రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ మసాలా దోశ ఇంట్లోనే.. ఈ రెండు సీక్రెట్స్ తెలిస్తే చాలు!

Posted By:

దోశ తినని తెలుగు వారుండరు. ఉదయమైనా, మధ్యాహ్నామైనా, సాయంత్రమైనా, రాత్రి అయినా ఎప్పుడైనా సరే దోశలు తింటుంటారు మనోళ్లు. అయితే ఇంట్లో పోసుకునే దోశల కన్నా రెస్టారెంట్లు, హోటల్స్ లో దొరికే కాగితంలా పలుచగా, కరకరలాడే మసాలా దోశ అంటే ప్రాణం పెట్టేవాళ్లు చాలా మందే ఉంటారు.
ఆ అద్భుతమైన రుచి కోసం ప్రతిసారీ రెస్టారెంట్‌కు పరుగులు తీస్తున్నారా? అయితే ఇకపై ఆ అవసరం ఏమాత్రం లేదు. కేవలం కొన్ని చిన్నపాటి చిట్కాలు పాటిస్తే, మీ ఇంట్లోనే అచ్చం రెస్టారెంట్ స్టైల్ మసాలా దోశను ఈజీగా తయారు చేసుకోవచ్చు.

Secret Revealed How to Make Restaurant Style Crispy Masala Dosa at Home in Telugu

ఆ రెండు రహస్య పదార్థాలు ఇవే..

పర్ఫెక్ట్ దోశ రావాలంటే కేవలం పిండి రుబ్బడం మాత్రమే కాదు, అందులో కలిపే పదార్థాలు కూడా ఎంతో ముఖ్యం. హోటల్ వాళ్లు వాడే ఆ రెండు రహస్య పదార్థాలు బొంబాయి రవ్వ, చక్కెర. బొంబాయి రవ్వ దోశకు అద్భుతమైన కరకరలాడే (క్రిస్పీ) గుణాన్ని ఇస్తుంది పిండిలో చిటికెడు చక్కెర కలపడం వల్ల దోశకు ఆ ఆకర్షణీయమైన గోల్డెన్ బ్రౌన్ కలర్ రావడంతో పాటు రుచి కూడా అమాంతం పెరుగుతుంది.

పిండి తయారీ విధానం

ముందుగా బియ్యాన్ని రాత్రంతా నీళ్లలో నానబెట్టుకోవాలి. మరుసటి రోజు ఉదయాన్నే నీటిని వడకట్టి, బియ్యాన్ని మెత్తగా రుబ్బుకోవాలి. ఈ మిశ్రమంలో తగినంత బొంబాయి రవ్వ, చిటికెడు పంచదార వేసి బాగా కలుపుకోవాలి. పిండి మరీ నీళ్లలా పల్చగా కాకుండా, అలాగని మరీ గట్టిగా కాకుండా సరైన పదునులో ఉండేలా చూసుకోవాలి. అప్పుడే దోశలు పర్ఫెక్ట్‌ గా వస్తాయి.

దోశ వేసే అసలైన ట్రిక్

దోశ వేయడానికి ముందు పెనం బాగా వేడెక్కాలి. ఆ తర్వాత కొద్దిగా నూనె లేదా వెన్న రాసి, గరిటెతో పిండిని తీసుకుని పెనం మధ్యలో పోసి గుండ్రంగా, పలుచని పొరలా వేగంగా తిప్పాలి. దోశ కొంచెం కాలాక, దాని పైన కొద్దిగా స్వచ్ఛమైన నెయ్యి వేయండి. ఆ నెయ్యి సువాసనకు దోశ రుచి రెట్టింపు అవుతుంది.

90స్ కిడ్స్ ఫేవరెట్ కొబ్బరి మిఠాయి.. అప్పటి ఆ రుచిని ఇంట్లోనే ఈజీగా ఇలా చేసేయండి!

మసాలా తయారీ

ఉడికించిన బంగాళదుంపలకు పసుపు, జీలకర్ర పొడి, తగినన్ని మసాలా దినుసులు దట్టించి కమ్మని కూరలా తయారు చేసుకోవాలి. దోశ కాలుతున్నప్పుడు మధ్యలో ఈ ఆలు మసాలాను ఉంచాలి. మీకు మరింత స్పెషల్ రుచి కావాలంటే కొద్దిగా వేయించిన పనీర్ ముక్కలను, సన్నగా తరిగిన కొత్తిమీరను పైన చల్లుకోవచ్చు. దోశ ఎర్రగా, కరకరలాడేలా వేగగానే తీసేయాలి, ఎక్కువసేపు ఉంచి మాడనివ్వకూడదు.

ఎలా వడ్డించాలంటే?

వేడివేడి మసాలా దోశను ప్లేట్లోకి తీసుకుని పక్కన కమ్మటి పచ్చికొబ్బరి చట్నీ, వేడివేడి సాంబార్, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కొద్దిగా ఊరగాయ పెట్టుకుని తింటుంటే.. ఆ మజాయే వేరు.

[ of 5 - Users]
Story first published: Monday, August 3, 2026, 16:00 [IST]
Desktop Bottom Promotion