులు
నెయ్యి - 1 టీస్పూన్ ఉడికించేటప్పుడు
ఉప్పు - మీ రుచికి తగినంత
కరివేపాకు - కొద్దిగా
తాలింపుకి నెయ్యి- 5 టేబుల్ స్పూన్లు
జీలకర్ర - 1 టీస్పూన్
మిరియాలు - 1 టీస్పూన్
అల్లం తురుము - 1 టేబుల్ స్పూన్
జీడిపప్పు - గుప్పెడు
కరివేపాకు - రెండు రెమ్మలు
వెన్ పొంగల్ తయారీ విధానం
-ముందుగా ఒక గిన్నెలో బియ్యం, పెసరపప్పు తీసుకొని నీటిలో రెండు మూడు సార్లు శుభ్రంగా కడగాలి. అరగంట పాటు నానబెట్టుకుంటే పొంగల్ మరింత మృదువుగా వస్తుంది.
-కడిగి పెట్టుకున్న బియ్యం, పప్పు మిశ్రమాన్ని ప్రెషర్ కుక్కర్ లో వేయండి. అందులో 3 కప్పుల నీళ్లు, 1 కప్పు పాలు పోయాలి. పాలు వేయడం వల్ల హోటల్ స్టైల్ మృదుత్వం వస్తుంది. దీనికి సరిపడా ఉప్పు, ఒక టీస్పూన్ నెయ్యి వేసి కుక్కర్ మూత పెట్టండి. సన్నని మంటపై 4 విజిల్స్ వచ్చే వరకు మెత్తగా ఉడికించండి.
-విజిల్స్ వచ్చాక స్టవ్ ఆపేసి, ప్రెషర్ పోనివ్వండి. మూత తీసి అందులో కొన్ని పచ్చి కరివేపాకు ఆకులను వేసి గరిటతో పొంగల్ ను బాగా మెదపండి. ఇలా చేయడం వల్ల కరివేపాకు సువాసన పొంగల్ కి పడుతుంది.
-స్టవ్ మీద పాన్ పెట్టి అందులో 4-5 టేబుల్ స్పూన్ల నెయ్యి వేడి చేయండి. అందులో జీడిపప్పు వేసి దోరగా వేయించి పక్కన పెట్టుకోండి. అదే నెయ్యిలో జీలకర్ర, కొద్దిగా దంచిన మిరియాలు వేసి చిటపటలాడనివ్వండి. తరువాత సన్నగా తరిగిన అల్లం ముక్కలు, కరివేపాకు వేసి వేయించి స్టవ్ ఆపేయండి.
-ఈ ఘుమఘుమలాడే నెయ్యి పోపును, వేయించిన జీడిపప్పును ముందుగా ఉడికించి పెట్టుకున్న పొంగల్ లో వేసి బాగా కలపండి. మూతపెట్టి ఒక ఐదు నిమిషాలు ఆ సువాసనలు పొంగల్ కి పట్టనివ్వండి.
-అంతే నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోయే శరవణ భవన్ స్టైల్ వెన్ పొంగల్ రెడీ. దీనిని వేడి వేడిగా కొబ్బరి చట్నీ లేదా సాంబార్ తో తింటే అదిరిపోతుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications