Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
మీ రెగ్యులర్ టీలో ఈ 3 పదార్థాలు కలిపితే.. మండువేసవిలోనూ ఎంతో చల్లదనం!
భారతీయులకు టీ అంటే కేవలం ఒక పానీయం మాత్రమే కాదు.. అదొక ఎమోషన్. పొద్దున లేవగానే ఓ కప్పు వేడి వేడి చాయ్ పడితే కానీ చాలామందికి రోజు మొదలవ్వదు. అయితే ఎండాకాలం వచ్చేసరికి టీ ప్రియులకు పెద్ద కష్టమే వచ్చి పడుతుంది. బయట మండిపోతున్న ఎండలు, ఉక్కిరిబిక్కిరి చేసే ఉక్కపోత.. వీటికి తోడు వేడి వేడి టీ తాగితే శరీరం మరింత వేడెక్కిపోతుందేమో అన్న భయం. అందుకే టీ తాగాలని ఎంత ఇష్టం ఉన్నా సరే.. వేసవిలో బలవంతంగా దానికి దూరంగా ఉంటారు. అయితే మన వంటింట్లో సులభంగా దొరికే కేవలం మూడు సహజసిద్ధమైన పదార్థాలు పుదీనా,సోంపు, యాలకలను మీ రెగ్యులర్ టీలో కలుపుకుంటే చాలు.. ఆ టీ మీకు వేడి చేయకపోగా, వేసవిలో అద్భుతమైన చల్లదనాన్ని, రోజంతా తాజాదనాన్ని ఇస్తుంది.

మామూలు టీ తాగిన తర్వాత వేసవిలో కడుపులో కాస్త బరువుగా, వేడిగా అనిపిస్తుంది. కానీ ఈ పుదీనా, సోంపు, యాలకుల టీ తాగితే మాత్రం ఎలాంటి భారమైన భావన లేకుండా ఎంతో తేలికగా, రిఫ్రెషింగ్ గా ఉంటుంది. పుదీనా ఆకులకు సహజంగానే శరీరాన్ని చల్లబరిచే అద్భుతమైన గుణం ఉంటుంది. ఎండలో తిరిగి వచ్చిన తర్వాత అలసటగా అనిపించినప్పుడు ఈ పుదీనా టీ తాగితే తక్షణ శక్తి, ఉత్సాహం వస్తాయి. సోంపు టీలో వేసి మరిగిస్తే, అది శరీరాన్ని లోపలి నుంచి చల్లబరుస్తుంది. కడుపులో ఉబ్బరంగా ఉన్నప్పుడు ఈ టీ కడుపుకు ఎంతో తేలికైన అనుభూతిని ఇస్తుంది. టీలో యాలకులు వేయడం వల్ల వచ్చే కమ్మని సువాసన మనసుకు అద్భుతమైన ప్రశాంతతను చేకూరుస్తుంది.
స్పెషల్ సమ్మర్ టీ ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి
సమ్మర్ స్పెషల్ టీ తయారీకి కావాల్సిన పదార్థాలు
సోంపు - 1 టీస్పూన్
తాజా పుదీనా ఆకులు - 6 నుంచి 7
యాలకులు - 1 లేదా 2 (కొద్దిగా దంచినవి)
టీ పొడి - అవసరమైనంత
చక్కెర - మీ రుచికి సరిపడా
పాలు, నీళ్లు - తగినన్ని

సమ్మర్ స్పెషల్ టీ తయారీ విధానం
-ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకుని అందులో తగినన్ని నీళ్లు, పాలు పోసి మరిగించాలి. మరింత కడక్ చాయ్ ఇష్టపడేవారు ముందుగా నీళ్లను మరిగించి, ఆ తర్వాత పాలు కలుపుకోవచ్చు.
-నీళ్లు మరుగుతున్న సమయంలో అందులో టీ పొడి, రుచికి సరిపడా చక్కెర వేసి బాగా కలపాలి. టీ కాస్త మరుగుతున్న సమయంలో అందులో సోంపు, తాజా పుదీనా ఆకులు, కచ్చాపచ్చాగా దంచిన యాలకులు వేయాలి. ఈ మిశ్రమాన్ని సిమ్ లో పెట్టి మరో రెండు, మూడు నిమిషాల పాటు బాగా మరిగించాలి. అప్పుడే ఈ మూడు పదార్థాలలోని సుగుణాలు, ఫ్లేవర్లు టీలోకి సంపూర్ణంగా దిగుతాయి.
-ఇల్లంతా కమ్మని వాసన వస్తున్న సమయంలో స్టవ్ ఆపేసి వడకట్టుకుని వేడివేడిగా ఆస్వాదించడమే.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications