Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
అమ్మమ్మల కాలం నాటి సీక్రెట్..ఎముకల బలానికి,నడుము నొప్పికి చెక్ పెట్టే గోండ్ పాక్
సాంప్రదాయ భారతీయ వంటగది కేవలం రుచికరమైన వంటకాలకే కాదు పోషకాల గని అని మనందరికీ తెలిసిందే. మన పూర్వీకులు వాతావరణానికి అనుగుణంగా ఆహారాన్ని ఎలా తీసుకోవాలో, ఏ పదార్థాలను ఎలా సమతుల్యం చేసుకోవాలో గొప్పగా నేర్పించారు. ఇప్పుడు శీతాకాలం నడుస్తోంది.
ఈ చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచడంతో పాటు, కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం పొందడానికి గోండ్ పాక్ ఒక దివ్యౌషధంలా పనిచేస్తుంది. గోండ్ (జిగురు) కాల్షియంకు అద్భుతమైన మూలం. ఇది ఎప్పటి నుండో మన భారతీయ వంటకాల్లో అంతర్భాగంగా ఉంది. ఈసారి మీరు కేవలం రుచి కోసమే కాకుండా, ఆరోగ్యం కోసం గోండ్ పాక్ తయారు చేయడానికి ప్రయత్నించండి. ఇందులో వాడే స్వచ్ఛమైన నెయ్యి, పాలు, డ్రై ఫ్రూట్స్ దీనిని ఒక పవర్ హౌస్ గా మారుస్తాయి.

కావలసిన పదార్థాలు
గోండ్ (అకాసియా గమ్): అర కప్పు
పాలు: రెండు కప్పులు కాచి చల్లార్చినవి
డ్రై ఫ్రూట్స్: ఒక కప్పు (వాల్‌నట్స్, జీడిపప్పు, బాదం,
పిస్తా, ఫూల్ మఖానా)
ఎండు కొబ్బరి తురుము: అర కప్పు
గసగసాలు: పావు కప్పు
స్వచ్ఛమైన నెయ్యి: అర కప్పు
ఎండు అల్లం పొడి (శొంఠి): ఒక టేబుల్ స్పూన్
జాజికాయ పొడి: అర టీస్పూన్
యాలకుల పొడి: ఒక టీస్పూన్
బెల్లం: రుచికి సరిపడా
గోండ్ పాక్ తయారీ విధానం
-ముందుగా గోండ్ (జిగురు)ను మిక్సీ జార్‌లో వేసుకుని మెత్తని పొడిలా చేసుకోవాలి. ఇది వంటకంలో ఉండలు లేకుండా కలవడానికి సహాయపడుతుంది.
-తర్వాత స్టవ్ వెలిగించి ఒక పాన్‌లో కొద్దిగా నెయ్యి వేడి చేయండి. అందులో బాదం, వాల్‌నట్స్, జీడిపప్పు, మఖానా వేసి చిన్న మంటపై దోరగా వేయించుకోవాలి. ఇవి చల్లారాక మిక్సీలో వేసి మరీ మెత్తగా కాకుండా, కొంచెం బరకగా పొడి చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల తినేటప్పుడు అక్కడక్కడా తగులుతూ మంచి రుచినిస్తాయి.
-ఇప్పుడు అదే పాన్ లో మరికొద్దిగా నెయ్యి వేసి కొబ్బరి తురుము, గసగసాలను వేయాలి. సన్నని మంటపై సువాసన వచ్చి, లేత బంగారు రంగులోకి మారేంత వరకు 3-4 నిమిషాలు వేయించి పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు పాన్‌లో 2-3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి ముందుగా పొడి చేసి పెట్టుకున్న గోండ్ పౌడర్ ను వేసి వేయించాలి. 2-3 నిమిషాలు వేయించాక కాచి చల్లార్చిన రెండు కప్పుల పాలను పోయాలి. ఈ మిశ్రమాన్ని 8 నుండి 10 నిమిషాల పాటు ఉడికించాలి.
-పాలు, గోండ్ మిశ్రమం చిక్కబడిన తర్వాత అందులో ముందుగా సిద్ధం చేసుకున్న డ్రై ఫ్రూట్స్ పొడి, వేయించిన కొబ్బరి-గసగసాల మిశ్రమాన్ని వేసి బాగా కలపాలి. తీపి కోసం తురిమిన బెల్లాన్ని వేసి కలపాలి. బెల్లం కరిగి, మిశ్రమం నుండి నెయ్యి వేరుపడే వరకు కలుపుతూ ఉండాలి.
-చివరగా శొంఠి పొడి, యాలకుల పొడి, జాజికాయ పొడి వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే, ఎంతో బలవర్ధకమైన గోండ్ పాక్ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications