Latest Updates
-
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.!
బరువు తగ్గడానికి పర్ఫెక్ట్ బ్రేక్ ఫాస్ట్.. కొవ్వును కరిగించే కేరళ స్పెషల్ గంజి..ఎలా చేసుకోవాలంటే
మనదేశంలో చాలామందికి అధిక బరువు లేదా ఊబకాయం అనేది అతిపెద్ద సమస్యగా మారిపోయింది. బానెడు పొట్ట వేసుకొని నలుగురిలోకి వెళ్లి నిలబడాలంటే కాస్త అసౌకర్యంగా ఫీలవుతుంటారు. బరువు తగ్గేందుకు చాలామంది రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే బరువు తగ్గాలని కఠినమైన డైట్ పాటిస్తున్నారా? అయితే మీ ఉదయం భోజనం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సరైన పోషకాలున్న అల్పాహారం తీసుకోకపోతే, రోజంతా నీరసంగా ఉండటమే కాకుండా దీర్ఘకాలంలో పోషకాహార లోపాలు తలెత్తే ప్రమాదం ఉంది. ఈ సమస్యకు పరిష్కారం కేరళ స్పెషల్ పెసరపప్పు గంజి.
ప్రోటీన్లు పుష్కలంగా ఉండే ఈ కేరళ పెసరపప్పు గంజి మీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది కేవలం బరువును నియంత్రించడమే కాకుండా శరీరానికి కావలసిన శక్తిని అందించి, మిమ్మల్ని రోజంతా యాక్టివ్ గా ఉండేలా ఉంచుతుంది. ఈ గంజిని దానితో పాటు అందించే ప్రత్యేకమైన కొబ్బరి చమ్మంతితో కలిపి తింటే ఆ రుచే వేరు. ఉదయాన్నే ఈ పోషకాల గనిని మీ ఆహారంలో చేర్చుకుంటే, శరీరంలోని కొవ్వు కరగడమే కాకుండా, మీ శరీరం దృఢంగా మారుతుంది. ఈ అద్భుతమైన గంజిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు
-మట్టా బియ్యం (కేరళ రైస్) - 1 కప్పు
-పెసర పప్పు - 1 కప్పు
-వెల్లుల్లి రెబ్బలు - 4-5
-సాంబార్ ఉల్లిపాయలు - 5
-క్యారెట్ తురుము - 1
-జీలకర్ర - అర టీస్పూన్
-మెంతులు - పావు టీస్పూన్
-ఎండు మిరపకాయ - 1
-కొబ్బరి తురుము - అర కప్పు
-ఉప్పు - రుచికి సరిపడా
-నీరు - 5 కప్పులు
కొబ్బరి చమ్మంతి కోసం(కేరళలో తయారయ్యే ఒక రకమైన
చట్నీ):
-చిన్న ఉల్లిపాయలు - 5
-జీలకర్ర - అర టీస్పూన్
-ఎండు మిరపకాయ - 1
-చింతపండు - చిన్న నిమ్మకాయంత
-కారం - అర టీస్పూన్
-కరివేపాకు - ఒక రెబ్బ
-కొబ్బరి తురుము - పావు కప్పు
-ఉప్పు - రుచికి సరిపడా
తయారీ విధానం
-ముందుగా కుక్కర్ లో బియ్యం, పెసరపప్పును తీసుకుని శుభ్రంగా కడగాలి. ఇప్పుడు అందులో సన్నగా తరిగిన వెల్లుల్లి, చిన్న ఉల్లిపాయల తరుగు, క్యారెట్ తురుము, జీలకర్ర, మెంతులు, ఎండు మిరపకాయ, ఉప్పు వేసి 5 కప్పుల నీళ్లు పోయాలి.
-కుక్కర్ మూతపెట్టి 8-9 విజిల్స్ వచ్చేవరకు మెత్తగా ఉడికించాలి.
-గంజి ఉడికేలోపు చమ్మంతిని(కేరళలో తయారయ్యే ఒక రకమైన చట్నీ) రెడీ చేసుకోండి. ఇందుకోసం మిక్సీ జార్ లో చమ్మంతికి కావలసిన పదార్థాలన్నీ వేసి, నీళ్లు కలపకుండా గట్టిగా గ్రైండ్ చేసుకొని ఒక ఉండలా చేసుకోవాలి.
-కుక్కర్ లోని ఆవిరి పూర్తిగా పోయిన తర్వాత మూత తీసి ఒక గరిటతో గంజిని మెత్తగా మెదుపుకోవాలి. అవసరమైతే కొద్దిగా వేడినీళ్లు, తాజా కొబ్బరి తురుము వేసి బాగా కలపాలి. అంతే ఎంతో రుచికరమైన, ఆరోగ్యకరమైన కేరళ పెసరపప్పు గంజి రెడీ. దీనిని కొబ్బరి చమ్మంతితో కలిపి వేడివేడిగా తింటే ఆ మజాయే వేరు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications